తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dating With Divorcee : డివోర్స్ తీసుకున్న వారితో డేటింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

Dating with Divorcee : డివోర్స్ తీసుకున్న వారితో డేటింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

20 November 2022, 19:54 IST

    • Relationship Tips with Divorcee : ఎవరి జీవితంలోనైనా.. విడాకులు, బ్రేకప్ అనేవి.. చాలా సున్నితమైన విషయాలు. మీరు అలాంటి వ్యక్తితో ప్రేమలో ఉంటే.. వారిని మీరు డేట్ చేస్తుంటే.. కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మీ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. ఈ సున్నితమైన విషయాలను ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి.
డివోర్స్ తీసుకున్న వారితో డేటింగ్
డివోర్స్ తీసుకున్న వారితో డేటింగ్

డివోర్స్ తీసుకున్న వారితో డేటింగ్

Dating with Divorcee :టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడడం.. విడాకులు తీసుకోవడం చాలా కష్టమైన విషయం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కోర్టు కేసు, కస్టడీ వివాదం, జీవితం ఒక్కసారిగా బ్లాంక్ అవ్వడం.. వెరసి ప్రజల వెక్కిరింపులు.. ఇవి విడాకులు తీసుకునే వ్యక్తిని నిజంగానే దెబ్బతీస్తాయి. ఆ వ్యక్తి మానసికంగా చాలా కృంగిపోయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తితో మీరు డేటింగ్ చేయడం అంటే సాహాసం అనే చెప్పాలి. వారిని మీ లైఫ్​లోకి ఆహ్వానించాలి.. వారి ప్రేమను పొందాలి.. కొత్త లైఫ్ ఇవ్వాలంటే.. మీరు చాలా విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

ఎందుకంటే మీ భాగస్వామి వారి బాధాకరమైన సంబంధాన్ని, దాని వల్ల కలిగిన మానసిక గాయాలను అంత సులువుగా మరచిపోలేకపోవచ్చు. మరి వారితో ఎలా సన్నిహితంగా ఉండాలి? వారిని ఎలా ఆ ట్రోమా నుంచి బయటకు తీసుకురావాలి? వారికి ఏమి ఇవ్వాలి? ఏమి చేస్తే.. వాళ్లు తిరిగి నార్మల్ అవుతారు అనే ప్రశ్నలు మీలో కచ్చితంగా ఉంటాయి. అయితే మీరు ఇలాంటి రిలేషన్లోకి వెళ్లడాకి ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోండి.

స్పేస్ ఇవ్వండి..

మీ భాగస్వామికి తగినంత స్పేస్ ఇవ్వండి. మీ భాగస్వామికి ఈ సమయంలో స్పేస్ ఇవ్వడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి విడాకులు తీసుకున్నా.. లేదా అనే దానితో సంబంధం లేకుండా.. మీ భాగస్వామి మీతో సమయాన్ని ఆస్వాదించడానికి అనుమతించండి. ఫోర్స్ చేయకుండా.. వాళ్లంతటా వాళ్లే వచ్చే స్పేస్ మీరు ఇవ్వండి. ఇదే మీ ప్రేమను చూపించడానికి మరొక మార్గం. విడాకులు తీసుకున్న మీ భాగస్వామి.. రెండవసారి తన జీవితంలో ప్రేమను ఆహ్వానించడానికి కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి వారిని ఫోర్స్ చేయకుండా.. వారికి మీపై నమ్మకాన్ని కలిగించండి. ముఖ్యంగా ప్రేమను ఇవ్వండి.

పిల్లలతో ప్రేమగా..

మీ భాగస్వామికి.. వారి మాజీ జీవిత భాగస్వామితో పిల్లలు ఉన్నట్లయితే.. వారితో బాగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. మీరు వారి పిల్లల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే మీ భాగస్వామికి ఇష్టం ఉండదు. మీరు మొదట పిల్లలను ఇష్టపడకపోవచ్చు. కానీ మీరు మీ సమయాన్ని వెచ్చించి వారితో సత్సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. పిల్లలు మొదట మిమ్మల్ని అంగీకరించకపోతే.. వారి కొత్త నాన్న లేదా అమ్మగా ఉండటానికి ప్రయత్నించే బదులు.. వారి స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నించవచ్చు.

అంచనాలు పెంచుకోకండి..

ఈ రిలేషన్లో ఎక్కువ అంచనాలు పెంచుకోకండి. అంటే మీరు మీ ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత.. తెలియకుండానే మీ భాగస్వామిపై కొన్ని అంచనాలను పెరిగిపోతాయి. వారితో టైం స్పెండ్ చేసినా.. మీ అంచనాలను మాత్రం భూమి మీదనే ఉండనివ్వండి. మీతో సమయం గడపాలని.. మీ ఆనందం కోసం శ్రద్ధ తీసుకోవాలని మీరు కోరుకోవచ్చు. కానీ.. మీ అంచనాలను వాళ్లు రీచ్ కాలేకపోవచ్చు. ఎందుకంటే వారు ఈ ట్రోమా నుంచి అంత సులువుగా బయటకు రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదేవిధంగా మీ భాగస్వామి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని మీరు అనుకున్నా.. ఒక్కోసారి అది జరగకపోవచ్చు. కాబట్టి ఎక్కువ అంచనాలు పెంచుకోకండి. గో విత్ ఫ్లో అన్నట్లు మీ సంబంధాన్ని కొనసాగించండి.

సంతోషాన్ని పంచుకోండి..

ఒక హెల్తీ రిలేషన్ అనేది.. వ్యక్తులిద్దరిపై ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధంలో పరస్పర ఆనందం, ఉమ్మడి లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం. మీ సంతోషం గురించి మాత్రమే శ్రద్ధ వహించడం.. మీ భాగస్వామి అవసరాలు, ఎంపికలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వారు మీతో సంబంధాన్ని ముగించాలనుకోవచ్చు. మీరు వారికి స్వార్థపరులుగా కనిపించవచ్చు. పైగా మీతో డేటింగ్ చేసినందుకు వాళ్లు ఇంకా ఎక్కువ బాధపడతారు.

సానుభూతి చూపించకండి..

మీ భాగస్వామి విడాకులు తీసుకున్నందుకు.. మీరు వారి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదు. విడాకులకు దారితీసిన పరిస్థితుల గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. బదులుగా.. సంతోషంగా లేని వివాహం నుంచి బయటికి వచ్చినందుకు మీ భాగస్వామి ధైర్యం చూపించినందుకు మీరు అభినందించాలి.

వాళ్లు ఎలా ఉంటే అలా అంగీకరించండి..

ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత.. మీ భాగస్వామి మీతో రిలేషన్లోకి రావడానికి చాలా ఆలోచించి ఉండొచ్చు. ఒక ట్రోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు వారి జీవితాన్ని ఎంతో కొంత ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ.. వారు మీ విషయంలో ఎప్పుడూ ఓ గిల్ట్​ని ఫీల్ అవుతారు. తనకి నేను నచ్చనేమో అని ఆలోచిస్తారు. మీ భాగస్వామి కూడా ఇలాంటి డైలామాలో ఉంటే.. వారిని మీరు ఎంతగా అంగీకరిస్తున్నారో చెప్పండి. అది మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. మీరు ఆ భాగస్వామిని నిజంగా ప్రేమించి లైఫ్​ని షేర్ చేసుకోవాలని చూస్తే.. మీరు చాలా ఓపికగా ఉండాల్సి ఉంటుంది. వారిపై మరింత శ్రద్ధ చూపించాలి. అప్పుడే వారు మీపై నమ్మకాన్ని పొందగలరు.

మీరు వారితో ఎలాంటి సంబంధాన్ని కావాలనుకుంటున్నారో కచ్చితంగా చెప్పేయండి. వాళ్లకి కూడా ఓకే అయితే ప్రోసీడ్ అవ్వండి. అంతేకానీ.. మీరు వారిలో లేని పోని ఆశలు రేపి.. చివరకు మీ దారి మీరు చూసుకుంటే వారు మరింత కృంగిపోయే ప్రమాదముంది.

టాపిక్

తదుపరి వ్యాసం