తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navaratri Tiger Dance : అక్కడ నవరాత్రి ఉత్సవాల్లో టైగర్ డ్యాన్స్ ఎందుకు చేస్తారు? ఎలా మెుదలైంది?

Navaratri Tiger Dance : అక్కడ నవరాత్రి ఉత్సవాల్లో టైగర్ డ్యాన్స్ ఎందుకు చేస్తారు? ఎలా మెుదలైంది?

Anand Sai HT Telugu

17 October 2023, 8:59 IST

    • Navaratri Tiger Dance : నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దుర్గామాతను 9 రోజుల పాటు పూజిస్తారు. ఈ పండుగ దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుగుతోంది. అయితే కోస్టల్ కర్ణాటకలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది టైగర్ డ్యాన్స్. ఇది ఎలా మెుదలైంది?
పులి వేషధారణ
పులి వేషధారణ (twitter)

పులి వేషధారణ

కోస్తా కర్ణాటకలో(Coastal Karnataka) నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తారు. మంగళూరు నవరాత్రులలో ప్రధాన ఆకర్షణ టైగర్ డ్యాన్స్(Tiger Dance). ఈ పులి వేషధారణకు చాలా ప్రాముఖ్యత ఉంది. పులి వేషం తుళునాడు సంప్రదాయ నృత్యం. ముఖ్యంగా కృష్ణజన్మాష్టమి, గణేశోత్సవాలు, నవరాత్రి ఉత్సవాల్లో పులి వేషధారణ వేస్తారు. నవరాత్రులు దుర్గా దేవి పండుగ. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారి తొమ్మిది అవతారాలను పూజిస్తారు. దుష్టశక్తుల నుండి మనలను రక్షించే దుర్గాదేవికి గౌరవం ఇవ్వడానికి పులి వేషం ధరిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పులి వేషం వేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

నవరాత్రి ఉత్సవాల్లో పులి వేషధారణ ఎలా మెుదలైందనే ప్రశ్నకు మంగళూరు ప్రజలకు ఓ విషయం చెబుతారు. ఇక్కడి ప్రజల విశ్వాసం ప్రకారం, చాలా సంవత్సరాల క్రితం ఒక బాలుడు శారీరక సమస్యతో నడవలేకపోయాడు. ఆ సందర్భంగా అతడి కుటుంబీకులు మంగళాదేవి ఆలయానికి వెళ్లి మా బిడ్డ బాగా నడిస్తే వచ్చే ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో పులి వేషం వేయిస్తామని మెుక్కుకున్నారట. వెంటనే ఆ బాలుడు నడవడం మెుదలుపెట్టాడట. కుటుంబ సభ్యులు దేవతకు ఇచ్చిన మాట ప్రకారం, నవరాత్రుల సందర్భంగా పిల్లవాడికి పులి వేషం వేసి ఆలయానికి తీసుకువచ్చారని చెబుతుంటారు. అప్పటి నుండి స్థానిక యువకులు, చిన్న పిల్లలు నవరాత్రుల సమయంలో దుర్గా దేవిని గౌరవించటానికి భక్తి, అంకితభావంతో పులి వేషధారణలను ధరిస్తారు.

పులి వేషధారణ వేయడం అంత ఈజీ కాదు. ఇది ప్రత్యేకమైన కళ. ఈ కళ అందరికీ సాధ్యం కాదు. పులి వేషం వేసేవారికి చాలా సహనం ఉండాలి. కాస్ట్యూమర్ ముఖానికి పెయింట్ వేసిన తర్వాత పెయింట్ ఆరనివ్వాలి. ముఖంపై పులి చార, ముఖంపై పులి రూపం రావాలంటే.. 5 నుంచి 6 గంటల పాటు నిలబడి పెయింట్ వేయించుకోవాలి. ఈ రంగుతో మంట కూడా ఉంటుంది.

పూర్వం పండుగకు చాలా రోజుల ముందు పసుపు, బొగ్గును కలిపి మెత్తగా చేసి, కోడిగుడ్డు పెంకును చూర్ణం చేసి ఈ మిశ్రమంలో వేసేవారు. ఆ తర్వాత బాగా ఉడకబెట్టి రంగు సిద్ధం చేసేవారు. ఈ రంగు చాలా మండేది. అంతేకాదు ఈ రంగును అంత తేలిగ్గా కడుక్కోరాదు. కానీ ఇప్పుడు స్ప్రే మొదలైన సులభమైన పద్ధతులు వచ్చాయి.

ఇక్కడ పులి ఆకారం కూడా రెండు మూడు రకాలుగా ఉంటుంది. పూర్వకాలంలో రాత్రి నుండి ఉదయం వరకు దుస్తులు ధరించేవారు. కానీ ఇప్పుడు అంత టైమ్ అవసరం లేదు. పులి వేషధారణలో నగరంలోని వీధుల్లో నృత్యం చేస్తారు. టైగర్ డ్యాన్స్ సమయంలో వివిధ టీమ్‌లకు చెందిన పులి వేషధారులు తమ రెండు చేతులను వెనుకకు పట్టుకుని ప్లేట్ నుండి నాణేలను తీయడం, సోడా బాటిల్ మూత తెరవడం వంటి అనేక విన్యాసాలు చేస్తారు. రివర్స్ స్లిప్, ఫార్వర్డ్ స్లిప్‌తో సహా ఇతర విన్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ టీమ్‍లో తల్లి పులి ప్రధాన ఆకర్షణ.

టైగర్ డ్యాన్స్ నవరాత్రుల్లో ఒక రోజు ఆట కాదు. తొమ్మిది రోజులు పులి జంప్స్ ఉంటాయి. చివరి రోజు ఊరేగింపులో పులి వేషధారణ ఆకట్టుకుంటుంది. ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు.. ఇక్కడి ప్రజల విశ్వాసం, సంప్రదాయం.

తదుపరి వ్యాసం