తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pain During Winters: కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి చిట్కాలు ఇవిగో..

Joint pain during winters: కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి చిట్కాలు ఇవిగో..

HT Telugu Desk HT Telugu

25 November 2022, 15:57 IST

    • Joint pain during winters: ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్న వారికి చలికాలం ఒక శత్రువులా కనిపిస్తుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి చిట్కాలివే
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి చిట్కాలివే (Pexels)

ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి చిట్కాలివే

ఆర్థరైటిస్‌కు చలికాలం కారణం కానప్పటికీ, చల్లని వాతావరణం ఆటో ఇమ్యూన్ వ్యాధితో సంబంధం ఉన్న నొప్పులను తీవ్రతరం చేస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి వింటర్ సీజన్‌‌లో పలు అంశాలు మరింత క్లిష్టతరం చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కీళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాలు స్టిఫ్‌గా మారడం వంటి అంశాలు చలి కాలంలో ఆర్థరైటిస్ పేషెంట్లకు సవాళ్లుగా మారుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

అయితే వీటిని కొన్ని జీవనశైలి మార్పులతో సులభంగా అధిగమించవచ్చు. చురుగ్గా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మంచి భంగిమ‌లో కూర్చోవడం, నిల్చోవడం, కఠినమైన పనులకు దూరంగా ఉండటం వంటివి ఈ వ్యాధిని ఎదుర్కోవటంలో సహాయపడతాయి.

ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి చలికాలం ఎందుకు ఇబ్బందికరం?

‘ఆర్థరైటిస్ నొప్పిని కలిగిస్తుంది. శీతాకాలంలో నొప్పి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అరిగిపోయిన మృదులాస్థి కీలు లోపల ఎముకలపై ఒత్తిడి కలిగిస్తుంది. నరాలు ఒత్తిడికి లోనవుతాయి. అలాగే చలికాలంలో మన శరీరం వేడిని సంరక్షించుకోడం, రక్తాన్ని ముఖ్యమైన అవయవాలకు పెద్ద మొత్తంలో పంపిణీ అయ్యేలా చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చేతులు, కాళ్ళు, భుజాలు, మోకాలి కీళ్లలో ఉండే రక్తనాళాలు స్టిఫ్‌గా మారతాయి. ఇది నొప్పి, అసౌకర్యానికి దారితీస్తాయి’ అని స్పోర్ట్స్ మెడిసిన్‌పై ప్రత్యేక ఆసక్తి ఉన్న కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోధ హాస్పిటల్ ఆర్థ్రోస్కోపి, జాయింట్ ప్రిజర్వేషన్ డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి చెప్పారు.

సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉంటే ఇబ్బందులు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు మాట్లాడుతూ శారీరకంగా ఎక్కువ చురుగ్గా ఉండే వారితో పోలిస్తే సెడెంటరీ లైఫ్‌స్టైల్ కలిగిన వాళ్లు చలికాలంలో ఆర్థరైటిస్‌తో ఎక్కువ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు.

‘శీతాకాలంలో కండరాల్లో స్టిఫ్‌నెస్ ఏర్పడుతుంది. మోకాలిచిప్పలో ఉండే సైనోవియల్ ద్రవం తక్కువ ఉష్ణోగ్రతలలో చిక్కగా ఉంటుంది. మోకాలి చుట్టూ ఉన్న గట్టి కండరాలు కదలిక ఉన్నప్పుడు ఘర్షణను సృష్టిస్తాయి. ఉపరితలంపై పలకలు ఏర్పడతాయి. సైనోవియల్ ద్రవం తక్కువ విడుదలైతే ఆస్టియోమలాసియా మార్పులకు దారితీస్తుంది. ఇవి ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులలో నొప్పిని పెంచే నరాలను తాకుతాయి. కార్మికులు నిరంతరం శారీరక శ్రమలకు గురవుతారు కాబట్టి తరచుగా ఈ సమస్యలను ఎదుర్కోరు. శ్రమించడం వల్ల కీళ్లలో వేడి ఉత్పత్తి అయి సైనోవియల్ ద్రవం విడుదల అవుతుంది. సెడెంటరీ (కదలిక లేని) ఉద్యోగాలు లేదా డెస్క్ జాబ్‌లు ఉన్న వ్యక్తులు సూర్యరశ్మికి లేదా శారీరక కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధికి బాధితులుగా చేస్తుంది..’’ అని డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు చెప్పారు.

చలికాలంలో ఆర్థరైటిస్ రోగుల జీవనశైలిలో మార్పులు

చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఈ క్రింది జీవనశైలి మార్పులను డాక్టర్ నారాయణ్ హల్సే సూచిస్తున్నారు. ఆయన ఫోర్టిస్ హాస్పిటల్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

• మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. ఇంట్లో వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

• ఎండలో వేగంగా నడవడం లేదా వ్యాయామాలు మీలో వేడిని పెంచడమే కాకుండా కీళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వల్ల మీ శరీరానికి, మనసుకు సహాయపడవచ్చు.

• ఆరోగ్యకరమైన ఆహారం, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు, విత్తనాలు చలికాలంలో మీకు ఆర్థరైటిస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

• విటమిన్ డి సప్లిమెంట్లు కూడా మీకు రక్షణనిస్తాయి. అలాగే సహజ సూర్యరశ్మి మీకు ఆర్థరైటిస్ నుంచి రక్షణనిస్తుంది.

• గోరువెచ్చని నీటితో స్నానాలు, స్విమ్మింగ్ శరీర వేడిని క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.

కీళ్లను కదిలిస్తూ ఉండండి: డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి

‘మీ కీళ్లను కదిలిస్తూ ఉండండి. క్రమం తప్పకుండా సున్నితమైన స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజెస్ చేయండి. కదలికలు మీ నొప్పిని, స్టిఫ్‌నెస్‌ను తగ్గిస్తాయి. మీ కండరాలను బలోపేతం చేస్తాయి. మీరు సరైన భంగిమలో ఉండేలా చూసుకోండి. సరిగ్గా కూర్చోవడం, నిలబడటం, కదలడం విషయంలో ఫిజికల్ థెరపిస్ట్ సాయం తీసుకోవచ్చు. బరువును అదుపులో ఉంచండి. అధిక బరువు ఆర్థరైటిస్ సమస్యలను పెంచుతుంది. క్రమంగా బరువు తగ్గడానికి జీవనశైలిలో మార్పులు చేయడం మంచిది..’ అని డాక్టర్ తేజస్వి చెప్పారు. రన్నింగ్, జంపింగ్, కఠినమైన ఏరోబిక్ ఎక్సర్‌సైజులకు దూరంగా ఉండాలని, తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

టాపిక్

తదుపరి వ్యాసం