తెలుగు న్యూస్ / ఫోటో /
pain relief in periods: ఇలా పడుకుంటే.. నెలసరి సమయంలో నొప్పి తగ్గుతుంది
pain relief in periods: నెలసరి సమయంలో కొంత మందికి విపరీతమైన నొప్పి ఉంటుంది. నిద్ర కూడా పట్టనంత అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రకాలుగా నిద్రపోతే నొప్పి కాస్త తక్కువగా ఉంటుంది.
(1 / 6)
పీరియడ్స్ సమయంలో కొంతమందికి కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. దాని వల్ల నిద్ర కూడా పట్టదు. నిద్ర పోయేటపుడు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే సుఖమైన నిద్ర సొంతమవుతుంది. ఎలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా హాయిగా పడుకోవచ్చు. (File image)
(2 / 6)
కాళ్లు ముడుచుకుని పడుకోవడం: ఒకవైపు పక్కకు తిరిగి పడుకుని ఛాతీవైపు మోకాళ్లను ముడుచుకుని పడుకోవడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. (Freepik )
(3 / 6)
బోర్లా పడుకోవడం: ఇలా పడుకోవడం అంత మంచిది కాదు. కానీ నొప్పి ఎక్కువగా అనిపిస్తే బోర్లా పడుకుని పొట్టకు కాస్త కింద.. దిండు పెట్టుకోండి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. .(Pinterest)
(4 / 6)
మామూలుగా పడుకుని, మోకాళ్ల దగ్గర దిండు పెట్టుకోవచ్చు. దీనివల్ల కూడా పొట్టమీద ఒత్తిడి పడదు. నొప్పి తగ్గుతుంది. (Unsplash)
(5 / 6)
ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల కూడా నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కాస్త తగ్గుతాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు