తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Myths: ఆయిల్ ఫుడ్‌ తింటే మొటిమలొస్తాయా? అపోహాలు, వాస్తవాలు తెలుసుకోండి..

skin myths: ఆయిల్ ఫుడ్‌ తింటే మొటిమలొస్తాయా? అపోహాలు, వాస్తవాలు తెలుసుకోండి..

18 May 2023, 10:53 IST

  • skin myths: చర్మం విషయంలో కొన్ని అపోహలున్నాయి. వాటినే మనం నిజాలనుకుంటున్నాం. కొన్ని విషయాల్లో వాస్తవాలేంటో తెలుసుకుందాం. 

చర్మం విషయంలో అపోహలు వాస్తవాలు
చర్మం విషయంలో అపోహలు వాస్తవాలు (Photo by Perchek Industrie on Unsplash )

చర్మం విషయంలో అపోహలు వాస్తవాలు

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. దీని సంరక్షణ కూడా చాలా ముఖ్యం. కానీ చర్మ సంరక్షణ విషయంలో చాలా అపోహలుంటాయి. ముఖం కడుక్కునే విషయంలో, వివిధ ఉత్పత్తులు వాడే విషయంలో చాలా సందేహాలుంటాయి. మనం అవగాహన లేకుండా చేసే తప్పుల వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇంతకీ చర్మం విషయంలో ఉన్న అపోహలు వాస్తవాలు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

  1. అపోహ: నూనె ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల యాక్నె వస్తుంది.

వాస్తవం: చర్మం నుంచి విడుదలయ్యే నూనె లాంటి సీబమ్ వల్ల యాక్నె వస్తుంది. ఆయిలీ ఫుడ్ తింటే యాక్నె వస్తుందనటానికి ఎలాంటి రుజువు లేదు.

2. అపోహ: జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు మాయిశ్చరైజర్ అవసరం లేదు

వాస్తవం: అన్ని రకాల చర్మతత్వం ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

3. అపోహ: ఎండ ఉన్నప్పుడే సన్‌స్క్రీన్ రాసుకోవాలి

వాస్తవం: యూవీ కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. అందుకే ఎండ లేకపోయినా కూడా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

4. అపోహ: ఖరీదైన ఉత్పత్తులే ఎక్కువగా పనిచేస్తాయి

వాస్తవం: ఖరీదైన ఉత్పత్తులే బాగుంటాయని ఏం లేదు. తక్కువ ధరలో అయినా చర్మానికి తగ్గట్లు ఎంచుకోవాలంతే.

5. అపోహ: ఎక్కువగా క్రీములు వాడితే మంచి పలితాలుంటాయి

వాస్తవం: నిజానికి అవసరమైనదానికన్నా ఎక్కువ క్రీములు రాసుకోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. అందుకే ఏదైనా ఉత్పత్తి వాడేటపుడు ఎంత రాసుకోవాలో స్పష్టత ఉండాలి. ప్యాకేజింగ్ మీద దానికి సంబంధించిన వివరాలు చూసి వాడాలి.

6. అపోహ: సహజమైన పదార్థాలే చర్మానికి మంచివి

వాస్తవం: వాటివల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అలాని ప్రతిదీ మంచిది కాదు. చర్మానికి నప్పే పదార్థాలేంటో తెలుసుకుని వాడాలి. కొన్ని సార్లు, కొన్ని సమస్యలకు సహజ పదార్థాలకన్నా క్రీములు, సౌందర్య ఉత్పత్తులే బాగా పనిచేయొచ్చు.

7. అపోహ: ఎస్‌పీ‌ఎఫ్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది

వాస్తవం: సన్ స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. కానీ ఎస్‌పీ‌ఎఫ్ ఒక్కటే ముఖ్యం కాదు. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్, ఎస్‌పీ‌ఎఫ్ 30 నుంచి 50 మధ్యలో ఎంచుకోవాలి.

8. అపోహ: ప్రతిరోజూ స్క్రబింగ్ చేయడం మంచిది

వాస్తవం: ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల చర్మం మీద ఉన్న సహజ నూనెలు తగ్గిపోతాయి. దద్దుర్లు, చర్మం పొడిబారడం సమస్యలొస్తాయి. వారానికి ఒకసారి స్క్రబింగ్ చేసుకుంటే చాలు.

మీ చర్మతత్వం గురించి తెలుసుకుని దానికి తగ్గ రొటీన్ ఫాలో అవ్వండి. మీకు నప్పే ఉత్పత్తులు ఎంచుకోండి. ఒకరికి నప్పిండి మీకు నప్పాలని లేదు.

తదుపరి వ్యాసం