తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shahi Egg Curry Recipe । స్పైసీగా, టేస్టీగా షాహీ కోడిగుడ్డు కూర.. తింటే అనాలి వాహ్!

Shahi Egg Curry Recipe । స్పైసీగా, టేస్టీగా షాహీ కోడిగుడ్డు కూర.. తింటే అనాలి వాహ్!

HT Telugu Desk HT Telugu

04 January 2023, 14:12 IST

    • Spicy Shahi Egg Curry Recipe: మీరు రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం చేయాలనుకుంటే మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోండి. స్పైసీగా షాహీ ఎగ్ కర్రీ ఎలా తయారో చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది.
Shahi Egg Curry Recipe
Shahi Egg Curry Recipe (slurrp)

Shahi Egg Curry Recipe

గుడ్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. చాలా రకాల విటమిన్లతో పాటు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడానికి గుడ్లు సరైన ఆహారం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు, మెరుగైన కంటి చూపుకు గుడ్లు తినాలని న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మీరు రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం చేయాలనుకుంటే మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోండి. కోడిగుడ్డుతో కొంచెం మసాలా కలిపి, స్పైసీగా షాహీ ఎగ్ కర్రీ రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. అందంగా ఉడకబెట్టిన గుడ్లు, కొత్తిమీర సువానలు, కసూరి మెంతి కమ్మదనాన్ని కలిపి సుగంధ ద్రవ్యాల మేలవింపుతో తయారు చేసే ఈ వంటకం మీ కడుపు నింపడమే కాదు, మీ మనసును సంతృప్త పరుస్తుంది.

మరి షాహీ ఎగ్ కర్రీ చేసేందుకు ఏమేం కావాలి, ఎలా తయారో చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది, ఇక్కడ అందించిన సూచనలతో మీరు సులభంగా ఈ వంటకం తయారు చేసుకోవచ్చు.

Spicy Shahi Egg Curry Recipe కోసం కావలసినవి

  • 4 గుడ్లు
  • 1 tsp వెల్లుల్లి
  • 1 ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • 1 tsp అల్లం
  • 1 టేబుల్ స్పూన్ తాజా క్రీమ్
  • 1 టేబుల్ స్పూన్ పెరుగు
  • 1 టీస్పూన్ కసూరి మేతి
  • 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా
  • 1/2 స్పూన్ గరం మసాలా
  • 1/2 స్పూన్ కారం
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • కొంచెం కొత్తిమీర
  • రుచికోసం ఉప్పు

స్పైసీ కోడిగుడ్డు కూర- షాహీ శైలిలో తయారీ విధానం

  1. ముందుగా ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి ముతక పేస్ట్‌లా చేసుకోవాలి.
  2. తర్వాత బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఇదివరకు రుబ్బుకున్న ముద్దను వేయించాలి.
  3. ఇప్పుడు కసూరి మేతి, గరం మసాలా, కారం, ఉప్పు వేయండి. ఆపై 1 కప్పు నీరు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఇ
  4. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను రెండు ముక్కలుగా చేసి పాన్‌లో వేయండి. ఇది 5-6 నిమిషాలు ఉడికించాలి. ఆపై చాట్ మసాలా వేసి బాగా కలపాలి.
  5. చివరగా స్టవ్ ఆఫ్ చేసి పెరుగు, క్రీమ్‌ను బాగా కలిపిన మిశ్రమాన్ని ఒక టీస్పూన్ వేయాలి. కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి.

అంతే స్పైసీ షాహీ ఎగ్ కర్రీ రెడీ. మీరు ఈ కూరను చపాతీ, పరాఠా, అన్నం, బిర్యానీ లేదా పులావ్‌ దేనితో అయినా తినవచ్చు.

తదుపరి వ్యాసం