తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Dhanteras 2022 : మీ ప్రియమైన వారికి.. ధన్‌తేరాస్​ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

Happy Dhanteras 2022 : మీ ప్రియమైన వారికి.. ధన్‌తేరాస్​ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

22 October 2022, 9:30 IST

    • Happy Dhanteras 2022 Wishes: ధన్‌తేరాస్ (ధన త్రయోదశి)​ అక్టోబర్ 23వ తేదీన వస్తుంది. అయితే కొందరు అక్టోబర్ 22వ తేదీన కూడా జరుపుకుంటున్నారు. అయితే కార్తీకమాసంలోని కృష్ణపక్ష త్రయోదశి రోజున వచ్చే ధన్​తేరాస్​కి మీరు మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కూడా ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
ధన్‌తేరాస్ విషెష్ 2022
ధన్‌తేరాస్ విషెష్ 2022

ధన్‌తేరాస్ విషెష్ 2022

Happy Dhanteras 2022 Wishes: ధన్​తేరాస్​ని ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 23న ఈ పండుగ వస్తుంది. అయితే కొన్ని క్యాలెండరీల ప్రకారం.. కొందరు అక్టోబర్ 22న కూడా చేసుకుంటున్నారు. ఇది దీపావళి వేడుకలకు నాంది పలుకుతుంది. హిందువుల చాంద్రమానమైన కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి (పదమూడవ రోజు) రోజున ధన్​తేరాస్ వస్తుంది. ఈరోజు లక్ష్మి, ధన్వంతరి, కుబేరుడు (సంపద దేవుడు), యమరాజును (మరణం దేవుడు) కీర్తిస్తూ.. పూజిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

ఆయుర్వేద వైద్యం జ్ఞానాన్ని మానవాళికి అందించినందుకు హిందువులు ఆయుర్వేద దేవత అయిన ధన్వంతరికి కూడా నివాళులర్పిస్తారు. పవిత్రమైన ధనత్రయోదశి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కుబేరుని గౌరవార్థం కుబేరుని పూజ చేస్తారు. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలతో.. ధన్‌తేరస్ పూజ చేస్తారు.

ధన్‌తేరాస్ 2022లో భాగంగా.. మీరు పూజతో పాటు.. మీ శ్రేయోభిలాషులకు.. WhatsApp ద్వారా శుభాకాంక్షలు చెప్పవచ్చు. మీకోసం ఇక్కడ కొన్ని సందేశాలు ఉన్నాయి. మీరు ఓ లుక్కేసి.. మీ ఫ్రెండ్స్​కి, ఫ్యామిలి మెంబర్స్​కి పంపేయండి.

Dhanteras 2022 Wishes: ధన త్రయోదశి 2022 విషెస్ ఇవిగో…

* ఈ ధన్​తేరాస్ మీకు కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త మార్గాలు, వస్తువులు లేదా నచ్చినవాటిని చూసే కొత్త మార్గాలు.. ప్రకాశవంతమైన, ఆనంద క్షణాలు ఇవ్వాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటున్నాను. ధన్​తేరాస్ శుభాకాంక్షలు.

* దేవుని ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఈ ధన త్రయోదశి రోజున ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నా.. ధన్​తేరాస్ శుభాకాంక్షలు.

* ఈ రోజు మృత్యుదేవత కోసం ఇంటి వెలుపల దీపం వెలిగిస్తారు. తద్వారా కుటుంబంలో ఎవరూ త్వరగా మరణించరని భావిస్తాము. మీ ధనత్రయోదశి/ధన్​తేరాస్ సంతోషంగా, విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

* సర్వశక్తిమంతుడి ఆశీర్వాదాలు మీకు ఆశ్చర్యం కలిగించాలి. కానీ ఈ శుభ్ ధన్‌తేరస్‌లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను.

* మీకు, మీ కుటుంబసభ్యులకు ధన్​తేరాస్ శుభాకాంక్షలు.

* మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ధన త్రయోదశి శుభాకాంక్షలు.

* ఈ శుభదినాన ఎప్పటికీ మీకు సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. శుభ్ ధన్​తేరాస్.

* మీ జీవితంలో ఆనందం, శాంతికి ఎటువంటి లోటు ఉండకూడదని.. ఆ దేవుడిని కోరుకుంటున్నాను. హ్యాపీ ధన్​తేరాస్.

* ఈ ధన్​తేరాస్ ఉత్సవాలు మీకు సంపద, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సుసంపన్నమైన భవిష్యత్తు పొందాలని విష్ చేస్తున్నాను. ధన్​తేరాస్ శుభాకాంక్షలు!

* ఈ పర్వదినాన లక్ష్మీ దేవి మీకు అన్ని శుభాలను అందిస్తుంది. హ్యాపీ ధన్​తేరాస్. ధన్‌తేరాస్ విషెష్ 2022.

టాపిక్

తదుపరి వ్యాసం