తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Senior Citizens | ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Senior Citizens | ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

28 December 2021, 15:28 IST

    • ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారు ఉంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నానమ్మ- తాతయ్య, అమ్మమ్మ-తాతయ్య ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్న వారు తప్పక ఉంటారు. 
వృద్ధాప్యంలో ఉన్న వారికి చేయూత అవసరం
వృద్ధాప్యంలో ఉన్న వారికి చేయూత అవసరం (unsplash)

వృద్ధాప్యంలో ఉన్న వారికి చేయూత అవసరం

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా గానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడ్డప్పుడు జరిగే మార్పులను గుర్తించి, వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్న వారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరం అవుతుంది.

వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులు ఇవే

శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడి ఉంటుంది. పొడి బారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. శరీరం బలహీనం అవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవులు సరిగ్గా వినపడవు. జీర్ణ శక్తి తగ్గుతుంది. మతిమరుపు పెరుగుతుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. దంత సమస్యలు ఏర్పడుతాయి. బరువు తగ్గుతారు. వంగి నడవాల్సి వస్తుంది. చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది. మాట తడబడవచ్చు. వయసును బట్టి తరచూ మూత్రవిసర్జన చేయాల్సి రావొచ్చు.

మానసిక సమస్యలు కూడా ఏర్పడుతాయి. ఆర్థిక అవసరాల కోసం ఆదాయం లేకపోవడం, ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు. డిప్రెషన్‌కు లోను కావొచ్చు. ఒంటరితనానికి లోను కావొచ్చు. ఇతరులపై ఆధారపడాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. మద్యానికి అలవాటు పడొచ్చు.

వృద్ధాప్య అవసరాలను ఎలా తీర్చాలి?

1. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియన్ టాయిలెట్ కాకుండా, వెస్ట్రన్ టాయిలెట్ వసతి సమకూర్చాలి. 

2. వాష్ రూమ్‌లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు, లేదంటే కాలి నడకను అలవాటు చేయాలి. యోగ, ధ్యానం వంటివి ప్రోత్సహించాలి.

3. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మరిచిపోతుంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఒక షెడ్యూలును అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి.

4. అజీర్ణం, మల బద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.

5. వినికిడి సమస్యలు ఉన్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలు ఉన్న నిర్లక్షం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

6. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్‌లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. 

7. ఆయా కాలాలు, పండగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. 

8. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తున్నందున పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా పండ్లు ఇవ్వాలి.

9. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. దంత సమస్యలకు ఎప్పటికప్పుడు చికిత్స లభించేలా చూడాలి. 

10. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి.

11. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. 

12. చిన్నచిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. 

13. గార్డెనింగ్, పెట్స్ వంటివాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీలను ప్రోత్సహించాలి.

 

టాపిక్

తదుపరి వ్యాసం