తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Homemade Colours : ఇంట్లోనే హోలీ రంగులను తయారు చేయండి ఇలా.. చాలా ఈజీ

Homemade Colours : ఇంట్లోనే హోలీ రంగులను తయారు చేయండి ఇలా.. చాలా ఈజీ

Anand Sai HT Telugu

23 March 2024, 12:30 IST

    • Holi 2024 : మార్కెట్లో దొరికే హోలీ రంగులు మన శరీరానికి, పర్యావరణానికి మంచివి కావు. అందుకే ఇంట్లోనే సహజసిద్ధంగా హోలీ రంగులను తయారు చేసుకోండి.
సహజంగా హోలీ రంగులు తయారు చేయడం ఎలా
సహజంగా హోలీ రంగులు తయారు చేయడం ఎలా (Unsplash)

సహజంగా హోలీ రంగులు తయారు చేయడం ఎలా

హోలీ హిందూ ప్రజలు జరుపుకొనే అత్యంత ముఖ్యమైన పండుగ. దేశం మెుత్తం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఉపయోగించే రంగులతో అసలు సమస్య. ఎందుకుంటే వాటిలో కలిపే రసాయనాలు మీ శరీరానికి హాని కలిగిస్తాయి. వాస్తవానికి, హోలీ రంగులు వసంతకాలంలో వికసించే ప్రకాశవంతమైన పువ్వులను ఉపయోగించి తయారు చేసేవారు. ఈ మాసంలో వికసించే పూలతో రంగులు తయారు చేసి ఒకరికొకరు పూసుకునేవారు. హోలీ కాలక్రమేణా ప్రజాదరణ పొందింది. సహజ రంగులు బదులుగా రసాయనాలు కలిపినవి వాడటం మెుదలైంది. కానీ ఇవి ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

మార్కెట్‌లో లభించే రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను తయారు చేయడం ద్వారా సురక్షితమైన హోలీని ఆడవచ్చు. విషపూరిత రసాయన రంగులను వదిలేసి, సహజసిద్ధమైన ఇంట్లో తయారుచేసిన రంగులతో ఆడుకోవడం ద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని, పర్యావరణాన్ని మీరు రక్షించుకోవచ్చు. ఇంట్లోనే రంగులను ఎలా తయారు చేయాలో చూద్దాం..

ఎరుపు రంగు లేకుండా హోలీ లేదనే చెప్పవచ్చు. కచ్చితంగా హోలీలో ఈ రంగును వాడుతారు. ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో ప్రారంభమవుతుంది. ఈ రంగును చూస్తే మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. దీన్ని ఇంట్లో తయారు చేయడానికి మీకు కొంత ఎర్రచందనం పొడి అవసరం, కొంచెం మైదా పిండి కలపండి. ఈ రంగును నీటితో ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. సింపుల్‌గా కావాలంటే.. మందార పువ్వులతో పాటు కొన్ని దుంపలను ఉడకబెట్టండి. ఇందులో కావాలంటే టొమాటో రసం కూడా కలపండి. ఇది మీ చర్మానికి మంచిది.

ఆకుపచ్చ రంగును తయారుచేసేందుకు ఉత్తమ మార్గం మైదా పిండితో కొన్ని హెన్నా ఆకులను కలపడం. ఇది మీకు మృదువైన, సహజమైన పొడి ఆకుపచ్చ రంగును ఇస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండటానికి కొన్ని బచ్చలికూర ఆకులు, కొత్తిమీర ఆకులను ఎంచుకోండి. వాటిని ఉడకబెట్టి, మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. తర్వాత రంగులా రాసుకోవచ్చు.

గులాబీ రంగు చేయడానికి బీట్‌రూట్‌ను మెత్తగా పేస్ట్‌గా గ్రైండ్ చేసి ఎండలో ఆరబెట్టండి. అది ఆరిన తర్వాత బేసన్ లేదా మైదాతో కలిపి వాడాలి. కొన్ని బీట్‌రూట్ ముక్కలను ఉడికించి, కాసేపు నీటిలో ఉంచండి. మీకు ఇలా కూడా గులాబీ రంగు తయారవుతుంది.

ఫుడ్ కలరింగ్ ఉపయోగించి పొడి రంగులు తయారుచేసుకోవచ్చు. దీన్ని సిద్ధం చేయడానికి మీకు కావలసిన రంగుల ఫుడ్ డైలను తీసుకుని, 1 టేబుల్ స్పూన్ బియ్యప్పిండిని కలిపి ఎండలో ఆరబెట్టండి. ఉపయోగించే ముందు మళ్లీ మెత్తగా రుబ్బుకోవాలి.

ఊదా రంగును తయారు చేయడానికి కొన్ని ఎండుద్రాక్షలు, క్రాన్బెర్రీలను నీటితో కలపండి. వీటిని గ్రైండ్ చేసుకోండి. సహజ రంగులుగా అద్భుతంగా పనిచేస్తాయి. మీకు అందమైన ఊదా రంగును కూడా ఇస్తుంది.

సహజమైన పసుపు రంగును సృష్టించడానికి మీకు కొన్ని ఎండిన, పచ్చి పసుపు అవసరం. ఎండు పసుపు పొడిని కొద్దిగా బేసన్‌తో కలపండి. మీరు తడి వెర్షన్‌ను ఇష్టపడితే పచ్చి పసుపును నీటిలో ఉడకబెట్టండి, ఆ నీటితో హోలీ ఆడుకోండి.

ఊర్లలోకి వెళితే మోతుకు పూలు దొరుకుతాయి. వీటిని కోసుకొచ్చి పసుపు రంగు తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని ఉడికించి తయారు చేస్తే హోలీ బాగా ఆడుకోవచ్చు.

తదుపరి వ్యాసం