తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Immune System: ఈ ఐదింటికి దూరంగా ఉంటే చాలు.. రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది..

Immune System: ఈ ఐదింటికి దూరంగా ఉంటే చాలు.. రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది..

13 December 2023, 16:40 IST

  • Immune System: రోగ నిరోధక శక్తిని తగ్గించే ఆహారాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉంటే మన ఆరోగ్యం పెరిగినట్లే. అవేంటో చూసి ఆహారంలో వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తే సరి.

రోగనిరోధక శక్తి తగ్గించే ఆహారాలు
రోగనిరోధక శక్తి తగ్గించే ఆహారాలు (freepik)

రోగనిరోధక శక్తి తగ్గించే ఆహారాలు

మనం ఎక్కువగా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా ఉండాలి. శరీరంలోని హార్మోన్‌లు అవసరానికి అనుగుణంగా తగినంత విడుదల కావాలి. ప్రతి అవయవమూ దానికి సంబంధించిన పనిని అది సమర్థవంతంగా నిర్వర్తించగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా ఆనందంగా జీవనం సాగించ గలుగుతాం. అయితే మనం సరదా కోసమో, ఇష్టం మీదనో అనారోగ్యకరమైనవని తెలిసినా కూడా కొన్నింటిని తింటూనే ఉంటాం. అలాంటివి మన వ్యాధి నిరోధక శక్తిని మరింత సన్నగిల్లేలా చేస్తాయి. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

1. ఎక్కువ ఉప్పు ఉండే పదార్థాలు:

సోడియం ఎక్కువగా ఉండే పొటాటో చిప్స్‌, ఛీజ్‌ స్ప్రెడ్‌లు, ఎండు మాంసాలు, ఎండు చేపలు లాంటి వాటిలో అత్యధికంగా ఉప్పు ఉంటుంది. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి.

2. శీతల పానీయాలు:

చక్కెరలు అధికంగా ఉండే శీతల పానీయాలు, సోడాలు, ఎనర్జీ డ్రింకులు తదితరాలను తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల సరళ పిండి పదార్థాలు ఎక్కువగా శరీరంలోకి చేరిపోతాయి. అందువల్ల మధుమేహం లాంటివి వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా నీరు, కొబ్బరి బొండాలు, హెర్బల్‌ టీలు లాంటి వాటిని తీసుకునేందుకు ప్రయత్నించాలి.

3. మద్యం:

ఆల్కహాల్‌ని సేవించే అలవాటు కొంత మందికి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీర వ్యవస్థలు అన్నింటిపైనా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అందుకనే ఇలాంటి వారికి ఆరోగ్యం అంతకంతకూ మందగించిపోతూ ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచే వాటిలో ఇది ఒకటి.

4. వేపుడు పదార్థాలు:

నూనెల్లో వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండటం వల్ల అవి మన శరీరంలో వాపులకు కారణం అవుతాయి. అందువల్ల కొన్ని అవయవాలు వాటి విధులను సరిగ్గా నిర్వర్తించలేకపోతాయి. ఫలితంగా అనారోగ్యాలు కలుగుతాయి.

5. ప్రాసెస్డ్‌ ఆహారాలు:

దుకాణాల్లో రెడీ టూ ఈట్‌ అని దొరికే ప్రాసెస్డ్‌ ఆహారాలు, ప్యాక్డ్‌ ఆహారాలను తరచుగా తింటూ ఉండటం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. ఈ ఆహారాలు ఎక్కువ కాలం చెడిపోకుండా తాజాగా ఉండేందుకు వీటిలో రకరకాల రసాయనాలను కలుపుతారు. అలాంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మరింత బలహీనమైపోతుంది.

కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి. రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా ఉండాలి. అని భావించే వారు కచ్చితంగా ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

తదుపరి వ్యాసం