తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bone Strength: నలభై ఏళ్లకే మోకాళ్ల నొప్పులు రావొద్దంటే.. ఇప్పటినుంచే ఇవి పాటించండి..

Bone strength: నలభై ఏళ్లకే మోకాళ్ల నొప్పులు రావొద్దంటే.. ఇప్పటినుంచే ఇవి పాటించండి..

HT Telugu Desk HT Telugu

29 May 2023, 11:22 IST

  • Bone strength: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారొద్దంటే తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి. 

ఎముకల ఆరోగ్యం
ఎముకల ఆరోగ్యం (Photo by Alexandra Tran on Unsplash)

ఎముకల ఆరోగ్యం

వయసు పెరిగే కొద్దీ ఎముకల ఆరోగ్యం కాస్త బలహీనంగా అవ్వొచ్చు. ఇది సాధారణం. చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ అవ్వడం, ఆస్టియోపోరోసిస్, ఇంకేమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అనారోగ్యకరమైన జీవనశైలి విధానాల వల్ల ఈ సమస్యలన్నీ ఇంకాస్త తొందరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

1. క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారం:

ఎముకలను దృఢంగా ఉంచడంలో సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎముక ఆరోగ్యానికి కాల్షియం కీలకమైన పోషకం, కాబట్టి మీ రోజువారీ భోజనంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, బ్రొకోలీ, గింజల్లో ఇది పుష్కలంటా ఉంటుంది. 50 ఏళ్లు పైబడిన వారు రోజువారీ 1,000 నుండి 1,200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి. లేదా క్యాల్షియం సప్లిమెంట్ల గురించి వైద్యుల్ని సంప్రదించండి.

2. విటమిన్ డి:

విటమిన్ డి మన శరీరం క్యాల్షియం శోషించుకోడానికి అవసరం. కానీ చాలా మందిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తోంది. రోజూ ఎండలో కాసేపుండండి. ఇది సహజసిద్దంగా విటమిన్ డి పెంచుకునే మార్గం. ఇక ఆహారం రూపంలో సాల్మన్, ట్యూనా చేపల్లో, గుడ్డు సొనలో , పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉంటుంది. వైద్యుల్ని సంప్రదించకుండా ఈ సప్లిమెంట్లు వాడకూడదు.

3. బరువు తగ్గించే వ్యాయామాలు:

నిరంతర శారీరక వ్యాయామాలు, బరువు తగ్గించే వ్యాయామం చాలా ముఖ్యం. వాకింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, బరువులెత్తడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజుకు కనీసం గంటన్నర ఏరోబిక్ వ్యాయామం లేదా, గంట వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలి.

4. స్మోకింగ్, ఆల్కహాల్:

వీటి ప్రభావం చాలా ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఎముక సాంద్రత దెబ్బతింటుంది. ఆల్కహాల్ వల్ల శరీరం క్యాల్షియం శోషించుకునే శక్తి కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకున్నా అదుపులోనే తీసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి.

5. జాగ్రత్తలు:

కింద పడిపోవడమే ఎముకలు విరగడానికి ముఖ్యం కారణమని డాక్టర్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అందుకే మెల్లగా,జాగ్రత్తగా నడవటం, మెట్లు ఎక్కేటపుడు హ్యాండ్ రెయిల్ పట్టుకోవడం, సరైన చెప్పులు వేసుకోవడం, కంటి చూపు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

6. క్రమం తప్పకుండా చికిత్సలు:

ఎముక సాంద్రత తగ్గినా, ఏవైనా వ్యాధులున్నా క్రమం తప్పకుండా ఎక్స్ రే, టెస్టులు చేసుకుంటే సమస్య తక్కువగా ఉన్నప్పుడే బయటపడతాయి. దీని గురించి వైద్యుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

సరైన వ్యాయామం, జీవనశైలి వల్ల ఎముకల ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం