తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Fatigue । ఉదయం వేళ అలసటగా ఉండి నిద్రలేవలేకపోతున్నారా? అది డైసానియా కావచ్చు!

Morning Fatigue । ఉదయం వేళ అలసటగా ఉండి నిద్రలేవలేకపోతున్నారా? అది డైసానియా కావచ్చు!

HT Telugu Desk HT Telugu

07 November 2022, 7:34 IST

    • Morning Fatigue: ఉదయం లేవాలంటే బద్ధకంగా ఉంటుందా, అలసట ఉంటూ బలహీనంగా భావిస్తున్నారా? అయితే అది డైసానియా అనే మానసిక ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చు. మరిన్ని లక్షణాలు చూడండి.
Morning Fatigue
Morning Fatigue (Unsplash)

Morning Fatigue

రాత్రి త్వరగా పడుకోవడం, తెల్లవారుఝామున మేల్కొనడం చేస్తే ఆరోగ్యంగా ఉంటారంటారు. కానీ చాలామందికి ఉదయాన్నే లేవాలనిపించినా, లేవలేకపోతారు. బద్ధకంగా ఉంటుంది, అది మనల్ని నిద్రలేచినా మంచం దిగనివ్వదు. దుప్పట్లోనే దూరిపోయి హాయిగా పడుకునేలా చేస్తుంది. నిజానికి ఇది సోమరితనం కాకపోవచ్చు, డైసానియా అనే తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితికి సంకేతం కూడా కావొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Personality Test: ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మీకు మొదట ఏ జంతువు కనిపించిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో మేము చెప్పేస్తాం

White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

అసలు ఈ డైసానియా అంటే ఏమిటి అంటే? వైద్యపరంగా, డైసానియా అనేది మీరు మంచం మీద నుండి లేవలేని స్థితికి వచ్చేలా చేసే ఒక దీర్ఘకాలిక భావనగా అని వివరణ ఉంది. మీరు లేవాలని ఎంత ప్రయత్నించినా నిద్ర మబ్బు ఉండటం, జడత్వం, అలసటగ ఉన్నట్లు అనిపించి ఇంకొద్ది సేపు పడుకోవాలని అనిపిస్తుంది.

సరళంగా చెప్పాలంటే, డైసానియా అనేది ఉదయం మంచం నుండి లేవలేని అసమర్థత. ఈ పరిస్థితిని వైద్యపరంగా రోగనిర్ధారణ చేయలేం, కానీ మీరు ఉదయం లేచే సమయంలో అలసిపోయినట్లు, సోమరితనంగా అనిపిస్తుంటే మాత్రం అంతర్లీనంగా వేరే సమస్య ఉందనడానికి సంకేతం అంటున్నారు. (Also Read: సమంతకు సోకిన మైయోసైటిస్‌ వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్స)

ఉదయం వేళ అలసట, సోమరితనాన్ని కలిగించే వాటిలో కొన్ని అనారోగ్య సమస్యలు కారణం అవుతున్నాయి. అవేంటో ఈ కింద చూడండి.

గుండె జబ్బులు

JAMA ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం, అనేక గుండె జబ్బులు అలసటకు దారితీస్తాయి, మీరు ఉదయాన్నే లేవడం కష్టతరం చేస్తాయి. ధూమపానం అలవాటు, అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉంటే అది గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్

కనీసం ఆరు నెలల పాటుగా విపరీతమైన అలసట కలిగి ఉన్నట్లయితే అది క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (CFS) సంక్లిష్ట లక్షణం. ఎవరికైనా అలసట ఉంటే కాస్త విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది, కానీ ఈ పరిస్థితి విశ్రాంతి తీసుకుంటే అలసట ఇంకా ఎక్కువ అవుతుంది. శారీరక లేదా మానసిక అలసిపోయేలా చేస్తుంది.

నిద్ర సమస్యలు

నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం, దాదాపు 80 రకాల నిద్ర సమస్యలు ఉన్నాయి. ఈ రుగ్మతలు డైసానియాను ప్రేరేపిస్తాయి. దీంతో మీరు ఉదయాన్నే నిద్రలేవలేరు, నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా శక్తివంతంగా అనిపించదు.

డిప్రెషన్

డిసానియా అలాగే డిప్రెషన్ ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఎందుకంటే డిప్రెషన్ ఉన్నప్పుడు నిద్ర సరిగా పోలేరు. ఇలా నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. డిప్రెషన్ కొన్నిసార్లు మరొక వ్యాధి వలన కలిగే అలసట వలన సంభవించవచ్చు.

థైరాయిడ్ సమస్యలు

హైపోథైరాయిడిజం లేదా హషిమోటోస్ వ్యాధి వంటి థైరాయిడ్ రుగ్మతను కలిగి ఉంటే, దీర్ఘకాలిక అలసటను కలిగి ఉండవచ్చు. థైరాయిడ్ పరిస్థితికి చికిత్స చేయకపోతే, అలసట అనుభూతి నెలలు లేదా సంవత్సరాల పాటు ఉండవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

పైన పేర్కొన్న అంశాలలో మీరు ఏవైనా లక్షణాలను అనుభవిస్తున్నట్లు మీకు అనిపిస్తే, సరైన రోగ నిర్ధారణ కోసం మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.

తదుపరి వ్యాసం