తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss | ఇంటి చిట్కాలతో.. ఈజీగా బరువు తగ్గిపోండి..

Weight Loss | ఇంటి చిట్కాలతో.. ఈజీగా బరువు తగ్గిపోండి..

HT Telugu Desk HT Telugu

30 April 2022, 8:20 IST

    • బరువు తగ్గడానికి మనం పడే పాట్లు అన్ని ఇన్ని కాదు. ఒకటా రెండా ఏమేమో ప్రయత్నిస్తాం. వ్యాయామం, ఫుడ్, డైట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే బరువు తగ్గడానికి వంటింట్లో లభించే కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయండోయ్.. వీటి ద్వారా మీరు సహజంగానే బరువు తగ్గుతారు. ఈ చిట్కాలను మీరు తెలుసుకుని ఫాలో అయిపోండి.
బరువు తగ్గేందుకు చిట్కాలు
బరువు తగ్గేందుకు చిట్కాలు

బరువు తగ్గేందుకు చిట్కాలు

Weight Loss Tips | బాగా తిని బరువు పెరిగడం లేదా ఒత్తిడి, ఇతర కారణాల వల్ల బరువు పెరిగి.. తర్వాత జిమ్​లో బరువు తగ్గాలని ప్రయత్నించడం, వ్యాయామం చేయడం సర్వసాధారణమైపోయింది. మొండి కొవ్వును తగ్గించుకోవడానికి కొన్నిసార్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఒకేసారి బరువు తగ్గడం వల్ల అలసట రావొచ్చు. అయితే మీ ఇంటి వంటగది వస్తువులతో.. నెమ్మదిగా బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

వేడి నీరు: ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొవ్వు కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. అంతేకాకుండా కొవ్వు వేగంగా కరగడానికి సహాయపడుతుంది. ఇది మెటబాలిజంను కూడా మెరుగుపరుస్తుంది.

దాల్చినచెక్క: సహజమైన మసాలా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి.. కొవ్వును కాల్చేస్తుంది. 1 చిటికెడు దాల్చిన చెక్క పొడిని 1 టీస్పూన్ తేనెతో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది.

గ్రీన్ టీ: కొవ్వు తగ్గడానికి రోజూ మీకు ఒక కప్పు గ్రీన్ టీ అవసరం. గ్రీన్ టీ కొవ్వును తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది.

నిమ్మకాయ: బరువు తగ్గడానికి ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన సహజ నివారణి. ఇది నిజానికి బాగా పనిచేస్తుంది కూడా. కానీ కీళ్ల నొప్పులు, హైపర్‌యాసిడిటీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఇతరులకు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది.

మిరియాలు: ఉదయాన్నే నిమ్మరసంలో నల్ల మిరియాలను కలపి తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇలా రోజూ ఉదయాన్నే తాగితే వెంటనే బరువు తగ్గుతారు.

ఉసిరికాయ: ఊబకాయం, థైరాయిడ్ నుంచి మధుమేహం, మలబద్ధకం వరకు అన్ని రుగ్మతలకు ఇది ఆదర్శవంతమైనది. దీని పుల్లని రుచి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ఆస్ట్రింజెంట్ టేస్ట్ తక్షణమే బరువు తగ్గడానికి సహాయపడుతుంది

త్రిఫల: టాక్సిన్స్‌ను బయటకు పంపి, మీ సిస్టమ్‌ను శుభ్రపరచడానికి రాత్రిపూట గోరువెచ్చని నీటితో 1 స్పూన్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయి. అలాగే శరీర వ్యవస్థలను శుభ్రపరుస్తుంది. సహజంగా బరువు తగ్గేలా చేస్తుంది.

తేనె: ఇది అనవసరమైన కొవ్వును తొలగించడంలో మంచిగా పనిచేస్తుంది. కానీ దీనిని వేడి నీటిలో ఎప్పుడూ తీసుకోకూడదు. గోరు వెచ్చని నీరే మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం