తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flaxseed Health Benefits: ఫ్లాక్స్‌సీడ్‌తో 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

flaxseed health benefits: ఫ్లాక్స్‌సీడ్‌తో 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

20 January 2023, 17:05 IST

    • flaxseed health benefits: ఫ్లాక్స్‌సీడ్‌(అవిసె గింజలు)తో 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి. 
ఫ్లాక్స్‌సీడ్‌తో 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఫ్లాక్స్‌సీడ్‌తో 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Pixabay)

ఫ్లాక్స్‌సీడ్‌తో 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

flaxseed health benefits: ఫ్లాక్స్‌సీడ్ (అవిసె గింజలు) ఒక అద్భుతమైన ఆహారంగా ప్రాచుర్యంలో ఉంది. గుండె జబ్బులు, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్లతో పోరాడగలిగే శక్తి ఉందని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు.

ఫ్లాక్స్‌సీడ్‌ను ఈ మధ్య వివిధ రెసిపీల్లో తరచుగా వినియోగిస్తున్నారు. ఫ్లాక్స్‌సీడ్ ఉపయోగాలపై అవగాహన పెరగడమే ఇందుకు కారణం. ఫ్లాక్స్‌సీడ్‌లో ఉండే ప్రధాన పోషకాల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, లైగ్నన్లు, ఫైబర్ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.

ఫ్లాక్స్‌సీడ్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఫ్లాక్స్‌సీడ్ కొన్ని నిర్ధిష్ట క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

క్యాన్సర్‌ నివారణకు ఫ్లాక్స్ సీడ్

బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా ఫ్లాక్స్‌సీడ్ రక్షణ కవచంగా పనిచేస్తుందని ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి. ఫ్లాక్స్‌సీడ్‌లో ఉండే పదార్థాలు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ ట్యూమర్ వృద్ధిని అడ్డుకుంటుందని తేలింది.

అలాగే ఫ్లాక్స్‌సీడ్‌లో ఉండే లైగ్నన్లు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తాయి. కౌమార దశలో ఫ్లాక్స్‌సీడ్ ఆహారంగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును నివారించవచ్చని కూడా అధ్యయనాలు సిఫారసు చేశాయి. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ల పరిస్థితిని కూడా మెరుగుపరిచిందని తేల్చాయి.

ట్యూమర్ సెల్స్ విస్తరణను, వృద్ధిని పెంచే ఎంజైమ్స్‌ను నిరోధించడం ద్వారా లైగ్నన్లు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇక ఫ్లాక్స్‌సీడ్‌లో యాంటాక్సిడంట్ గుణాలు క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి.

ఫ్లాక్స్‌సీడ్‌తో గుండె జబ్బుల నుంచి రక్షణ

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ చర్య, హార్ట్‌బీట్‌ను నార్మల్ కండిషన్‌కు తేవడం సహా విభిన్న కార్యకలాపాలతో కార్డియోవాస్కులర్ ప్రక్రియకు దోహదం చేస్తాయి. అంతేకాకుండా ఫ్లాక్స్‌సీడ్‌లో బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించే గుణాలు ఉన్నట్టు కూడా అధ్యయనాలు తేల్చాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ కలిసి ఈ మేలు చేస్తాయని తేలింది.

ఫ్లాక్స్‌సీడ్‌లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ధమనులు చిక్కబడకుండా, వాటిలో ఫలకలు పేరుకుపోకుండా కాపాడుతాయి. ప్లాంట్ ఒమెగా-3 యాసిడ్స్ గుండె కొట్టుకునే విధానం సహజంగా ఉండేలా చేస్తాయి. గుండె కొట్టుకోవడం క్రమబద్ధంగా లేకపోవడం, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యల్లో ఇవి బాగా ఉపయోగపడుతాయి.

కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే ఫ్లాక్స్ సీడ్

రోజూ క్రమం తప్పకుండా ఫ్లాక్స్‌సీడ్ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఉండడం గుండె జబ్బుల ప్రమాదాన్ని సూచిస్తుంది. అలాగే ఒబెసిటీ, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్‌ను సూచిస్తుంది. ఏడాదిపాటు రోజూ 4 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ తిన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గినట్టు అధ్యయనాలు తేల్చాయి. ఇందుకు ఫ్లాక్స్‌సీడ్‌లో ఉన్న ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లైగ్నన్లు దోహదపడ్డట్టు అధ్యయనాలు తేల్చాయి.

డయాబెటిస్ చికిత్సకు ఫ్లాక్స్ సీడ్

ఫ్లాక్స్‌సీడ్ రోజూ తీసుకోవడం వల్ల అందులో ఉండే లైగ్నన్లు టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. అందువల్ల డయాబెటిస్ పేషెంట్లు తమ ఆహారంలో అవిసె గింజల పొడి లేదా ఇతర రూపంలో వీటిని తీసుకోవాలి.

డయాబెటిస్ మాత్రమే కాకుండా శరీరంలో ఉండే మంట, వాపులను కూడా ఫ్లాక్స్‌సీడ్ తగ్గిస్తుంది. కొన్ని రకాల వ్యాధుల వల్ల వచ్చే వాపు, మంటను కూడా తగ్గిస్తుంది.

ఫ్లాక్స్‌సీడ్ ఎంత మొత్తం తీసుకోవచ్చు? ఎవరు తీసుకోకూడదు?

ప్రెగ్నెంట్ మహిళలు, బ్రెస్ట్‌ఫీడింగ్ ఇచ్చే తల్లులు అవిసె గింజలను తమ ఆహారంలో తీసుకోకపోవడం మంచిది. మిగిలిన వారు రోజూ 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్‌సీడ్ తీసుకోవచ్చు. వాటిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. వివిధ రెసిపీల్లోనూ, బేకింగ్ పదార్థాల్లోనూ తీసుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్‌సీడ్‌లో ఉండే పోషకాలు

ఒక టేబుల్ స్పూన్ (7 గ్రాములు)లో ఉండే పోషకాల్లో ప్రోటీన్ 1.3 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 2 గ్రాములు, కొవ్వు 3 గ్రాములు, థయామిన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, జింక్, విటమిన్ బీ6, ఐరన్, ఫొలేట్ ఉంటాయి.

తదుపరి వ్యాసం