తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lenovo Legion Y700 । గేమింగ్ కోసం Ultimate Edition టాబ్లెట్ వెర్షన్ విడుదల!

Lenovo Legion Y700 । గేమింగ్ కోసం Ultimate Edition టాబ్లెట్ వెర్షన్ విడుదల!

HT Telugu Desk HT Telugu

01 August 2022, 11:22 IST

    • లెనొవొ టాబ్లెట్ Legion Y700లో ఇప్పుడు సరికొత్త Ultimate Edition విడుదలైంది. ఇది గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన కాంపాక్ట్ వెర్షన్ టాబ్లెట్.
Lenovo Legion Y700 Ultimate Edition
Lenovo Legion Y700 Ultimate Edition

Lenovo Legion Y700 Ultimate Edition

పీసీ మేకర్ లెనొవొ తమ బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన Lenovo Legion Y700 టాబ్లెట్ ఫోన్‌కు అప్‌డేట్‌గా సరికొత్త Ultimate Editionను విడుదల చేసింది. లెనొవొ నుంచి వచ్చిన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లో వెనకభాగం గాజు ప్యానెల్‌తో వచ్చింది. ఇది టాబ్లెట్ ఆపరేషన్ సమయంలో గ్లాస్ కవర్ రంగును మారుస్తుంది. ఈ అల్టిమేట్ ఎడిషన్ ఇప్పుడు గేమింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాంపాక్ట్ వెర్షన్ టాబ్లెట్‌. ఇది ఆకర్షణీయమైన ఐస్ వైట్, గ్లేర్ బ్లూ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 870 చిప్ సెట్, 120 Hz- రిఫ్రెష్ రేట్ కలిగిన LCD ప్యానెల్‌ను వేగవంతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తాయి. అలాగే గేమింగ్ సెషన్‌లో RGB లైటింగ్ వెలగటం యూజర్లను ఆకర్షించే మరొక ఆసక్తికరమైన ఫీచర్.

ఇవి మినహా ఈ సరికొత్త Lenovo Legion Y700 Ultimate Editionలో కొత్తగా ఏమి లేవు. ఈ అల్టిమేట్ ఎడిషన్ టాబ్లెట్‌లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ప్రామాణిక లెజియన్ Y700 మోడల్‌కు సమానంగా ఉంటాయి, కాబట్టి ఇది నిజంగా "ప్రో" మోడల్ అని చెప్పటానికి వీలులేదు.

సరికొత్త Lenovo Legion Y700 Ultimate Editionకి సంబంధించి మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ధర ఎంత? తదితర వివరాలు ఈ క్రింద తెలుసుకోండి.

Legion Y700 Ultimate Edition టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన, 8.8-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
  • 12 GB RAM, 256 GB స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ స్లాట్
  • స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6550 mAh బ్యాటరీ సామర్థ్యం, 45W ఛార్జింగ్

కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్ PCలో Wi-Fi 6, బ్లూటూత్ 5.1, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ , టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇందులో JBL-ఆధారిత స్పీకర్ సెటప్, ఆవిరి శీతలీకరణ సిస్టమ్ కూడా కలిగి ఉంది.

దీని ధర CNY 3,699 (భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 43,400). ప్రస్తుతం ఇది చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల అవుతుందనే సమాచారంపై స్పష్టత లేదు.

టాపిక్

తదుపరి వ్యాసం