తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cat 2022: దేశంలో టాప్ Mba ఇన్‌స్టిట్యూట్‌లివే.. క్యాట్ ర్యాంక్ అధారంగా ప్రవేశాలు

CAT 2022: దేశంలో టాప్ MBA ఇన్‌స్టిట్యూట్‌లివే.. క్యాట్ ర్యాంక్ అధారంగా ప్రవేశాలు

HT Telugu Desk HT Telugu

19 September 2022, 16:21 IST

    • CAT 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 21, 2022తో ముగుయనుంది.క్యాట్ దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం పొందవచ్చు.
CAT 2022
CAT 2022

CAT 2022

CAT 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2022 రిజిస్ట్రేషన్ విండోను సెప్టెంబర్ 21, 2022న క్లోజ్ చేయనుంది. CAT 2022 పరీక్ష కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- iimcat.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ కేటగిరీ అభ్యర్థులకు క్యాట్ దరఖాస్తు రుసుము రూ. 2,300 కాగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1,150గా నిర్ణయించారు. MBA, ఇతర మేనేజ్‌మెంట్ కోర్సుల కోసం వివిధ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలకు CAT స్కోర్ ఉపయోగపడుతుంది. CAT 2022 మెరుగైన ర్యాంక్ సాధించిన వారు దేశంలో లాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందవచ్చు.

CAT సాధించిన ర్యాంక్ అధారంగా కట్-ఆఫ్ ఉంటుంది. అభ్యర్థులకు ప్రవేశం కల్పించడానికి ఇన్స్టిట్యూట్ వివిధ మార్గాలను అనుసరిస్తాయి. దేశంలోని IIMలు మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశాలకు ఎంత పోటీ ఉంటుందో తెలిసిన విషయమే.. అభ్యర్థుల ఎంపికలు IIMలు వ్యక్తిగత ఇంటర్వ్యూతో కూడిన వ్రాత సామర్థ్యం పరీక్ష (WAR). వివిధ రౌండ్‌ల ద్వారా అభ్యర్థి ఎంపిక ఉంటుంది. వీటిలో సర్సనల్ ఇంటార్వ్యూ (PI), గ్రూప్ డిస్కషన్ (GD) రౌండ్‌లు కూడా ఉంటాయి.

టాప్ IIMల జాబితాను ఇక్కడ చూడండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అహ్మదాబాద్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు, బెంగళూరు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కలకత్తా, కోల్‌కతా

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కోళికోడ్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM )లక్నో

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఇండోర్

XLRI - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ముంబై

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్

మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రాయ్‌పూర్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ రాంచీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రోహ్‌తక్

సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తిరుచిరాపల్లి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్

IIM బెంగళూరు కంప్యూటర్ ఆధారిత CAT 2022 పరీక్షను నవంబర్ 27 ఆదివారం మూడు సెషన్లలో నిర్వహిస్తుంది .IIMలలో వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం