తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Weak Kidneys: కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించాయా? అయితే ఈ 6 చిట్కాలు పాటించండి

Home remedies for weak kidneys: కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించాయా? అయితే ఈ 6 చిట్కాలు పాటించండి

HT Telugu Desk HT Telugu

31 January 2023, 16:24 IST

    • Home remedies for weak kidneys: కిడ్నీలు వీక్‌గా ఉన్నట్టు అవి పాడయ్యేంతవరకు ఎలాంటి సంకేతాలు కనిపించవు. అయితే కొన్ని సంకేతాల ఆధారంగా కిడ్నీ పరీక్షలు చేయించుకుని, వాటి పనితీరు మెరుగుపరచుకోవచ్చని భక్తి కపూర్ చెబుతున్నారు. ఆమె సూచించిన హోమ్ రెమెడీస్ మీకోసం..
కిడ్నీలు బలహీనంగా ఉంటే తీసుకోవాల్సిన చర్యలు ఇవే
కిడ్నీలు బలహీనంగా ఉంటే తీసుకోవాల్సిన చర్యలు ఇవే (Freepik)

కిడ్నీలు బలహీనంగా ఉంటే తీసుకోవాల్సిన చర్యలు ఇవే

బలహీనమైన కిడ్నీ అంటే.. ఏదైనా గాయం వల్ల గానీ, వ్యాధి వల్ల గానీ కిడ్నీ తన పని సరిగ్గా చేయలేకపోవడమే. శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను కిడ్నీలు తొలగిస్తాయి. నీరు, లవణాలు, ఖనిజ లవణాలను సమతుల్యం చేయడంలో కిడ్నీ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కిడ్నీ బలహీనంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు కనిపించవు. కిడ్నీ ఇక తన పని తాను చేయలేకపోయినప్పుడే లక్షణాలు కనిపిస్తాయి. అంటే పూర్తిగా పాడయ్యేవరకు కూడా మనకు సంకేతాలు కనిపించవు. కిడ్నీ వ్యాధులు, హై బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ వంటి వ్యాధుల వల్ల కిడ్నీలు పాడవుతాయి. ఒకవేళ దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టయితే క్రమంగా కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. పదేపదే మూత్ర విసర్జన చేయాలనిపించడం, రాత్రి కూడా మూత్ర విసర్జన చేయాల్సిరావడం, ఆకలి లేకపోవడం, కళ్లు ఉబ్బడం, నోటి నుంచి దుర్వాసన, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కిడ్నీ బలహీనంగా ఉందనడానికి కనిపించే సంకేతాలుగా భావించాలి.

ట్రెండింగ్ వార్తలు

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

న్యూట్రీషినిస్ట్ భక్తి కపూర్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బలహీనంగా ఉన్న కిడ్నీల గురించి, వాటికి ఇంటి వద్ద ఉండే పరిష్కారాల గురించి చర్చించారు.

‘కిడ్నీలు శరీరానికి వ్యర్థాలు సేకరించే వ్యక్తిగత సహాయకుడిలా పనిచేస్తాయి. మీ శరీరంలోని పక్కటెముకల కింద అమరి ఉండే ఈ మూత్రపిండాలు రోజూ 55 గ్యాలన్ల రక్తాన్ని శుద్ధి చేసి ఇందులో నుంచి వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరంలో వ్యర్థాలు, అదనపు ద్రవాలు నిల్వ కాకుండా కిడ్నీలు నిరోధిస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఎర్ర రక్త కణాలు తయారు చేసేందుకు దోహదం చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే బ్లడ్ ప్రెజర్ నియంత్రిస్తాయి. ఎముకలు బలంగా ఉండేందుకు దోహదపడతాయి. అయితే కిడ్నీ వ్యాధులు చాలా సమస్యాత్మకమైనవి. కిడ్నీ వ్యాధులు బాగా ముదిరిపోయే వరకూ బయటపడవు. అంటే డయాలసిస్, లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే వరకూ కిడ్నీ వ్యాధులు బయటపడవు..’ అని వివరించారు. కిడ్నీలు బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి ఆమె కొన్ని సంకేతాలు వివరించారు.

SIGNS OF WEAK KIDNEYS: కిడ్నీలు బలహీనంగా ఉన్నాయని చెప్పే సంకేతాలు

1. కళ్లు ఉబ్బడం (Puffy eyes): ప్రొటీన్ అవసరానికి మించి తీసుకోవడం వల్ల కళ్లు ఉబ్బినట్టు కనిపిస్తాయి.

2. రాత్రిళ్లూ మూత్ర విసర్జన (Nocturia): మీరు రాత్రి పూట మూత్ర విసర్జన చేసేందుకు తరచుగా నిద్ర లేవాల్సి రావడం.

3. ముఖం ఉబ్బడం లేదా మూత్రంలో నురగ: శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు ఇలా ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు నీరు ఎక్కువగా తాగాలి.

4. నోటి నుంచి దుర్వాసన లేదా లోహం వంటి రుచి: నోటి నుంచి దుర్వాసన లేదా లోహం వంటి రుచి కలిగినప్పుడు మీ కిడ్నీలు బలహీనంగా ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

కిడ్నీల ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలి, తగినంత నీరు తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యం బాగుంటుందని కపూర్ వివరించారు. కిడ్నీల ఆరోగ్యానికి పలు సూచనలు చేశారు.

1. విటమిన్ సీ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి

తరచుగా నిమ్మ రసం తీసుకోవడం అవసరం. అలాగే విటమిన్ సీ అధికంగా ఉంటే సిట్రస్ పండ్లు, బ్రోకలీ, దోస కాయ, ఆకు కూరలు విరివిగా తీసుకోవాలి. కాల్షియం రాళ్లు పెరగకుండా సిట్రేట్ కాపాడుతుంది. సిట్రేట్ వల్ల చిన్న రాళ్లు కూడా పగిలి మూత్రంలో వెళ్లిపోతాయి.

2. ఉప్పు తగ్గించడండి

కిడ్నీలు బాగోలేనప్పుడు ఉప్పు తగ్గించడం మంచిది. బ్లడ్ ప్రెజర్ పెరగడం వల్ల కిడ్నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

3. పొటాషియం తక్కువగా ఉన్న ఆహారం

అరటి పండ్లు, నారింజ, ఆలు గడ్డ, పాలకూర, టమాటల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆపిల్స్, కాబేజ్, కారెట్లు, బీన్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీల్లో పొటాషియం తక్కువగా ఉంటుంది. కిడ్నీ బలహీనంగా ఉంటే అధిక పొటాషియం ఆహారం తీసుకోవడం మానేయాలి.

4. ప్రొటీన్ తగ్గించాలి

ప్రొటీన్ అధికంగా ఉండే మాంసాహారం వంటివి తగ్గించడం అవసరం. అధిక ప్రొటీన్‌ను మూత్ర పిండాలు బయటకు పంపడం కష్టమవుతుంది.

5. కొత్తమీర రసం:

కిడ్నీలు తమ విధులు సక్రమంగా నిర్వర్తించడానికి కొత్తిమీర, పూదీన వంటి ఆకు రసాలు తాగాలి. వీటిలో ఖనిజ లవణాలు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. భోజనానికి అరగంట ముందు ఓ గ్లాసు కొత్తి మీర రసం తాగండి.

6. సింహదంష్ట్రిక వేరు(Dandelion root)

సింహదంష్ట్రిక పుష్పాల్లో యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. అలాగే సింహదంష్ట్రిక వేరు కిడ్నీలను, మూత్రాశయాన్ని, కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం