తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Redmi K50i । ఆకర్షణీయమైన ఫీచర్లతో రెడ్‌మి 5g స్మార్ట్‌ఫోన్‌!

Redmi K50i । ఆకర్షణీయమైన ఫీచర్లతో రెడ్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

20 July 2022, 16:10 IST

    • రెడ్‌మి నుంచి Redmi K50i పేరుతో ఒక మిడ్- రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదలయింది. ఇది 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి..
Redmi K50i
Redmi K50i

Redmi K50i

రెడ్‌మి ఇండియా తమ బ్రాండ్ నుంచి సరికొత్త అప్పర్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Redmi K50iను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ట్రూలీ గ్లోబల్ 5G కనెక్టివిటీతో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 67W టర్బో ఛార్జింగ్ వంటి ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లను ఇచ్చారు. ఈ సరికొత్త Redmi K50iలో ఇచ్చిన ప్రాసెసర్ వన్ ప్లస్ 10R, Realme GT Neo 3, ఒప్పో రెనో 8 Pro 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లలో కూడా కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

రూ. 25 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న Redmi K50iలో ఎన్నో ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా మెరుగైన రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌ చేసే స్క్రీన్ స్పష్టమైన వీక్షణ అనుభవాన్ని అందజేస్తుంది. అలాగే Dolby Atmos ఫీచర్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7-లేయర్ గ్రాఫైట్, అలాగే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ 2.0ని కలిగి ఉంది.

ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్లలో Redmi K50i లభిస్తుంది. అదనంగా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

Redmi K50i స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే
  • 6GB/8GB RAM, 128/256GB స్టోరేజ్ సామర్థ్యం
  • MediaTek డైమెన్సిటీ 8100 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+8MP+ 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5080 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఫాస్ట్ ఛార్జర్

Redmi K50i స్మార్ట్‌ఫోన్‌ ఫాంటమ్ బ్లూ, క్విక్ సిల్వర్,స్టెల్త్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ జూలై 23 నుంచి Mi.com, Mi హోమ్ స్టోర్స్, అమెజాన్ ఇండియా అలాగే ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ఫోన్ తో పాటు Redmi Buds 3 Liteని కూడా కంపెనీ విడుదల చేసింది. దీని ధర రూ. 1,999/- . ఇవి జూలై 31 నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూ. 500 డిస్కౌంట్ అందిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం