effective tips for dry skin in summer: వేసవిలో కూడా చర్మం పొడిబారుతోందా..-effective tips that will help you say goodbye to dry skin this summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Effective Tips For Dry Skin In Summer: వేసవిలో కూడా చర్మం పొడిబారుతోందా..

effective tips for dry skin in summer: వేసవిలో కూడా చర్మం పొడిబారుతోందా..

Apr 20, 2023, 07:21 PM IST Koutik Pranaya Sree
Apr 20, 2023, 07:21 PM , IST

effective tips for dry skin in summer: శరీరానికి అవసరమయ్యేన్ని నీళ్లు తాగుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆ జాగ్రత్తలేంటంటే..

వేసవిలో చర్మం పొడిబారడం చాలా మంది ఎదుర్కునే సమస్య.  వేడిగా, తేమగా ఉండే వేసవి వాతావరణం వల్ల చర్మంలో ఉన్న నీటిశాతం తగ్గుతుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండదు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మీ చర్మం గురించి ఆందోళన చెందకుండా ఈ వేసవిలో హాయిగా ఉండొచ్చు.  ఈ 8 చిట్కాలు పాటించి చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.  

(1 / 9)

వేసవిలో చర్మం పొడిబారడం చాలా మంది ఎదుర్కునే సమస్య.  వేడిగా, తేమగా ఉండే వేసవి వాతావరణం వల్ల చర్మంలో ఉన్న నీటిశాతం తగ్గుతుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండదు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మీ చర్మం గురించి ఆందోళన చెందకుండా ఈ వేసవిలో హాయిగా ఉండొచ్చు.  ఈ 8 చిట్కాలు పాటించి చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.  (Pexels)

మాయిశ్చరైజర్ రాసుకోవడం: ఆరోగ్యకరమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. వేసవిలో నీటి ఆధారిత మాయిశ్చరైజర్ ఎంచుకోవడం వల్ల చర్మం జిడ్డుగా కాదు.

(2 / 9)

మాయిశ్చరైజర్ రాసుకోవడం: ఆరోగ్యకరమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. వేసవిలో నీటి ఆధారిత మాయిశ్చరైజర్ ఎంచుకోవడం వల్ల చర్మం జిడ్డుగా కాదు.(Pexels)

హైడ్రేషన్ కీలకం:  చర్మాన్నిఆరోగ్యంగా ఉంచే సులభ మార్గాలలో వీలైనన్ని ఎక్కువ నీరు తాగడం ఒక్కటి. మామూలు రోజుల కన్నా వేసవిలో కాస్త ఎక్కువ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో ఉన్న టాక్సిన్లను నీరు బయటకు పంపుతుంది. చర్మాన్ని తేమగా ఉంచే హైడ్రేటింగ్ ఫేస్ మాస్కులు, టోనర్లు, క్రీమ్‌లు, సీరమ్‌లు కూడా వాడొచ్చు.  

(3 / 9)

హైడ్రేషన్ కీలకం:  చర్మాన్నిఆరోగ్యంగా ఉంచే సులభ మార్గాలలో వీలైనన్ని ఎక్కువ నీరు తాగడం ఒక్కటి. మామూలు రోజుల కన్నా వేసవిలో కాస్త ఎక్కువ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో ఉన్న టాక్సిన్లను నీరు బయటకు పంపుతుంది. చర్మాన్ని తేమగా ఉంచే హైడ్రేటింగ్ ఫేస్ మాస్కులు, టోనర్లు, క్రీమ్‌లు, సీరమ్‌లు కూడా వాడొచ్చు.  (Pexels)

సూర్యుని నుంచి చర్మాన్ని కాపాడుకోండి: ఎండవల్ల చర్మం పొడిబారకుండా సన్‌స్క్రీన్ కాపాడుతుంది. కనీసం SPF30 ఉండే సన్‌స్క్రీన్ ఎంచుకోండి. 

(4 / 9)

సూర్యుని నుంచి చర్మాన్ని కాపాడుకోండి: ఎండవల్ల చర్మం పొడిబారకుండా సన్‌స్క్రీన్ కాపాడుతుంది. కనీసం SPF30 ఉండే సన్‌స్క్రీన్ ఎంచుకోండి. (Unsplash )

వేడి నీటి స్నానం వద్దు: ఎక్కువసేపు స్నానం చేయడం, వేడినీటితో చేయడం మంచిది కాదు. దీనివల్ల చర్మం ఎర్రగా అవ్వడమే కాకుండా, దురద వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీళ్లతో 10 నిమిషాల్లో స్నానం పూర్తయ్యేలా చూసుకోండి.  

(5 / 9)

వేడి నీటి స్నానం వద్దు: ఎక్కువసేపు స్నానం చేయడం, వేడినీటితో చేయడం మంచిది కాదు. దీనివల్ల చర్మం ఎర్రగా అవ్వడమే కాకుండా, దురద వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీళ్లతో 10 నిమిషాల్లో స్నానం పూర్తయ్యేలా చూసుకోండి.  (Pexels)

ఎక్స్‌ఫోలియేషన్ : చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ మంచి మార్గం. దానివల్ల మాయిశ్చరైజర్ చర్మం లోపలిపొరల వరకూ వెళుతుంది. వారానికి ఒకటి లేదంటే రెండు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. 

(6 / 9)

ఎక్స్‌ఫోలియేషన్ : చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ మంచి మార్గం. దానివల్ల మాయిశ్చరైజర్ చర్మం లోపలిపొరల వరకూ వెళుతుంది. వారానికి ఒకటి లేదంటే రెండు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. (Pexels)

సహజ సిద్ధమైన ఉత్పత్తులు: కలబంద, కీరదోస, కొబ్బరినూనె లాంటి సహజ సిద్ధమైన పదార్థాలుండే చర్మ ఉత్పత్తులను ఎంచుకోండి. వీటికి చర్మాన్ని తేమగా ఉంచే గుణం ఉండటం వల్ల చర్మం పొడబారకుండా కాపాడతాయి. చర్మానికి ఎలాంటి హాని ఉండదు.

(7 / 9)

సహజ సిద్ధమైన ఉత్పత్తులు: కలబంద, కీరదోస, కొబ్బరినూనె లాంటి సహజ సిద్ధమైన పదార్థాలుండే చర్మ ఉత్పత్తులను ఎంచుకోండి. వీటికి చర్మాన్ని తేమగా ఉంచే గుణం ఉండటం వల్ల చర్మం పొడబారకుండా కాపాడతాయి. చర్మానికి ఎలాంటి హాని ఉండదు.

సమతుల్య ఆహారం తినండి: ఆరోగ్యకరమైన ఆహారం మీ చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోండి. చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

(8 / 9)

సమతుల్య ఆహారం తినండి: ఆరోగ్యకరమైన ఆహారం మీ చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోండి. చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. (Pexels)

వదులు బట్టలు వేసుకోండి: బిగుతుగా ఉండే వస్త్రాల వల్ల చర్మం చికాకుగా అనిపిస్తుంది. దానివల్ల ర్యాషెస్, చర్మం పొడిబారే సమస్యలు ఎక్కువవుతాయి.  కాస్త వదులుగా ఉండే బట్టలైతే చర్మానికి హాయిగా అనిపిస్తాయి. 

(9 / 9)

వదులు బట్టలు వేసుకోండి: బిగుతుగా ఉండే వస్త్రాల వల్ల చర్మం చికాకుగా అనిపిస్తుంది. దానివల్ల ర్యాషెస్, చర్మం పొడిబారే సమస్యలు ఎక్కువవుతాయి.  కాస్త వదులుగా ఉండే బట్టలైతే చర్మానికి హాయిగా అనిపిస్తాయి. (Unsplash )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు