తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : బాధలో ఉన్నప్పుడు.. పరిస్థితులను, మనుషులను గమనించండి..

Friday Motivation : బాధలో ఉన్నప్పుడు.. పరిస్థితులను, మనుషులను గమనించండి..

09 September 2022, 7:03 IST

    • Friday Motivation : మీ లైఫ్​లో ఏదైనా బాధపడే విషయం జరిగినప్పుడు లేదా.. హర్ట్ అయ్యే విషయం జరిగినప్పుడు బాధపడడం సహజం. అప్పుడు మీరు చేయవలసిన మేజర్ పని ఏదైనా ఉంది అంటే అది మీ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను గమనించడం. ఎందుకంటే మీరు బాధపడుతున్నారంటే.. జీవితం మీకేదో నేర్పించడానికి ట్రై చేస్తుందని అర్థం.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : కొన్నిసార్లు మనం తీవ్రంగా బాధపడుతూ ఉంటాము. అనుకున్నది సాధించలేనప్పుడో.. లేదా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడో.. లేదా ఎవరైనా అనరాని మాటలు అన్నప్పుడో.. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అందరూ కచ్చితంగా బాధపడుతూ ఉంటాము. ఆ సమయంలో కాస్త ధైర్యం తెచ్చుకుని.. మీ పరిస్థితులను, మీ చుట్టూ మనుషులను గమనించండి. ఎందుకంటే మీరు బాధపడడానికి లేదా ఓడిపోవడానికి రీజన్ మీకు తెలిస్తే.. అది మీ వల్ల జరిగిందో.. పరిస్థితుల వల్ల జరిగిందో.. ఇతరుల వల్ల జరిగిందో అనే క్లారిటీ వస్తుంది. పైగా అటుపై ఆ పొరపాట్లు జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

బాధలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం కష్టం. కానీ విమర్శలను సానుకూలంగా తీసుకున్నప్పుడు.. మీకు ధైర్యం కచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న విషయాలు గమనించాలి. మిమ్మల్ని ముందుకు నడిపించేవారు ఎవరు.. మిమ్మల్ని ఆపేసే వారు ఎవరు.. మిమ్మల్ని వెనక్కి లాగేవారు ఎవరో కచ్చితంగా తెలుస్తుంది. అంతేకాకుండా వారు మీతో ప్రవర్తించే విధానాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. మీతో మంచిగా మాట్లాడుతూ.. పక్కకు వెళ్లి మీపై చాడీలు చెప్పేవారు కూడా ఉంటారు. అలాంటి వారితో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఇవి జీవితం నేర్పే పాఠాలు. మీకు మీరుగా ఈ విషయాలు తెలుసుకోవాలి.

మీరు బాధపడుతున్నప్పుడు చుట్టూ జరిగే విషయాలను గమనించడం వల్ల మీ మైండ్ కాస్త డైవర్ట్ అవుతుంది. అది మీకు మంచిది. బాధను తగ్గించలేము కానీ కాస్త ఉపశమనం ఉంటుంది. సెల్ఫ్ గ్రోత్ కోసం ఇది చేస్తున్నారని మీరు గుర్తించాలి. ఎప్పుడూ బాధపడే వ్యక్తిలా మాత్రమే కాకుండా.. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోనే మనస్తత్వం కలిగి ఉండాలి. మీరు బాధపడుతున్నారంటే.. మిమ్మల్ని ఇంకా బాధపెట్టే జనాలు మన చుట్టూ ఉన్నారని గమనించాలి.

ఒక్క సమస్యతోనే జీవితం ఆగిపోదు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి, ఓపికతో ఉంటే.. మీ జీవితం కూడా చెక్కిన శిల్పంలా అందంగా తయారవుతుంది. ఒక్క సమస్యకే కృంగిపోతున్నారంటే.. మీరు సగం చెక్కిన శిల్పంలా తయారవుతారు. కష్ట సమయాలు కూడా జీవితం అనే ఆటలో ఒక భాగం మాత్రమే. గేమ్ ఇంకా కంప్లీట్ కాలేదనుకోవాలి. బాధలో, నొప్పిలో ఉన్నప్పుడు ఓపికగా ఉండండి. మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఎవరితో ఎలా మెలగాలో తెలుస్తుంది. ఈ పాఠాలు మీ జీవితాంతం ఉపయోగపడతాయి. అవి మీరు వందసార్లు పడిపోయినా.. తిరిగి లేవగలిగే మానసిక స్థితిని అందిస్తాయి.

తదుపరి వ్యాసం