తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parental Lies : పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల అబద్ధాల ప్రభావం.. దయచేసి ఆపేయండి

Parental Lies : పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల అబద్ధాల ప్రభావం.. దయచేసి ఆపేయండి

Anand Sai HT Telugu

02 April 2024, 16:30 IST

    • Parental Lies : తల్లిదండ్రులను చూసి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఈ సమయంలో వారితో మీరు చెప్పే కొన్ని రకాల అబద్ధాలు జీవితంపై ప్రభావం చూపిస్తాయి.
పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం
పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం (Unsplash)

పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం

తల్లిదండ్రుల ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే తయారవుతారు. నిజాయితీగా ఉండటం, పిల్లలను రక్షించడం అనేది తల్లిదండ్రుల కర్తవ్యం. తల్లిదండ్రులు తమ పిల్లలపై కొన్ని విషయాల్లో తరచుగా హానిచేయని అబద్ధాలను ఉపయోగిస్తారు. ప్రమాదకరం అనిపించే ఈ అబద్ధాలు పిల్లల మానసిక అభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రుల అబద్ధం పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

అదే అలవాటు అవుతుంది

తల్లిదండ్రులను పిల్లలు ఎక్కువగా విశ్వసిస్తారు. ఎందుకంటే వారు జ్ఞానం, మార్గదర్శకత్వం చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడే నాన్నే పిల్లలకు హీరో. అమ్మే మెుదటి గురువు. అలాంటి వారు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తే.. పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. కాలక్రమేణా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. పిల్లలను ఇది బలహీనపరచవచ్చు.

సమస్యలు వస్తాయి

చిన్న వయస్సులోనే పిల్లలతో విశ్వాసంగా ఉండాలి. నిజాయితీ మాటలు చెప్పాలి. అధిక విలువ ఇవ్వాలి. కానీ మీరు చెప్పే అబద్ధాలు ఈ పునాదులను కదిలిస్తాయి. పిల్లలు పెద్దయ్యాక కమ్యూనికేషన్ సమస్యలు, సంబంధాలు దెబ్బతీస్తాయి. వారికి అబద్ధాలు అలవాటైతే ఇతరులతోనూ అలానే కంటిన్యూ చేస్తారు.

ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది

చిన్న చిన్న అబద్ధాలు పెద్దగా అనిపించకపోయినా, పిల్లవాడు ప్రపంచాన్ని చూసే విధానంపై అవి పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. మీరు పిల్లలకు చెప్పే నీతి కథల్లోనూ అబద్ధాలు జొప్పించి చెప్పకూడదు. ఎందుకంటే దానినే వారు నిజం అనుకుని నమ్మేస్తారు. విలువలతో కూడిన మాటలు చెప్పాలి.

ఉదాహరణకు ఏదైనా కొనిస్తానని అబద్ధాలు కూడా చెప్పకూడదు. ఎందుకంటే వారు అదే ఆలోచనల్లో ఉంటారు. గందరగోళానికి గురువుతారు. వారు మీపై అనుమానం పెంచుకునే అవకాశం ఉంది. ఇది ఇలాగే అయితే.. ప్రతీ విషయంలోనూ వారికి అదే అలవాటు అవుతుంది. పాజిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి.

నిజాయితీగా చేయాలి

బహిరంగ, నిజాయితీతో కూడిన సంభాషణల మధ్య పెరిగిన పిల్లలు ఉన్నత స్థాయి నైతిక ప్రవర్తనను ప్రదర్శిస్తారు. నిజాయితీని ఆదర్శంగా తీసుకునే తల్లిదండ్రులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు చేసే సొంత పనులను కూడా పిల్లలు పరిశీలిస్తూ ఉంటారు. ఏదైనా పనిని నిజాయితీగా, కష్టపడి చేయాలి. అదే పిల్లలకు అలవాటు అవుతుంది. సమస్య పరిష్కారానికి, నిర్ణయం తీసుకోవడానికి ఆరోగ్యకరమైన విధానాన్ని అభివృద్ధి చేయాలి.

మానసిక శ్రేయస్సు ప్రభావితం

కుటుంబంలో ఎదురయ్యే అబద్ధాల వల్ల పిల్లల మానసిక శ్రేయస్సు ప్రభావితమవుతుంది. పదేపదే మోసం చేయడం వల్ల పిల్లలలో ఒత్తిడి, ఆందోళన, ద్రోహం భావాలు పెరుగుతాయి. వయస్సుకు తగిన కష్టమైన అంశాలను చర్చించడం వల్ల పిల్లలు భావోద్వేగ మేధస్సును అభివృద్ధి చేయడంలో సాయపడినవారవుతారు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది.

ప్రశ్నించేతత్వం నేర్పాలి

కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు నిజాయితీగా సంభాషించుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం, వారికి స్పష్టమైన, వయస్సుకి తగిన సమాధానాలు ఇవ్వడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. వారి ఆలోచనలు, ఆందోళనలను పంచుకోవడానికి మంచి వాతావరణాన్ని సృష్టించాలి. పైన చెప్పినవన్నీ పిల్లలు ఎదిగే క్రమంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

తదుపరి వ్యాసం