తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods After Fever: జర్వం తగ్గిన తర్వాత తొందరగా కోలుకోవాలంటే.. ఇవి తినండి..

Foods After Fever: జర్వం తగ్గిన తర్వాత తొందరగా కోలుకోవాలంటే.. ఇవి తినండి..

23 November 2023, 18:06 IST

  • Foods After Fever: జ్వరం తగ్గినా నీరసం తగ్గదు. దాన్నుంచి బయటపడాలంటే కొన్ని పొట్టకు హానియిచ్చే ఆహారాలు తినాల్సిందే. అవేంటో తెల్సుకోండి.

ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు
ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు (freepik)

ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు

సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాల్లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మందులు వేసుకుని ఏదోలా వీటిని తగ్గించుకుంటాం. ముఖ్యంగా జ్వరం తగ్గిన తర్వాత చాలా నీరసంగా, విసుగ్గా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఏ పని చేయాలన్నా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా జ్వరం నీరసం నుంచి తొందరగా బయటపడి మళ్లీ మనం సాధారణంగా పనుల్ని చేసుకోవాలంటే కొన్ని ఆహారాలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

కిచిడీ :

జ్వరంగా ఉన్నప్పుడు మనం సాధారణంగా సరిగ్గా ఏమీ తినలేం. అయితే అది తగ్గిన తర్వాత ఒక్కసారిగా తొందరగా అరగని ఆహారాలను తీసుకోకూడదు. బదులుగా కిచిడీ లాంటి తేలికపాటి ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. బియ్యంలో కాస్త పెసరపప్పు, కూరగాయ ముక్కలు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. తర్వాత నేతిలో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం లాంటివి వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. దీనిలో కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్లు లాంటివి చక్కగా లభిస్తాయి. కాబట్టి జ్వరం తర్వాత ఈ ఆహారాన్ని ప్రయత్నించవచ్చు.

పెరుగు లేదా పెరుగన్నం :

పెరుగులో పుష్కలంగా ప్రోబయాటిక్స్‌ ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జ్వరంతో ఉన్నప్పుడు చాలా మంది యాంటీ బయోటిక్‌ మందుల్ని వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాలు నశిస్తాయి. దీంతో తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. అందుకనే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మనం మళ్లీ పేగుల్లో మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు పెరుగు గాని, పెరుగన్నం గాని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.

కొబ్బరి నీళ్లు :

జ్వరంగా ఉన్నప్పుడు శరీరం చాలా ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. వాటిని మళ్లీ తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లను రోజూ తాగుతూ ఉంటాలి. అందువల్ల మన శరీరం మళ్లీ హైడ్రేటెడ్‌గా మారి తిరిగి శక్తిని పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

అరటి, దానిమ్మలు :

జ్వరం వచ్చి తగ్గిన తర్వాత అరటి పండు, దానిమ్మ పండ్లను తినడం వల్ల నీరసం తగ్గుతుంది. అరటి పండులో సహజమైన ఎలక్ట్రోలైట్లయిన పొటాషియం లాంటివి ఉంటాయి. అలాగే దానిమ్మ పండులో విటమిన్లు, మినరళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహకరిస్తాయి. కాబట్టి జ్వరం వచ్చి తగ్గినా నీరసంగా అనిపిస్తున్న వారు పై ఆహార పదార్థాలను కచ్చితంగా తినే ప్రయత్నం చేయండి. శరీరం శక్తిని పుంజుకుంటుంది.

తదుపరి వ్యాసం