తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hairfall Tips: జుట్టు రాలడాన్ని ఆపే హెయిర్ ఆయిల్, ఇంట్లోనే ఇలా తయారు చేయండి

Hairfall Tips: జుట్టు రాలడాన్ని ఆపే హెయిర్ ఆయిల్, ఇంట్లోనే ఇలా తయారు చేయండి

Haritha Chappa HT Telugu

08 December 2023, 11:28 IST

    • Hairfall Tips: జుట్టు రాలిపోవడం అనేది ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. దీనికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అందులో ఒకటి కరివేపాకు హెయిర్ ఆయిల్.
జుట్టుకు కరివేపాకు హెయిర్ ఆయిల్
జుట్టుకు కరివేపాకు హెయిర్ ఆయిల్ (Pixabay)

జుట్టుకు కరివేపాకు హెయిర్ ఆయిల్

Hairfall Tips: వాతావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఆహార విధానాలు, మానసిక సమస్యలు... ఇవన్నీ కూడా జుట్టు రాలిపోవడాన్ని ఎక్కువ చేస్తున్నాయి. జుట్టు రాలిపోవడం వల్ల ఎక్కువ మంది ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఎన్ని రకాల నూనెలు వాడుతున్నా ఫలితం లేనివారు ఒకసారి కరివేపాకు హెయిర్ ఆయిల్ ని ప్రయత్నించండి. కరివేపాకులో ఎన్నో పోషక పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో తయారు చేసిన నూనెను వాడడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గే అవకాశం ఉంది. దీన్ని ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కరివేపాకు హెయిర్ ఆయిల్ తయారీ

1. ఒక కప్పు నిండా తాజా కరివేపాకు ఆకులను తీసుకోవాలి. వాటిపై ఎలాంటి మురికి, మలినాలు లేకుండా కడగాలి.

2. ఈ ఆకులను గాలిలోనే పూర్తిగా ఆరనివ్వాలి. తేమ పూర్తిగా లేకుండా చూసుకోవాలి.

3. మీరు మీ జుట్టుకు ఏ ఆయిల్ వాడతారో దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. కొంతమంది కొబ్బరి నూనెను వాడితే మరికొందరు బాదం, ఆలివ్ ఆయిల్‌ను తలకు పట్టిస్తారు.

4. ఎక్కువ మంది కొబ్బరి నూనె తలకు రాస్తారు. కాబట్టి దాన్ని ఎంచుకోవడం మంచిది.

5. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి అందులో కొబ్బరి నూనె వేయాలి. చిన్న మంట మీద వేడి చేయాలి.

6. ఎక్కువ మంట మీద అధికంగా వేడి చేస్తే నూనెలోని పోషకాలన్నీ బయటకు పోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్న మంట మీద వేడి చేయాలి.

7. నూనె వేడెక్కిన తర్వాత ఎండిన కరివేపాకులను వేసి కలపాలి. అలా పావుగంట సేపు చిన్న మంట మీదే మరగనివ్వాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.

8. ఆ నూనెను గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు ఆ నూనెను వడకట్టి కరివేపాకులను తీసి పడేయాలి.

9. ఒక డబ్బాలో ఈ నూనెను స్టోర్ చేసుకోవాలి. రెండు మూడు రోజులకు ఒకసారి ఈ కరివేపాకు ఆయిల్‌ను తలకి పట్టిస్తూ ఉండాలి. మాడుకు తగిలేలా రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.

10. అలా రాసాక తేలికపాటి షాంపూతో స్నానం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు చేసినా చాలు మంచి ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది.

కరివేపాకులో జుట్టుకు మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది జుట్టును తెల్లబడకుండా కాపాడుతుంది. మెలనిన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. కరివేపాకుతో చేసిన హెయిర్ మాస్కులు అప్లై చేస్తే జుట్టు నల్లబడే అవకాశం ఉంటుంది. చుండ్రును పోగొట్టడంలో కూడా కరివేపాకు ముందుంటుంది. కరివేపాకును పేస్టులా చేసి పెరుగులో కలిపి దాన్ని తలకు మాస్కులా వేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.

ఆహారంలో కరివేపాకును తినడం వల్ల కూడా ఎన్నో మంచి ప్రభావాలు కలుగుతాయి. మన దక్షిణ భారత దేశంలో చాలా వంటలలో కరివేపాకు కనిపిస్తుంది. కానీ ఎంతో మంది దాన్ని తీసి పక్కన పడేస్తారు. అలా చేయకుండా కరివేపాకును తినేస్తే మంచిది. జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

తదుపరి వ్యాసం