తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Chess Day। చదరంగం చరిత్ర మనదే.. చెస్ ఆడితే కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి!

International Chess Day। చదరంగం చరిత్ర మనదే.. చెస్ ఆడితే కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

20 July 2023, 10:11 IST

    • International Chess Day 2023: ఈరోజు అంతర్జాతీయ చదరంగం దినోత్సవం. చదరంగం ఆట మూలాలు, చరిత్ర, చెస్ ఆడితే కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
International Chess Day 2023
International Chess Day 2023 (pixabay)

International Chess Day 2023

International Chess Day 2023: ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‌లలో చదరంగం కూడా ఒకటి. ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్ ఆడే వారు ఉంటారు. చెస్ ఆటను నిజ జీవితానికి సూచికగా తరచూ చెప్తారు, 'జీవితమే ఒక చదరంగం' అంటూ ప్రస్తావించడం తెలిసిందే. ఈ చెస్ అనేది ఇద్దరు కలిసి ఆడే ఆట. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలి. ఈ ఆటలో ఒక రాజసం ఉంది, అందుకే మామూలు వ్యక్తులే కాకుండా రాజకీయంలో ఉండే వారూ ఈ ఆటను ఎక్కువ ఇష్టపడతారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఈరోజు అంతర్జాతీయ చదరంగం దినోత్సవం. ప్రతి సంవత్సరం, జూలై 20న అంతర్జాతీయ చదరంగం దినోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా, జూలై 20, గురువారం నాడు ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మేధోపరమైన, సాంస్కృతిక, చారిత్రక ఆటకు గుర్తింపు తీసుకురావడం కోసం జూలై 20న ప్రపంచ చదరంగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.

చదరంగం ఆట మూలాలు భారతదేశంలోనే

చరిత్ర ప్రకారం, చదరంగం ఆట మూలాలు భారతదేశంలోనే ఉన్నట్లు అర్థమవుతుంది. గుప్తుల కాలంలో ఉత్తర భారత ఉపఖండంలో ఆడిన చతురంగ ఆటలో భాగంగానే చదరంగం మూలాలు ఉన్నాయని నమ్ముతారు. వివిధ దేశాల మధ్య వాణిజ్యం ప్రారంభమైనపుడు వర్తకుల ద్వారా భరతఖండం నుంచి పశ్చిమాన పర్షియా వరకు ఈ చదరంగం ఆట వ్యాపించింది. అక్కడ వారు ఈ ఆటను చత్రంగ్ లేదా షత్రంజ్ అనే పేరుతో పిలిచేవారు. చదరంగం ఆట ప్రారంభ సూచనలు 600 CE నాటి పర్షియన్ మాన్యుస్క్రిప్ట్‌లో గుర్తించడం జరిగింది, దీనిని భారత ఉపఖండంకు చెందిన రాయబారి ద్వారా నాటి పర్షియన్ రాజు ఖోస్రో Iకి బహుమతిగా అందించారు. కాలక్రమేణా, ఇది ఐరోపా, రష్యాలోనూ ప్రజాదరణ పొందింది, ఈక్రమంలో ఈ ఆట 2,000 కంటే ఎక్కువ వేరియంట్‌లుగా రూపాంతరం చెందింది. ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక చెస్‌గా పరిణామం చెందింది.

చెస్ ఆడితే కలిగే ప్రయోజనాలు

  • మీ IQని పెంచుతుంది
  • అల్జీమర్స్ రాకుండా సహాయపడుతుంది
  • మెదడుకు రెండు వైపులా వ్యాయామం చేస్తుంది
  • మీ సృజనాత్మకతను పెంచుతుంది
  • మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
  • మీలో సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది
  • ఇది మీ పఠన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది
  • మీ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది
  • ఒత్తిడిలోనూ మెరుగ్గా, చురుగ్గా ఆలోచింపజేస్తుంది
  • ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది
  • జీవితంలో ఓటమి, గెలుపులు సహజమని నేర్పుతుంది.

మరెందుకు ఆలస్యం, మీరు చెస్ ఆడటం ప్రారంభించండి, మానసికంగా మెరుగ్గా అవ్వండి.

తదుపరి వ్యాసం