తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Helmet Cleaning Tips : వేసవిలో హెల్మెట్ వాడేప్పుడు జాగ్రత్త.. క్లీన్ చేసేందుకు సింపుల్ చిట్కాలు

Helmet Cleaning Tips : వేసవిలో హెల్మెట్ వాడేప్పుడు జాగ్రత్త.. క్లీన్ చేసేందుకు సింపుల్ చిట్కాలు

Anand Sai HT Telugu

01 April 2024, 14:00 IST

    • Helmet In Summer : మనకు జుట్టు మీద ఉన్న శ్రద్ధ. హెల్మెట్ మీద ఉండదు. హెల్మెటే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ దాని ద్వారా మీ జుట్టు పాడవుతుంది. కచ్చితంగా హెల్మెట్‌ను వేసవిలో సరైన పద్ధతిలో వాడుకోవాలి.
హెల్మెట్ శుభ్రం చేసేందుకు చిట్కాలు
హెల్మెట్ శుభ్రం చేసేందుకు చిట్కాలు (Unsplash)

హెల్మెట్ శుభ్రం చేసేందుకు చిట్కాలు

డర్టీ హెల్మెట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. నిజానికి భారతదేశంలో 70 శాతం మంది హెల్మెట్‌ను పోలీసుల భయంతో మాత్రమే ఉపయోగిస్తున్నారు. వీరంతా హెల్మెట్ పరిశుభ్రత గురించి ఆలోచించరు. హెల్మెట్ శుభ్రం చేయకపోతే జుట్టు రాలడం, గీతలు, తలనొప్పి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. పోలీసులు చూస్తారు.. ఫైన్ వేస్తారనే భయంతోనే చాలా మంది హెల్మెట్ ధరిస్తారు. కానీ హెల్మెట్ క్లీన్ చేసుకోవడం అనేది తప్పనిసరి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

దీనికి పరిష్కారం ఉందా అని అడిగితే ఉంది. మీ హెల్మెట్‌ను తాజాగా, శుభ్రంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి అనుసరించడం ద్వారా మీరు శుభ్రమైన, ఆరోగ్యకరమైన హెల్మెట్‌ను వాడుకోవచ్చు. ఇది మీ రైడ్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా భద్రతను కూడా నిర్ధారిస్తుంది. మీ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే హెల్మెట్‌లో ఉండే దుమ్ముతో మీ జుట్టు మెుత్తం పాడవుతుంది.

లోపలి భాగం క్లీన్ చేయండి

మీ హెల్మెట్‌లో లోపలి భాగం నుండి దుమ్ము లేదా కీటకాలను తొలగించండి. మురికిని శుభ్రపరచడం ద్వారా హెల్మెట్ లోపలికి సరైన గాలిని తీసుకురావచ్చు. మృదువైన బ్రష్ ఉపయోగించి, దాని గుంటలను శుభ్రం చేయడం ఉత్తమం. ఇది దుర్వాసన రావడాన్ని నిరోధిస్తుంది. మీ హెల్మెట్ చూసేందుకు శుభ్రంగా కనిపిస్తుంది.

చెమట పొగొట్టాలి

వేసవిలో ఎవరికైనా చెమట అనేది సాధారణ సమస్య. ముఖ్యంగా గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్‌లో చెమట పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. మీ జుట్టును కవర్ చేయడానికి క్యాప్ లేదా స్కార్ఫ్ ఉపయోగించడం మంచిది. కొన్ని హెల్మెట్‌లు చెమట నుంచి రక్షమ కల్పించేవిగా ఉంటాయి. అవి వాడితే ఇంకా మంచిది. చెమట పేరుకుపోయి మీ హెల్మెట్స్ దారుణంగా తయారవుతాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

దుమ్ము, ధూళిని తొలగించండి

హెల్మెట్‌ను తరచుగా కడగడం, దానిలోని దుమ్ము, ధూళిని తొలగించడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే శుభ్రం చేయకుండానే ఏళ్ల తరబడి వాడుతుంటాం. హెల్మెట్ లోపల, వెలుపల గోరువెచ్చని నీరు, సబ్బును ఉపయోగించండి. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణం తర్వాత కచ్చితంగా ఈ పని చేయాలి. గుడ్డ లేదా స్పాంజ్‌తో హెల్మెట్‌ను సున్నితంగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల శుభ్రం అవుతాయి.

అన్ని తీసి క్లీన్ చేయండి

అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన స్ప్రేలు, క్లీనర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ హెల్మెట్‌లో తొలగించగల లైనర్లు, ప్యాడ్‌లు ఉంటే వాటిని తీసివేయవచ్చు. వాటిని విడిగా శుభ్రం చేయండి. మీ హెల్మెట్‌ను తిరిగి ఫిక్స్ చేసేందుకు పూర్తిగా ఆరబెట్టాలని నిర్ధారించుకోండి. తేమతో పాటుగా వాడితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

దుర్వాసన పొగొట్టాలి

మీ హెల్మెట్ దుర్వాసన వస్తుంటే.. ఆ క్షణంలో మాత్రమే హెల్మెట్ డియోడరైజర్‌ని ఉపయోగించవచ్చు. కానీ వాసన ఉంటే వెంటనే శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పైన పేర్కొన్న పద్ధతిలో హెల్మెట్‌ను కడగడం, స్ప్రే చేయడం ద్వారా హెల్మెట్‌తో ఏవైనా సమస్యలను నివారించవచ్చు.

హెల్మెట్‌లు నేరుగా సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం వల్ల నెమ్మదిగా పాడవుతాయి. హెల్మెట్‌ను హ్యాండిల్‌బార్‌పై ఉంచే బదులు బైక్‌ని పార్క్ చేసి తీసుకెళ్లడం మంచిది. ఉపయోగంలో లేనప్పుడు ఇంట్లో ఉంచండి.

తదుపరి వ్యాసం