తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Replacement: మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీపై అపోహలు ఎన్నో.. అసలు నిజాలివే

Joint replacement: మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీపై అపోహలు ఎన్నో.. అసలు నిజాలివే

HT Telugu Desk HT Telugu

25 January 2023, 12:05 IST

    • Joint replacement: మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీపై అనేక అపోహలు నెలకొని ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తూ వైద్య నిపుణులు చెప్పిన వాస్తవాలు ఇక్కడ చదవండి.
Joint replacement: మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీలో ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవే
Joint replacement: మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీలో ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవే (Photo by Maksim Goncharenok on Pexels)

Joint replacement: మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీలో ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవే

జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో అరిగిపోయిన లేదా దెబ్బతిన్న కీళ్ల‌ను కృత్రిమ కీళ్లతో భర్తీ చేస్తారు. మోకాలు, తుంటి, భుజం కీళ్లు ఇలా కృత్రిమ కీళ్లతో భర్తీ చేసేందుకు వీలుంది. జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు నొప్పిని తగ్గించడంలో, కదిలే సామర్థ్యాన్ని కోల్పేతే పునరుద్ధరించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

సంపూర్ణ మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీలో అయితే మూడు భాగాలు (మీడియల్, లాటరల్, పాటెలోపెమొరాల్) భర్తీ చేయవచ్చు. అదే పాక్షిక మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ అయితే పాడైన భాగాన్ని భర్తీ చేస్తారు. మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ వల్ల మంచి ఫలితాలు ఉన్నా, దీని చుట్టూ కొన్ని అపోహలు నెలకొన్నాయి.

ముంబై గ్లోబల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్-ఆర్థోపెడిక్ డాక్టర్ అనూప్ ఖత్రీ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను వివరించారు. అపోహలను నివృతి చేస్తూ వాస్తవాలను మన ముందుంచారు.

1. అపోహ: మోకాలి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత మోకాలు వంగడం, మెట్లు ఎక్కడం, కాళ్లు మడిచి కూర్చోవడం లేదా నేలపై కూర్చోవడం సాధ్యం కాదు.

వాస్తవం: ఈ రోజుల్లో మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీలో ఉపయోగించే చాలా కృత్రిమ అవయవాలు (హై ఫ్లెక్సియన్ రకం) సాధారణ మోకాలి కీలు వలె కదలికను సాధ్యం చేస్తాయి. ఇది రోగులకు మోకాళ్లను వంచడానికి, మెట్లు ఎక్కడానికి, కాళ్లకు అడ్డంగా కూర్చోవడానికి అనుమతిస్తుంది. శస్త్రచికిత్స నాణ్యత, శస్త్రచికిత్స అనంతర రీహాబిలిటేషన్‌పై ఇది ఆధారపడి ఉంటుంది.

2. అపోహ: శస్త్రచికిత్స తర్వాత కొన్ని వారాల బెడ్ రెస్ట్ అవసరం. కోలుకోవడానికి నెలల సమయం పడుతుంది.

వాస్తవం: వాస్తవానికి రోగులు శస్త్రచికిత్స జరిగిన రోజునే నడవగలుగుతారు. చాలా మంది వ్యక్తులు శస్త్రచికిత్స చేసిన కొన్ని వారాలలోపే వారి సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.

3. అపోహ: కృత్రిమ మోకాలి ఇంప్లాంట్‌లలోని లోహం శరీరంలో అలెర్జీ కలిగిస్తుంది

వాస్తవం: ఉపయోగించే లోహాలు శరీర కణజాలంతో ప్రతిస్పందించవు. అలాగే టైటానియం మిశ్రమ పూతతో ఇంప్లాంట్లు ఉంటాయి. వీటిని బంగారు మోకాలు అని పిలుస్తారు. వీటి వల్ల అలెర్జీ ఉండదు. దీర్ఘకాలం మన్నుతాయని నిరూపితమైంది.

4. అపోహ: 65 ఏళ్ల తర్వాత శస్త్రచికిత్స చేయడం సాధ్యం కాదు.

వాస్తవం: శస్త్రచికిత్సకు వయస్సు పరిమితం చేసే అంశం కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ వయస్సు సంబంధిత సమస్యే. 65 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా మోకాలి మార్పిడిని విజయవంతంగా చేయించుకోవచ్చు.

5. అపోహ: శస్త్రచికిత్స సక్సెస్ రేటు చాలా తక్కువ.

వాస్తవం: మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చాలా మంది రోగులలో 95% సక్సెస్ రేటును కలిగి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. శస్త్రచికిత్స తర్వాత వ్యక్తులు తమ రోజువారీ కార్యకలాపాలను సౌకర్యవంతంగా, నొప్పి లేకుండా చేయగలుగుతారు.

6. అపోహ: శస్త్రచికిత్స తర్వాత జీవితకాల ఫిజియోథెరపీ అవసరం. రికవరీ చాలా నెమ్మదిగా ఉంటుంది.

వాస్తవం: దీర్ఘకాలిక ఫిజియోథెరపీ అవసరం లేదు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేర్పిన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తర్వాత రోగుల కోలుకునే ప్రక్రియ వేగంగా ఉంటుంది. అధునాతన మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ టెక్నిక్‌ల కారణంగా రోగులను 3 రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయవచ్చు. శస్త్రచికిత్సకు ముందు రోగుల పోషకాహార స్థితి, కండరాల బలాలు అనువుగా మార్చుకోవాలి.

అయితే ఇతర శస్త్రచికిత్సల మాదిరిగానే, ఈ శస్త్రచికిత్సకు కూడా కొన్ని ప్రయోజనాలు, రిస్కులు ఉంటాయి. మీ వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోవడం మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం