తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep In Periods: పీరియడ్స్ సమయంలో నిద్ర పట్టట్లేదా.. ఇవి పాటించండి..

sleep in periods: పీరియడ్స్ సమయంలో నిద్ర పట్టట్లేదా.. ఇవి పాటించండి..

HT Telugu Desk HT Telugu

29 May 2023, 17:01 IST

  • Sleep in periods: పీరియడ్స్ సమయంలో నిద్ర అంత సులువుగా పట్టదు. కొన్ని కారణాల వల్ల, అసౌకర్యం వల్ల తరచూ మెలకువ వస్తుంటుంది. దానికి మార్గాలేంటో తెలుసుకోండి. 

నెలసరి సమయంలో నిద్ర
నెలసరి సమయంలో నిద్ర (Unsplash)

నెలసరి సమయంలో నిద్ర

నెలసరి సమయంలో తగినంత నిద్రపోవడం చాలా అవసరం. కానీ ఆ సమయంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల, అసౌకర్యం వల్ల నిద్ర పట్టదు. ఈ సమయంలో నాణ్యమైన నిద్ర రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. నిద్రకు షెడ్యూల్:

రోజూ ఒక సమయానికి పడుకుని లేస్తే ఆ సమయానికి పీరియడ్స్ లో ఉన్నపుడు కూడా సులువుగా నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది. దానివల్ల సుఖమైన నిద్ర నెలసరి సమయంలో కూడా దొరుకుతుంది.

2. వాతావరణం:

వెలుతురు వస్తుంటే నిద్ర పట్టదు. అందుకే బెడ్ రూమ్ చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి. బెడ్‌రూమ్‌కు ముదురు రంగు కర్టెయిన్లు, అవసరమైతే ఇయర్ ప్లగ్స్ వాడటం మంచిది. అలాగే బెడ్, దిండ్లు కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

3. హీట్ థెరపీ:

పొత్తికడుపులో నొప్పి వల్ల ఒక్కోసారి నిద్ర పట్టదు. అలాంటపుడు హీటింగ్ ప్యాడ్ వాడొచ్చు. దాన్ని కాసేపు కడుపు మీద ఉంచితే ఉపశమనం ఉంటుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల నిద్ర తొందరగా పడుతుంది.

4. కొన్ని టెక్నిక్లు:

పడుకునే ముందు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, కండరాల మర్దనా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉంటుంది.

5. హైడ్రేషన్:

నిద్రవేళకు ముందు, రోజు మొత్తం హైడ్రేటెడ్ గా ఉండండి. ఇది పీరియడ్స్ సమయంలో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నిద్ర నాణ్యత పెంచుతుంది.

6. స్లీప్ వియర్:

పడుకునేటపుడు వదులుగా, గాలి తగిలే కాటన్ వస్త్రాలు వేసుకోవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. రాత్రి మొత్తం మెలకువ రాదు.

7. నొప్పి:

నొప్పి ఎక్కువగా ఉంటే వైద్యుల్ని సంప్రదించి అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన మందుల గురించి ముందుగానే తెలుసుకోండి. అవి అవసరమైనపుడు పనికొస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఈ మాత్రలు వేసుకుంటే మేలు.

8. మెన్‌స్ట్రువల్ ఉత్పత్తులు:

ప్యాడ్స్, ట్యాంపన్లు, మెన్‌స్ట్రువల్ కప్స్, పీరియడ్ ప్యాంటీ ఇలా ఏవి వాడినా మీకు సౌకర్యం ఇవ్వాలి. రాత్రిపూట లీకేజీ ఉంటుందనేమో భయం ఉండకూడదు. అలా ఉంటేనే మీకు సరిగ్గా సరిపోతున్నాయని అర్థం. లేదంటే తరచూ లేవాల్సి వస్తే వెంటనే సరైన ఎంపిక చేసుకోండి. రాత్రిపూట కోసం ఓవర్ నైట్ ప్యాడ్స్, ట్యాంపన్లు వాడితే మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం