తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How To Eat Garlic: వెల్లుల్లి ఇలా వినియోగిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు అందేది

How to Eat Garlic: వెల్లుల్లి ఇలా వినియోగిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు అందేది

HT Telugu Desk HT Telugu

27 October 2023, 9:03 IST

    • వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మన ఆహారం ద్వారా శరీరానికి అందాలంటే వాటిని వినియోగించే పద్ధతి తెలుసుకోవాలి.
వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు అందాలంటే వినియోగించాల్సిన పద్దతి తెలుసుకోండి
వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు అందాలంటే వినియోగించాల్సిన పద్దతి తెలుసుకోండి (pixabay)

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు అందాలంటే వినియోగించాల్సిన పద్దతి తెలుసుకోండి

తెలుగు ఇళ్లల్లో వెల్లుల్లి వాడకం అధికమే. అల్లం వెల్లుల్లి జోడీ కలిస్తే ఏ కూరకైనా అదనపు రుచి వస్తుంది. వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మన ఆహారం ద్వారా శరీరానికి అందాలంటే వాటిని వినియోగించే పద్ధతి తెలుసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Cucumber Egg fried Rice: కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్... బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోయే వంటకం, ఎవరికైనా నచ్చుతుంది

Saturday Motivation: ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

వెల్లుల్లి వాడే విధానం

  1. వెల్లుల్లి రెబ్బలను నేరుగా కూరల్లో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ముందుగా వాటిని సన్నగా తరుక్కోవాలి. ఇలా తరిగాక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాతే వాటిని కూరలో వేసి ఉండాలి.
  2. ఇలా కట్ చేసి పది నిమిషాలు ఎందుకు పక్కన పెట్టాలంటే... వెల్లుల్లిలో అల్లినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఈ పది నిమిషాల్లో అల్లిసిన్‌గా మారుతుంది.
  3. ఈ అల్లిసిన్ అనేదే మన శరీరానికి అత్యవసరమైనది. ఇది ఒక అద్భుతమైన ఎంజైమ్. క్యాన్సర్‌ను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
  4. మధుమేహం ఉన్నవారు ఈ వెల్లుల్లి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
  5. వెల్లుల్లి నుండి అల్లిసిన్ ఏర్పడాలంటే రెబ్బలను కచ్చితంగా సన్నగా తరగాలి. అలాగే ఓ 10 నిమిషాలు గది ఉష్ణోగ్రత వద్ద పక్కన పెట్టాలి. అప్పుడే అల్లిసిన్ ఏర్పడుతుంది. నేరుగా కూరల్లో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

వెల్లుల్లి ప్రయోజనాలు

  1. వెల్లుల్లి ఇలా ముక్కలుగా కత్తిరించి ఆ తరువాత వండడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు కూడా ఎక్కువ. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  2. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. పేగుల్లో మంట తగ్గుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. వెల్లుల్లిలో ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడే శక్తి ఉంటుంది. మన డిఎన్ఏ దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  3. వెల్లుల్లి రసాన్ని మొటిమలకు రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి.
  4. వెల్లిల్లిని క్రమం తప్పకుండా తింటే ఫ్లూ, జ్వరం, దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉంటాయి.
  5. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎంతో మంచిది. ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరవు. రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువ మందే ఉన్నారు. వారు రెండు వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కత్తిరించి ఖాళీ కడుపుతో తినాలి.
  6. దీనిలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. గొంతు సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది.
  7. దీనిలో విటమిన్ బీ6, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునే వారు వెల్లుల్లిని ఆహారంలో 8 వారాలు పాటు భాగం చేసుకోవాలి. శరీరంలోని కొవ్వు కరిగించడంలో ఇది ముందు ఉంటుంది. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది.

తదుపరి వ్యాసం