తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Study: తండ్రి ఆహారపు అలవాట్లు అతని కొడుకు, కూతుళ్ళపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోండి

New Study: తండ్రి ఆహారపు అలవాట్లు అతని కొడుకు, కూతుళ్ళపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

25 April 2024, 14:16 IST

    • New Study: తండ్రి ఆహారపు అలవాట్లు అతనికి పుట్టిన పిల్లలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయని కొత్త అధ్యయనం తేల్చింది. కొడుకుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో, కూతురుపై ఎలాంటి ప్రభావానికి కారణం అవుతాయో పరిశోధనకర్తలు చెబుతున్నారు.
పిల్లలపై ప్రభావం చూపించే తండ్రి ఆహారపు అలవాట్లు
పిల్లలపై ప్రభావం చూపించే తండ్రి ఆహారపు అలవాట్లు (Pixabay)

పిల్లలపై ప్రభావం చూపించే తండ్రి ఆహారపు అలవాట్లు

New Study: తండ్రి తినే ఆహారం అతని కొడుకులు, కూతుళ్ళపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయని తాజా అధ్యయనం తెలిసింది. ఈ కొత్త పరిశోధన ప్రకారం తండ్రి ఆహారపు అలవాట్లు అతని పుట్టే కొడుకుల్లో మానసిక ఆందోళన స్థాయిలను పెంచుతాయని, అలాగే కుమార్తెలలో జీవక్రియలను ప్రభావితం చేస్తాయని చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మగ ఎలుకలపై ఈ పరిశోధనను చేసింది. మగ ఎలుకలకు తక్కువ ప్రోటీన్లు, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని కొంతకాలం పాటు తినిపించారు. ఆ మగ ఎలుకలకు పుట్టిన మగసంతానం ఎక్కువ ఆందోళనకు గురవుతున్నట్టు కనిపెట్టారు. ఇక అధిక కొవ్వు ఆహారం తినిపించిన మగ ఎలుకలకు పుట్టిన కుమార్తెలలో జీవసంబంధమైన మార్పులు కనిపించాయి. దీన్ని బట్టి తండ్రి తినే ఆహారం పుట్టబోయే పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందని కనుగొన్నారు.

ఎలుకలపైనే ఎందుకు?

మనిషిపై ఎలాంటి ప్రయోగం చేయాలన్నా మొదట ఎలుకలపైనే శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాన్ని చేస్తారు. మార్కెట్లో కొత్త ఔషధాన్ని లేదా వ్యాక్సిన్ మొదటిగా ప్రయోగించేది ఎలుకలపైనే. ఆ తర్వాతే మనుషులపై ఆ ప్రయోగాల్ని నిర్వహిస్తారు. మనుషుల్లాగే ఎలుకలకు అనేక వ్యాధులు సోకుతాయి. అలాగే శారీరక భాగాలు కూడా ఒకేలా పని చేస్తాయి. 95% జన్యువులు మనుషులు, ఎలుకలలో ఒకేలా ఉంటాయి. అందుకే మొదట ఎలుకల పైనే పరిశోధనలన్నీ జరుగుతాయి. మానవుడి జన్యు జీవక్రియను ఎలుకలు కూడా పోలి ఉంటాయి. మనిషికి ఉండే లక్షణాలు, శరీర నిర్మాణం, జీవ ప్రక్రియ ఎలుకలకు కూడా అలానే ఉంటాయి. అందుకే మనిషిలో మందులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం కోసం మొదటగా ఎలుకలపైనే ప్రయోగాలు చేస్తారు.

ఎలుకల సంతతి కూడా అధికంగా ఉంటుంది. వాటిని ప్రయోగశాలలో పెంచడం చాలా సులువు. ఏ ఆహారాన్ని అయినా అవి తిని బతకగలవు. మనుషుల్లాగే అవి తెలివైనవి. అవి యాభై అడుగుల ఎత్తు నుంచి పడినా కూడా వాటి శరీరానికి ఏమీ కాదు. కాకపోతే ఎలుకల వల్ల 30 రకాల వ్యాధులు మనుషులకు వస్తాయి. వాటి దంతాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఏడాదికి 1 అంగుళం నుంచి రెండు అంగుళాల వరకు దంతాలు పెరుగుతాయి. అందుకే అవి అలా ఏవో ఒకటి కొరుకుతూ ఉంటాయి. అలా కొరకడం వల్ల అవి పెద్దగా పెరగకుండా ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం