తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Walk Benefits: ఉదయం పూట నడక ఎందుకు చేయాలో తెలిస్తే ఈరోజే మొదలుపెట్టేస్తారు

morning walk benefits: ఉదయం పూట నడక ఎందుకు చేయాలో తెలిస్తే ఈరోజే మొదలుపెట్టేస్తారు

20 April 2023, 6:00 IST

  • morning walk benefits: చాలామంది వాయిదా వేసే పనుల్లో ఉదయం పూట నడక మొదలు పెట్టడం ఒకటి. అది మంచిదని మనసు చెబుతున్నా మనకున్న వేరే పనుల వలనో, ఉదయం పూట నిద్ర లేవడం కష్టం అవడం వలనో నడకకు వెళ్లడం కుదరదు. మీరు నడక మొదలు పెట్టాలనుకుంటే దాని లాభాలు.. అసలు ఎలా నడిస్తే శరీరానికి మరింత మేలు జరుగుతుందో చూద్దాం.

ఉదయపు నడక
ఉదయపు నడక (Unsplash)

ఉదయపు నడక

మొట్టమొదటగా ఉదయపు నడక వల్ల జరిగే లాభం.. ఆరోగ్యంతో పాటూ ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు అవుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం మీరోజు ఉల్లాసంగా మొదలవుతుంది. బద్దకం వీడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

వాకింగ్ ఎలా చేయాలంటే..

ఇంత వేగంగా నడవాలని ఖచ్చితంగా చెప్పలేము కానీ, మీకు వీలైనంత వేగంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. పాటలు పాడుతూ నడవగలిగేంత మెల్లగా, కనీసం మాట కూడా మాట్లాడలేనంత వేగంగా నడవకూడదు. మీ శరీర స్థితి కూడా మంచి ఫలితాలు పొందడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

మెడ ముందుకు వంచి నడవకూడదు. నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ నడవాలి.

వెన్నెముక కూడా నిటారుగా ఉంచండి. ముందుకు లేదా వెనక్కి వంగి నడవకూడదు. ఎత్తులు ఎక్కాల్సి వస్తే మాత్రం కాస్త ముందుకు వంగి నడవొచ్చు.

భుజాలు, చేతులు ఫ్రీగా వదిలేయండి. పట్టినట్టుగా ఉంచకూడదు. అలాగే నడక సాగుతున్న తీరులోనే చేతులు ముందుకు వెనక్కి కదిలిస్తూ ఉండాలి. శరీరానికి అడ్డంగా చేతులు ఊపుకుంటూ నడవకూడదు.

ఇక పాదాలే నడకలో కీలకమైనవి. మీరు నడిచే ప్రాంతంలో షూ లేకుండా నడవగలిగితే ఇంకా మంచిది. షూ వాడాలంటే మాత్రం సరైనవి ఎంచుకోవాలి. అవి చీలమండలం దగ్గర పట్టేసినట్టు ఉండకూడదు. మీరు కాలిని సులభంగా కదిలించేలా ఉండాలి. లేదంటే ఆ ప్రభావం మోకాలిమీద పడుతుంది.

మెల్లగా మొదలుపెట్టండి:

మొదట్లో రోజూ నడవడం కాస్త ఇబ్బంది అనిపిస్తే కనీసం వారానికి మూడు సార్లయినా నడకకు వెళ్లండి. క్రమంగా రోజుల్ని పెంచుకుంటూ వెళ్లండి. ఇక సమయం విషయానికొస్తే కనీసం 30 నిమిషాల రోజూవారీ నడక ఎంతో మేలు చేస్తుంది. అయితే బరువు తగ్గడం కోసం నడక చేయాలనుకుంటే కనీసం 60 నిమిషాల నడక తప్పనిసరి. ఎందుకంటే మొదటి అరగంటలో కేవలం మన శరీరంలో ఉన్నచక్కెర నిల్వలు మాత్రమే తగ్గిపోతాయి. కొవ్వులు కరగాలంటే కనీసం 60 నిమిషాల నడక చేయాల్సిందే. మీకు కష్టమనిపిస్తే మొదట్లో కనీసం 20 నిమిషాల నుంచి మొదలెట్టి క్రమంగా సమయం కూడా పెంచుతూ వెళ్లండి. అలాగే రోజూ ఒకే ప్రదేశంలో వాకింగ్ చేయడం బోరింగ్ గా అనిపిస్తే మీరెళ్లే ప్రదేశం మార్చండి.

ఉదయం నడకవల్ల లాభాలేంటంటే..

నడక వల్ల బరువు అదుపులో ఉంటుంది. కొన్ని అధ్యయనాలు నడక మనలో తీపి తినాలనే కోరికను తగ్గిస్తుందని చెబుతున్నాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేసే విషయం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కీళ్ల నొప్పులు రాకుండా చేయడమే కాకుండా ఉన్న నొప్పులు తగ్గిస్తుంది. అయితే కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహాతోనే నడక మొదలుపెట్టడం మంచిది. రక్తపోటు అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యంగా ఉండటంలో నడక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకేం ఇన్ని ఉపయోగాలు తెలుసుకున్నాక కూడా వాయిదా వేయడం ఎందుకు? వెంటనే మీ ఉదయపు నడక మొదలెట్టేయండి..

తదుపరి వ్యాసం