తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prediabetes Levels And Symptoms: ప్రిడయాబెటిస్‌ దశలో ఉన్నారా? ఇలా చేస్తే షుగర్ మాయమై నార్మల్ లెవెల్‌కు వచ్చేస్తారు..

Prediabetes levels and symptoms: ప్రిడయాబెటిస్‌ దశలో ఉన్నారా? ఇలా చేస్తే షుగర్ మాయమై నార్మల్ లెవెల్‌కు వచ్చేస్తారు..

HT Telugu Desk HT Telugu

24 January 2023, 17:56 IST

    • Prediabetes levels and symptoms: ప్రిడయాబెటిస్‌ దశలో ఉన్నారా? ఇలా చేస్తే డయాబెటిస్ దశకు చేరుకోకుండా ఉండడమే కాకుండా, తిరిగి సాధారణ స్థితికి రావొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రిడయాబెటిస్ లక్షణాలు, ప్రిడయాబెటిస్ లెవెల్స్, టెస్టులు, చికిత్స విధానాలను వివరిస్తున్నారు.
బార్డర్‌లైన్ డయాబెటిస్‌తో కంగారొద్దు.. సాధారణ స్థితికి తేవొచ్చంటున్న వైద్య నిపుణులు
బార్డర్‌లైన్ డయాబెటిస్‌తో కంగారొద్దు.. సాధారణ స్థితికి తేవొచ్చంటున్న వైద్య నిపుణులు (Freepik)

బార్డర్‌లైన్ డయాబెటిస్‌తో కంగారొద్దు.. సాధారణ స్థితికి తేవొచ్చంటున్న వైద్య నిపుణులు

షుగర్ బార్డర్‌లో ఉంది.. డయాబెటిస్ బార్డర్‌లో ఉంది.. ప్రిడయాబెటిస్ దశలో ఉన్నా.. అనే మాటలు తరచుగా వింటాం. అంటే టైప్ 2 డయాబెటిస్‌ వచ్చే దశకు చేరువైనట్టు లెక్క. అయితే అందరికీ ఆ పరిస్థితి రాదు. సింపుల్‌గా చెప్పాలంటే నార్మల్ రేంజ్‌లో ఉండాల్సిన మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయన్నట్టు. అయితే శుభవార్త ఏంటంటే ఈ పరిస్థితులను వెనక్కి మళ్లించవచ్చు. అంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో మీరు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

శరీరానికి అవసరమైన శక్తి గ్లూకోజ్ రూపంలో అందుతుంది. దానిని సరైన రీతిలో వినియోగించుకోలేనప్పుడు ఈ డయాబెటిస్ అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. జన్యుపరమైన, పర్యావరణ పరమైన కారణాల వల్ల డయాబెటిస్ రావొచ్చు. అంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఇన్సులిన్ తగిన మోతాదులో ఉత్పత్తి కాదు. ప్రిడయాబెటిస్ లేదా బార్డర్‌లైన్ డయాబెటిస్ దశల సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొన్నేళ్లపాటు మీకు తెలియకుండా అదే దశ కొనసాగవచ్చు. అయితే అది టైప్ 2 డయాబెటిస్ దశకు చేరుకునే ప్రమాదం ఉంటుంది. అంతిమంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు డయాబెటిస్ ముప్పు ఉంటే తరచూ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. ప్రిడయాబెటిస్ అని తేలితే మీరు ఆ కండిషన్ నుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి.

‘ప్రి-డయాబెటిస్‌ను కొన్నిసార్లు బార్డర్‌లైన్ డయాబెటిస్‌గా రెఫర్ చేస్తారు. అంటే టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. ఈ దశలోనే తిరిగి నార్మల్ స్థాయిలోకి షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడం సులువవుతుంది. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ అనుసరిస్తే టైప్-2 డయాబెటిస్ కూడా రివర్స్ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు అదుపులో పెట్టుకోవడం, రోజూ శారీరక వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకుంటాయి..’ అని డాక్టర్ మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రంజిత్ ఉన్నికృష్ణన్ చెప్పారు.

What exactly is borderline diabetes: బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటే?

‘బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటే నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటే ఎక్కువగా ఉండడం. కానీ డయాబెటిస్‌గా వర్గీకరించే రేంజ్‌లో షుగర్ లెవెల్స్ లేకపోవడం. అంటే మీ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 126 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్టు లెక్క. అలాగే మీకు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే మీకు డయాబెటిస్ లేదని, మీ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నాయని లెక్క. మరి బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటే అంటే మీ ఫాస్టింగ్ షుగర్ 100 నుంచి 120 ఎంజీ/డీఎల్ మధ్య ఉన్నట్టు లెక్క..’ అని డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ వి.మోహన్ వివరించారు.

What symptoms may be present: ప్రిడయాబెటిస్‌ లక్షణాలు ఏంటి?

డయాబెటిస్‌ను డయాగ్నోసిస్ ద్వారా నిర్ధారిస్తారు. అప్పటి వరకు చాలా కేసుల్లో అసలు లక్షణాలేవీ కనిపించవని డాక్టర్ మోహన్ చెప్పారు. ఈ కండిషన్ ఎక్కువ కాలం కొనసాగితే అది డయాబెటిస్‌కు దారితీస్తుందని, అప్పుడు డయాబెటిస్ సంబంధిత లక్షణాలను చూపుతుందని వివరించారు.

డయాబెటిస్ లక్షణాలు

  1. తరచూ మూత్రవిసర్జన చేయాల్సి రావడం
  2. దాహం పెరగడం
  3. ఆకలి పెరగడం
  4. అలసట
  5. చూపు మసకబారడం
  6. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం
  7. గాయాలు నయం కావడంలో ఆలస్యం

బార్డర్‌లైన్ డయాబెటిస్ ఆందోళన కలిగించే అంశమా?

మీకు భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ డెవలప్ అవుతుందని చెప్పే హెచ్చరిక సంకేతమే బార్డర్‌లైన్ డయాబెటిస్ అని డాక్టర్ మోహన్ చెప్పారు. ప్రిడయాబెటిస్ ఉన్న వారిలో మూడో వంతు డయాబెటిస్ దశకు చేరుకుంటారు. భారతీయుల్లో ఈ పరిణామం ఎక్కువగా ఉంటుంది. మీకు బార్డర్ లైన్ డయాబెటిస్ ఉండి అధిక కొలెస్ట్రాల్, హైబీపీ, స్మోకింగ్ ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కవుగా ఉంటుంది.

How is borderline diabetes diagnosed: ఎలాంటిి పరీక్షలు జరపాలి?

మీరు బార్డర్ లైన్ డయాబెటిస్ లేదా ప్రి డయాబెటిస్ దశలో ఉన్నారో లేదో తేల్చడానికి మీకు బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట ఏమీ తినకుండా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించుకోవాలి. లేదా హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకోవాలి. ప్రిడయాబెటిస్, డయాబెటిస్ ఉందో తేల్చడానికి ఈ టెస్ట్ పలుమార్లు రిపీట్ చేయాలి.

Who should go for these tests: టెస్టులు ఎవరు చేయించుకోవాలి?

మీకు డయాబెటస్ వచ్చేందుకు అవకాశం ఉందని మీకు అనిపిస్తే మీరు టెస్ట్ చేయించుకోవాలి. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ అవసరాన్ని నొక్కి చెబుతాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే.

1. అధిక బరువు ఉండడం

2. వయస్సు మీద పడడం

3. కుటుంబంలో డయాబెటిస్ హిస్టరీ ఉండడం

4. ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ రావడం

5. అధిక ఒత్తిడితో కూడిన పని వాతావరణం

6. యాంగ్జైటీ వంటి సమస్యలు

7. కొన్ని వ్యాధులకు స్టెరాయిడ్స్ వాడాల్సి రావడం వల్ల దుష్ప్రభవాలు

‘ఇండియన్ డయాబెటిస్ రిస్క్ స్కోర్ (ఐడీఆర్ఎస్) టూల్ ఒక వ్యక్తికి డయాబెటిస్ వస్తుందా? రాదో అంచనా వేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నాలుగు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా దీనిని అంచనా వేయొచ్చు. ముఖ్యంగా నడుము చుట్టుకొలత తదితర వివరాల ఆధారంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయొచ్చు..’ అని డాక్టర్ మోహన్ చెప్పారు.

How can borderline diabetes be managed? బార్డర్‌లైన్ డయాబెటిస్ ఎలా మేనేజ్ చేయాలి?

మీ కుటుంబంలో డయాబెటిస్ హిస్టరీ ఉన్నా లేకున్నా మీరు హెల్తీ లైఫ్‌స్టైల్ అనుసరిస్తే మీ ప్రిడయాబెటిస్ దశను వెనక్కి మళ్లించవచ్చు. టైప్ 2 డయాబెటిస్ దశకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా తిరిగి సాధారణ స్థితికి రప్పించవచ్చు.

Lifestyle changes to reverse borderline diabetes: బార్డర్‌లైన్ డయాబెటిస్‌లో అనుసరించాల్సిన జీవనశైలి

ప్రిడయాబెటిస్‌ స్థితిని రివర్స్ చేసేందుకు డైటీషియన్ ఉమాశక్తి కొన్ని హెల్తీ లైఫ్‌స్టైల్ మార్పులు సూచించారు. వాటిని అనుసరించాలని చెప్పారు.

  1. పోషకాహారం తీసుకోవడం
  2. రోజూ శారీరకంగా శ్రమించడం
  3. అధిక బరువు ఉంటే అదుపులో పెట్టుకోవడం
  4. పొగ, మద్యానికి దూరంగా ఉండడం

‘కేవలం 5 శాతం బరువు తగ్గినా ప్రిడయాబెటిస్ దశ నుంచి డయాబెటిస్ దశకు చేరకుండా చూడొచ్చు. అలాగే కార్బొహైట్రేడ్లను తగ్గించడం, ప్రొటీన్ పెంచడం, ఆరోగ్యకర కొవ్వులు తీసుకోవడం వల్ల ప్రిడయాబెటిస్ వెనక్కి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. కొన్ని కేసుల్లో మెడికేషన్ అవసరం అవ్వొచ్చు. మీరు డయాబెటాలజిస్ట్‌ను సంప్రదించాలి..’ అని ఉమాశక్తి వివరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం