తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Onions | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఇందుకేనేమో..

Raw Onions | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఇందుకేనేమో..

HT Telugu Desk HT Telugu

20 April 2022, 16:49 IST

    • ఉల్లిపాయలు మీ కూరలకు ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అంతేకాకుండా ఇవి మీకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌ను కూడా రుచిగా మార్చుతాయి. ఇవి రుచిని ఇవ్వడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి వీటిని వేసవిలో కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వీటిన వేసవిలో ఉల్లిపాయలను ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి వల్ల కలిగే ఉపయోగాలు
ఉల్లి వల్ల కలిగే ఉపయోగాలు

ఉల్లి వల్ల కలిగే ఉపయోగాలు

వేసవి కాలంలో మీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ సీజన్​లో వచ్చే ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చని.. మీ రోగనిరోధక శక్తిని అవసరమైన బూస్ట్‌ని అందిస్తుందని అంటున్నారు. మొక్కల ఆధారిత సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్ కలిగిన ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి కూడా మనల్ని రక్షించగలవు. దగ్గు, జలుబు, పిల్లికూతలకు నివారణిగా ఉపయోగించేవారు.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

దీర్ఘకాల ఆరోగ్యానికి ఉల్లి చేసే ..

ఉల్లిపాయల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల బలమైన రసాయనాలు కలిగి ఉంటాయి. మీ జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ఉల్లిపాయలు పూర్తిగా విటమిన్లు, ఖనిజాలు, మొక్కల రసాయనాలతో నిండి ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి వివిధ మార్గాల్లో ప్రయోజనం చేకూరుస్తాయి. అందుకే పాత కాలం నుంచే వివిధ వ్యాధుల నివారణకు ఉల్లిపాయను వాడేవారు.

పురాతన కాలం నుంచి ఉల్లిపాయలను తలనొప్పి, గుండె జబ్బులు, నోటిపూతలు వంటి చికిత్సలకు ఉపయోగించేవారు. దీనిలోని ఔషధ గుణాలు వ్యాధులను త్వరగా నయం చేసేవి. మధ్యస్థ ఉల్లిపాయలో కేవలం 44 కేలరీలు మాత్రమే ఉంటాయి. పైగా దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక పనితీరులో ముఖ్యమైన పోషకం. కొల్లాజెన్ ఏర్పడటం, కణజాల వైద్యం, ఐరన్​ కోసం ఉల్లిపాయను తీసుకోవచ్చు.

వేసవిలో చర్మంపై దద్దుర్లు రాకుండా..

ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే పదార్ధం ఉందని, ఇది సహజ యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. హిస్టమైన్ అనేది కీటకాల కాటు వల్ల, వేసవి వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి ఉల్లిపాయ వేసవిలో గొప్ప సహాయం చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం