తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Cabbage: దీర్ఘకాలిక వ్యాధులను తప్పించుకోవాలంటే క్యాబేజీ తినేయండి..

Benefits of Cabbage: దీర్ఘకాలిక వ్యాధులను తప్పించుకోవాలంటే క్యాబేజీ తినేయండి..

04 January 2023, 17:44 IST

    • Health Benefits of Cabbage : క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక సమస్యలనుంచి మనల్ని రక్షిస్తాయి. మరి అవేంటో.. దీనిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ వల్ల కలిగే ప్రయోజనాలు
క్యాబేజీ వల్ల కలిగే ప్రయోజనాలు

క్యాబేజీ వల్ల కలిగే ప్రయోజనాలు

Benefits of Cabbage : కూరగాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. వాటిలో క్యాబేజీ ఒకటి. దీనిని అనేక వంటకాలను అలంకరించడానికి, కూరలా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ క్యాబేజీలు మార్కెట్లలో అనేక రంగులలో లభిస్తాయి. ఇప్పుడు మనం పచ్చని క్యాబేజీ గురించి తెలుసుకోబోతున్నాము.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

క్యాబేజీ శాస్త్రీయ నామం బ్రాసికా ఒలేరేసియా. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అంతే కాదు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటంటే..

రోగనిరోధక శక్తి

క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నిజానికి బలమైన రోగనిరోధక శక్తి అనేక కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ

మీరు జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటే.. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోండి. రుచితో పాటు జీర్ణక్రియకు కూడా మంచిదని భావిస్తారు. క్యాబేజీలో ఫైబర్, ఆంథోసైనిన్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడం

విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లక్షణాలు క్యాబేజీలో కనిపిస్తాయి. ఇది తరచుగా ఆకలి నుంచి మిమ్మల్ని రక్షించడానికి పని చేస్తుంది. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది.

గుండె

క్యాబేజీలోని ఆంథోసైనిన్ పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. ఇది కార్డియాక్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మధుమేహం

క్యాబేజీ మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. క్యాబేజీ సారంలో యాంటీహైపెర్గ్లైసీమిక్ ప్రభావం ఉందని.. ఇది శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచడానికి, ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి పని చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

తదుపరి వ్యాసం