తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : విఫలమయ్యేది ప్రేమ మాత్రమే.. జీవితం కాదు

Monday Motivation : విఫలమయ్యేది ప్రేమ మాత్రమే.. జీవితం కాదు

Anand Sai HT Telugu

05 February 2024, 5:00 IST

    • Monday Motivation In Telugu : జీవితంలో ప్రేమ విఫలమైతే.. జీవితమే విఫలమైనట్టుగా బాధపడేవారు చాలా మంది. ప్రేమ విఫలమవ్వడం అంటే జీవితం అయిపోయినట్టుగా కాదు.
ప్రేమ విఫలమైతే జీవితం విఫలమైనట్టు కాదు
ప్రేమ విఫలమైతే జీవితం విఫలమైనట్టు కాదు (Unsplash)

ప్రేమ విఫలమైతే జీవితం విఫలమైనట్టు కాదు

మనల్ని ప్రేమించిన వారు మనతో ఉండటం మన అదృష్టం.. అదే వదిలేసి వెళ్తే మనలాంటి వారిని వదులుకోవడం వారి దురదృష్టం. ఇలానే ఆలోచించాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం. ప్రేమ విఫలమైతే జీవితమే విఫలం అయినట్టు కాదు. మనం కోసం మనల్ని ప్రేమించేవాళ్లు ఏదో ఒక చోట దొరుకుతారు. వారికోసం వెతకాలి. మనల్ని వదిలేసి వెళ్లినవారి కోసం ఆలోచిస్తూ కూర్చొకూడదు.

ప్రేమించిన వ్యక్తి మనతో ఉన్న రోజుల్లో జీవితం చాలా అందంగా ఉంటుందని మనకు తెలుసు. కానీ ప్రేమ విఫలమైతే జీవితం అంతా వృథా అనిపిస్తుంది. ఇలానే చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. కానీ మనల్ని వదిలేసి వెళ్లిన వారి కోసం జీవితాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఆ సమయంలో జీవితంలో ప్రతిదీ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. రోజురోజుకు పెరుగుతోంది. దాని నుండి బయటపడాలి. కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మనం జీవించే జీవితం ఒక్కసారే అని, అది వృథా కాకూడదని మీరు అర్థం చేసుకోవాలి.

మీరు చాలా సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం గడిపి ఉండవచ్చు. కానీ ఒక సంబంధం విచ్ఛిన్నమైతే, దానిని మీ వైఫల్యంగా పరిగణించవద్దు. ఎందుకంటే మనం ఎదుర్కొనే ప్రతి అపజయం విజయానికి తొలిమెట్టు. మొదట బ్రేకప్‌ను అంగీకరించడం చాలా ముఖ్యం. దీనిపై మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడే జీవితంలో పురోగతి సాధించగలం.

మిమ్మల్ని మీరు బలహీనంగా భావించొద్దు. విడిపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ, దాని కోసం మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్‌కు గురి చేస్తుంది. ఆ బంధంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మరచిపోయి ముందుకు సాగడమే తెలివైన పని. అప్పుడే జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో గడపగలం. అవతలి వారిది కూడా ఎంతో కొంత తప్పు ఉందని అనుకోవాలి.

ప్రేమ విఫలమైనప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు మీ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారని అర్థం. మీ దృష్టిని మరల్చడానికి ముందుగా మీ వాతావరణాన్ని మార్చుకోవాలి. అందుకోసం మీకు ఇష్టమైన ప్రదేశాలకు ప్రయాణం చేయవచ్చు. మీ మనస్సులో సానుకూలతను తెస్తుంది. జీవితం సరైన దిశలో వెళ్తుంది.

ప్రేమ సఫలమైతే మంచి కావ్యమౌతుంది..

విఫలమైతే మధుర కావ్యమౌతుంది.

ఎందుకంటే ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రేమలన్నీ విషాదాంతాలే..

అనంతమైన ప్రేమకు అంతం లేదు..

స్మరించే కొద్దీ ప్రేమ మధురాతి మధురం..

ఒక్కోసారి మన గురించి క్షణం కూడా ఆలోచించని వారి కోసం.. గంటలతరబడి ఆలోచించవలసి వస్తుంది.. ఆ విషయం మీకు అర్థమయిన మరుక్షణం ఆలోచించడం మానేయండి..

కొందరు మనకు ప్రపంచం అవుతారు.. బాధకరమైన విషయం ఏంటంటే వారి ప్రపంచంలో మనకు చోటు ఉండదు.

ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్తమౌతున్న ప్రతిసారీ కొత్తగా కనపడుతుంది.

నచ్చిన వారితో బతకాలని అందరికీ ఉంటుంది.. కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది..

తదుపరి వ్యాసం