తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే పిల్లలపై ప్రభావం.. అస్సలు చేయకండి

Parenting Tips : తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే పిల్లలపై ప్రభావం.. అస్సలు చేయకండి

Anand Sai HT Telugu

01 April 2024, 9:36 IST

    • Parenting Tips In Telugu : పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వారు జీవితంలో సక్సెస్ అవుతారు.
తల్లిదండ్రులకు చిట్కాలు
తల్లిదండ్రులకు చిట్కాలు (Unsplash)

తల్లిదండ్రులకు చిట్కాలు

పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. పిల్లల చూసుకోవడం అనేది సవాలుతో కూడుకున్న ప్రయాణం అనడంలో సందేహం లేదు. కొందరి తల్లిదండ్రుల వైఖరి పిల్లల శ్రేయస్సు, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. తల్లిదండ్రులు ప్రవర్తనలో కొన్ని సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తమ పిల్లలకు అనుకూలమైన వాతావరణాన్ని అందించేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

వారికి మీరే గుర్తుకు రావాలి

పిల్లల భావోద్వేగ అవసరాలకు ప్రతిస్పందించడం తల్లిదండ్రుల విధి. తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగాలను గుర్తించనప్పుడు, పిల్లలు అసమర్థంగా, అసురక్షితంగా భావిస్తారు. తల్లిదండ్రులు భావోద్వేగ కనెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు తమ భావాలను, భరోసా కోసం చూస్తారు. వారి భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి వారికి మీరే గుర్తుకు రావాలి. అప్పుడే ఏదైనా మీతో చెప్పుకోగలుగుతారు. మీరు కూడా వారిని లైట్ తీసుకుంటే మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారు.

తల్లిదండ్రులకు క్రమశిక్షణ అవసరమే

పిల్లల స్వీయ-క్రమశిక్షణ, బాధ్యత, నైతిక విలువల అభివృద్ధికి స్థిరమైన, న్యాయమైన క్రమశిక్షణ అవసరం. పిల్లలకు బోధించిన వాటిని తల్లిదండ్రులు కూడా పాటించాలి. లేకుంటే పిల్లలు అయోమయం, నిరుత్సాహం, అభద్రతా భావానికి గురవుతారు. తల్లిదండ్రులు స్పష్టమైన అంచనాలు, సరిహద్దులు, పర్యవసానాల గురించి చెప్పాలి. ఆప్యాయత, దయ, అవగాహనతో వారితో మాట్లాడాలి. మీరు క్రమశిక్షణతో ఉంటేనే పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు.

కమ్యూనికేషన్ కీలకం

తల్లిదండ్రుల-పిల్లల సంబంధాలకు కమ్యూనికేషన్ కీలకం. ప్రతికూలంగా మాట్లాడితే నమ్మకం, గౌరవం, సాన్నిహిత్యాన్ని నాశనం చేస్తాయి. పిల్లలను నిరంతరం విమర్శించడం, కించపరచడం, అరవడం, నిర్లక్ష్యంగా మాట్లాడే తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మగౌరవం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను దెబ్బతీస్తారు. తమను తాము బహిరంగంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలు, భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవాలి. గౌరవప్రదమైన, నిర్మాణాత్మకమైన సంభాషణను ఉపయోగించవచ్చు.

స్వీయ-సంరక్షణ

తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు. స్వీయ-సంరక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. మిమ్మల్ని మీరు కూడా చూసుకోవాలి. శారీరక, మానసిక శ్రేయస్సును నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైన మద్దతు అందించలేరు. తల్లిదండ్రులు స్వీయ-సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. సరిహద్దులను నిర్ణయించుకోవాలి. అవసరమైనప్పుడు భాగస్వాములు, కుటుంబ సభ్యుల మద్దతు పొందాలి.

క్షమాపణలు చేయాలి

పిల్లల పెంపకంలో తప్పులు అనివార్యం. అయితే తమ తప్పులను అంగీకరించని తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పడానికి, తప్పులను సరిదిద్దడానికి నిరాకరిస్తారు. తల్లిదండ్రులు వినయంగా, బాధ్యతాయుతంగా తమ తప్పులను అంగీకరించడం, హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పడం నేర్చుకోవాలి. సంబంధాన్ని సరిదిద్దడానికి, బలోపేతం చేయడానికి పిల్లలతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యం.

బంధం విలువ చెప్పాలి

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బంధం విలువ పిల్లలకు నేర్పించాలి. చాలా మంది తల్లిదండ్రులు ఈ ఫాస్ట్ లైఫ్ లో పడి.. పిల్లలకు విలువలు నేర్పించడం మానేశారు. ఇలా చేస్తే పెద్దలను పిల్లలు గౌరవించడం మానేస్తారు. ఇది మీ కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది కాదు.

తదుపరి వ్యాసం