తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Back Pain రెగ్యులర్‌గా వస్తుందా.. ఈ ఆయుర్వేద చిట్కాలతో నొప్పి దూరం

Back Pain రెగ్యులర్‌గా వస్తుందా.. ఈ ఆయుర్వేద చిట్కాలతో నొప్పి దూరం

04 January 2022, 10:40 IST

    • వర్క్ ఫ్రమ్ హోం కొంతమందికి అనుకూలంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి అనేక సమస్యలు తీసుకొస్తోంది. పనిగంటలు పెరగడం ఇందులో ప్రధాన సమస్య. బెడ్రూం, హాల్, డైనింగ్ టేబుల్ ఈ విధంగా రకరకాల ప్రదేశాల్లో ఎక్కువసేపు కదలకుండా పనిచేయడం వల్ల వెన్నునొప్పికి దారితీస్తుంది.
వెన్నునొప్పి
వెన్నునొప్పి (Hindustan times)

వెన్నునొప్పి

Back Pain.. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఎంతో మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేయడం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు తమ ఎంప్లాయిస్ ను కార్యాలయాలకు తిరిగి పిలుస్తున్నప్పటికీ ఏడాదిన్నర నుంచి గరిష్ఠంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోం కొంతమందికి అనుకూలంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి అనేక సమస్యలు తీసుకొస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

పనిగంటలు పెరగడం ఇందులో ప్రధాన సమస్య. బెడ్రూం, హాల్, డైనింగ్ టేబుల్ ఈ విధంగా రకరకాల ప్రదేశాల్లో ఎక్కువసేపు కదలకుండా పనిచేయడం వల్ల వెన్నునొప్పికి దారితీస్తుంది. సుదీర్ఘ పనిగంటలే కాకుండా సరైన సపోర్టివ్ ఛెయిర్(Supportive chair) లేకపోవడం, సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువవుతుంది.

ఇవి కాకుంండా శారీరక వ్యాయామం లేకపోవడం, విరామాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తీవ్రమవుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ దీక్షా భావ్సార్ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. వీటితో పాటు ఉబకాయం, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా అదనంగా వస్తున్నాయని స్పష్టం చేశారు. 

ఇంటి నుంచి పనిచేస్తున్నవారిలో అధికంగా వెన్నునొప్పి గురించే ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు కూడా ఆమె వివరించారు.

వెన్నునొప్పిని నివారించే చిట్కాలు..

- బ్యాక్ పెయన్ ఉన్నవారు మీరు నిద్రించేటప్పుడు మీ తలకింద దిండు లేదా మెత్త(Pillow) లేకుండా చూసుకోవాలి.

- ఆసనాలు వేయడం వల్ల పరిస్థితిని కొంతవరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగాసనం లాంటి ఆసనాలు రోజూ వేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

- ఒకే పొజిషన్ లో రెండు గంటలకు మించి కూర్చోకూడదు. అంతేకాకుండా రెండు గంటలకు కనీసం 5 నిమిషాల విరామం తీసుకోవడం ఉత్తమం.

- నూనెతో మీ వెనుకభాగానికి మసాజ్ లేదా మర్దన చేయడం(అభ్యంగన) ద్వారా నొప్పిని నివారించవచ్చు. ఇందుకోసం మహానారాయణ, అశ్వగంధ, ధన్వంతరం లాంటి నూనెలను ఉపయోగించవచ్చు.

ఒకవేళ మీకు వెన్నునొప్పి నరాల కుదింపు కారణంగా వస్తుంటే లేదా దీర్ఘకాలంగా బ్యాక్ పెయిన్ ఉన్నట్లయితే పైన పేర్కొన్న ఈ ఆయుర్వేద చిట్కాలతో పాటు ఆయుర్వేద మందుల వాడకంతో నొప్పిని సమర్థవంతంగా నివారించవచ్చని డాక్టర్ దీక్షా భావ్సార్ తెలిపారు.

 

టాపిక్

తదుపరి వ్యాసం