తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pains | చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? ఇలా తగ్గించుకోండి..

Joint Pains | చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? ఇలా తగ్గించుకోండి..

Vijaya Madhuri HT Telugu

24 February 2022, 11:56 IST

    • వయసు పెరిగే కొద్ది.. కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా మంది దీనిబారిన పడుతున్నారు. కనీసం 30 ఏళ్లు నిండకుండానే కీళ్ల నొప్పులతో బాధపడే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణాలే. మరీ ఈ కీళ్లనొప్పులు తగ్గెదేలా? తెలుసుకోవాలంటే దీనిని చదవండి.
కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

Arthritis | శరీర బరువును మోయడంలోనూ, కదిలించడంలోనూ కీళ్లే ప్రధానం. అలాంటిది ముప్పై ఏళ్లు కూడా నిండకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కుర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి. మెట్లు ఎక్కినా.. దిగినా ఇబ్బంది పడటం. ఒకటా రెండా? ఈ కీళ్ల నొప్పులు ఒక పట్టానా ఉండనీయవు.. ఏ పని చేయనీయవు. చిన్న వయసులోనే కీళ్ల నొప్పలు అని చెప్పుకోవడం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మరి దీనిని తగ్గించుకునే అవకాశముందా అంటే.. పలు నియమాలు పాటిస్తే కీళ్ల నొప్పులు తగ్గించుకునే ఆస్కారం ఉంది అంటున్నారు నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

అసలు ఎందుకు కీళ్ల నొప్పులు వస్తాయి?

వయసు పైబడే కొద్ది కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు రావడమనేదే ప్రధాన సమస్య. అసలు చిన్న వయసులోనే ఎందుకు కీళ్ల నొప్పలు వస్తాయో తెలుసుకుందాం. గంటల కొద్దీ కుర్చీలో కుర్చోనే ఉద్యోగాలు చేయటం, కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు వెనక్కి జరపడం వంటివన్నీ మనకి తెలియకుండానే జరిగినా.. మోకాళ్ల చిప్ప మీద ఒత్తిడి పడేలా చేస్తాయి. ఎప్పుడో ఒకసారి ఇబ్బంది ఉండకపోవచ్చుకాని రోజూ అలానే కుర్చోంటే చిప్ప లోపలి భాగం అరగడం మొదలై.. నొప్పికి దారి తీస్తుంది. క్రమంగా కుర్చూలో కుర్చున్నప్పుడు గానీ, లేస్తున్నప్పుడు గానీ.. మెట్లు ఎక్కుతూ దిగినా.. ఎత్తైన ప్రదేశాలు ఎక్కాల్సి వచ్చిన ఈ నొప్పి క్రమంగా పెరుగుతూ.. తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ మోకాళ్ల నొప్పులు కాస్తా.. వెన్ను, తుంటి, భుజాలు, మోచేతులు, మెడ ప్రాంతాల్లో నొప్పులకు దారి తీస్తాయి. ఇలాంటి సమయాల్లో రుమటాలజిస్టును కలవడం ఎంతో ముఖ్యం.

ఎవరికి ఎక్కువగా వస్తుంది?

సాఫ్ట్​వేర్, డెస్క్ ఉద్యోగులు, విద్యార్థులలో కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. రన్నింగ్, జంపింగ్ వంటి ఆటలు ఆడేవారిలో కూడా చిప్ప నొప్పులు ఎక్కువుంటాయి. ప్రమాదాల్లో జరిగిన గాయాలతోనూ నొప్పులు రావొచ్చు. బరువు తగ్గాలని వేగంగా వ్యాయామాలు చేసే వారిలోనూ ఈ సమస్య ఉంటుంది. పైగా కీళ్లనొప్పులు అనేవి ప్రధానంగా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటి పని ప్రభావం శరీరంపై ఎక్కువ శ్రమ పడేలా చేస్తుంది. అలాంటి సమయంలో ఆడవారిలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. 30 ఏళ్లు నిండిన తర్వాత ఆడవారిలో కాల్షియం కూడా తగ్గుతుంది. పిల్లలు కనడం, అధికబరువు కీళ్ల నొప్పులకు కారణమవుతాయి.

చిన్న చిన్న నియమాలతో ఎక్కువ ఫలితాలు

*ఏదైనా పని ఎక్కువ సేపు ఒకే భంగిమలో చేస్తే.. లేచి స్ట్రెచ్చింగ్ లాంటివి చేయాలి.

*ఆరోగ్యకరమైన జీవన విధానాలతో బరువు తగ్గించుకోవాలి.

*శరీరానికి ఎక్కువగా నీటిని అందించాలి. దేహానికి అవసరమైన నీరు అందక పోతే కార్టిలేజెస్ నుంచి నీటిని గ్రహిస్తుంటుంది. ఇది ఎముకలు అరిగిపోవడానికి కారణమవుతుంది.

*విటమిన్ డి లోపం వల్ల కూడా కీళ్ల నొ ప్పులు వచ్చే ఆస్కారముంది కాబట్టి.. పరీక్ష చేయించుకుని మాత్రలు వాడితే పరిష్కారం ఉంటుంది.

*కాల్షియం, విటమిన్ డి లు తక్కువైతే.. ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి సరైన టైంలో సరిగ్గా ఆహారాన్ని తీసుకుంటే మంచిది.

ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..

*సాల్మన్ రకం చేపలు, అవిసె గింజలు, ఆలివ్​ నూనె వంటి వాటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి.

*క్యాబేజీ, చిన్న క్యాబేజీ, గోబీ వంటి కూరగాయలు వాపును తగ్గిస్తాయి. వీటిల్లో సి విటమిన్కూడా ఉంటుంది. ఇది కీళ్ల వాతం తగ్గటానికి దోహదం చేస్తుంది.

తినకూడనివి ఏంటి..

*ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. వేట మాంసంలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

*చిక్కుడు కాయలు, పప్పులు, వేరుశనగలు, టమోటాలు, బంగాళాదుంపల్లో లెక్టిన్లు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా వాపును ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడమే మేలు.

*కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు, మిఠాయిలు వంటివి తగ్గిస్తే మంచిది.

వ్యాయామాలు..

*ఆహార నియమాలకు తోడు వ్యాయామాలు కలిస్తే.. మరింత మేలు జరిగుతుంది. కీళ్ల మీద అంతగా భారం పడని వ్యాయమాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈత లేదా నీటిలో ఉండి చేసే వ్యాయామాలు కీళ్ల మీద ఎక్కువ భారం పడకుండా చేస్తాయి.

*కొన్ని ప్రత్యకమైన యోగాసనాలు వేసినా మంచి ఫలితం ఉంటుంది. మత్స్యాసనం, పవనముక్తాసనం, వాయుముద్ర ఆసనం వంటివి కీళ్ల కండరాలపై ప్రభావం చూపి.. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి.

*ఫిజియోథెరపీ చేయించుకున్నా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం