తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nubia Red Magic 7s Pro । 18gb ర్యామ్‌తో శక్తి వంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్!

Nubia Red Magic 7S Pro । 18GB ర్యామ్‌తో శక్తి వంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్!

HT Telugu Desk HT Telugu

28 July 2022, 14:53 IST

    • నుబియా తన కొత్త గేమింగ్ ఫోన్‌గా నుబియా రెడ్ మ్యాజిక్ 7ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ధర ఎంత, ప్రత్యేకతలు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Nubia Red Magic 7S Pro
Nubia Red Magic 7S Pro

Nubia Red Magic 7S Pro

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్, ZTE సబ్-బ్రాండ్ అయినటువంటి నుబియా ఒక శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ Nubia Red Magic 7S Proను తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఏకంగా 18GB RAM ఇచ్చారు, అలాగే 512 GB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

మెరుగైన స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌, శక్తివంతమైన చిప్‌సెట్‌ మొదలైన అంశాలు వేగవంతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. నిరాంతరాయంగా గేమింగ్ కొనసాగుతున్నప్పుడు ఫోన్ వేడిని చల్లబరిచేందుకు నుబియా స్మార్ట్‌ఫోన్‌లో 10-లేయర్ మల్టీ-డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్‌ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని సూపర్‌నోవా మోడల్‌లో RGB LED లైట్లతో కూడిన అంతర్నిర్మిత మెర్క్యురీ ఫ్యాన్‌తో పాటు అదనంగా ICE 10.0 మల్టీ-డైమెన్షనల్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇంకా రెడ్ కోర్ 1 గేమింగ్ చిప్ కూడా ఉంటుంది.

డిస్‌ప్లే వెనుక దాగి ఉండే ఫ్రంట్ కెమెరా, 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగిన ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌తో పాటు Nubia Red Magic 7S Pro గ్లోబల్ వెర్షన్‌లో ఇంకా ఎలాంటి స్పెక్స్ ఉన్నాయి? ధర ఎంత? తదితర విషయాలను ఈ కింద చూడండి.

Nubia Red Magic 7S Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
  • 12GB/18GB RAM, 256GB/512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+ 8MP +2MP ట్రిపుల్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 65W ఛార్జర్

12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర $729. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 59,000/-

18GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సూపర్‌నోవా వేరియంట్‌ ధర $899 దాదాపు రూ. 72,000)

నుబియా రెడ్‌మ్యాజిక్ 7ఎస్ ప్రో విక్రయాలు ఆగస్టు 9 నుంచి ప్రారంభమవుతాయి. నుబియా అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం