తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ibps Recruitment 2022: డిగ్రీ అర్హ‌త‌తో 8,106 బ్యాంక్ ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే!

IBPS Recruitment 2022: డిగ్రీ అర్హ‌త‌తో 8,106 బ్యాంక్ ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

09 June 2022, 14:09 IST

    • IBPS RRB Recruitment 2022 | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS) వివిధ బ్యాంకుల్లో 8000పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IBPS Recruitment 2022
IBPS Recruitment 2022

IBPS Recruitment 2022

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 7న ప్రారంభం కాగా.. జూన్ 27 2022న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా డ్రైవ్  8000+ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక ప్రక్రియ,  ఇతర వివరాలను ఇక్కడ చూడండి. 

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 7, 2022

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2022

పరీక్షకు ముందు శిక్షణ నిర్వహణ: జూలై 18 నుండి జూలై 23, 2022 వరకు

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.   పూర్తి విద్యార్హత,  వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు. 

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 850/- రుసుము చెల్లించాల్సి ఉండగా..  SC/ST/PWBD అభ్యర్థులు రూ. 175/- చెల్లించి పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు . ఫీజులు/ఇంటిమేషన్ ఇతర ఛార్జీలు అభ్యర్థి భరించవలసి ఉంటుంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు IBPS అధికారిక సైట్‌ని తనిఖీ చేయవచ్చు.

 

 

 

టాపిక్

తదుపరి వ్యాసం