తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Early Signs Of Brain Diseases: నిద్రలో ఇలా చేస్తున్నారా? మెదడు వ్యాధులకు సంకేతమే కావొచ్చంటున్న వైద్యులు

Early signs of brain diseases: నిద్రలో ఇలా చేస్తున్నారా? మెదడు వ్యాధులకు సంకేతమే కావొచ్చంటున్న వైద్యులు

Parmita Uniyal HT Telugu

09 February 2023, 19:15 IST

    • Early signs of brain diseases: నిద్రలో వచ్చే కలలకు అనుగుణంగా మీ శరీర కదలికలు ఉంటున్నాయా? అయితే మెదడు సంబంధిత వ్యాధులకు ఇవి లక్షణాలు అయి ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలో కొన్ని లక్షణాలను విస్మరించరాదంటున్న వైద్యులు
నిద్రలో కొన్ని లక్షణాలను విస్మరించరాదంటున్న వైద్యులు (Pexels)

నిద్రలో కొన్ని లక్షణాలను విస్మరించరాదంటున్న వైద్యులు

మీరు నిద్రపోతున్నప్పుడు తరచుగా పోరాట సన్నివేశాలు, వెంబడిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయా? మీరు మీ దిండును కానీ, దగ్గరలో ఉన్న వస్తువును గానీ విసిరికొడుతున్నారా? లేక అలాంటి కలలు వచ్చినప్పుడు ఉద్రిక్తతకు లోనై పడక పైనుంచి కిందపడుతున్నారా? ఇలాంటివాటి వల్ల పెద్దగా భయమేమీ అనిపించదు. మీరు అధికంగా ఒత్తిడి ఎదురవుతున్నందున ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. కానీ శాస్త్రీయ డేటా నమ్మాల్సి వస్తే ఈ సంకేతం మీ మెదడు సంబంధిత వ్యాధిని సూచించే సంకేతం అవుతుంది.

కలలకు అనుగుణంగా స్పందించడం ఆర్ఈఎం నిద్రా ప్రవర్తన రుగ్మత లక్షణాలలో ఒకటి. ఇది వృద్ధులలో, ముఖ్యంగా పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. సైంటిఫిక్ అమెరికన్‌లో ఇటీవలి ప్రచురితమైన కథనం ప్రకారం ఈ లక్షణం ఆర్‌బీడీ న్యూరోడెజెనరేటివ్ వ్యాధిని సూచిస్తుంది. ప్రధానంగా సిన్యూక్లినోపతీస్-ఆల్ఫా-సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ మెదడులో విషపు కణితులను ఏర్పరుస్తుంది.

కలలకు అనుగుణంగా ఎందుకు ప్రవర్తిస్తారు?

‘నిద్ర పోతున్నప్పుడు కలల్లో వచ్చే వాటికి అనుగుణంగా నిద్రలోనే అలా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇతరులను పిలవడం, శత్రువులు లేదా పాములతో పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనిని ఆర్‌ఈఎం (ర్యాపిడ్ ఐ మూమెంట్) స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. మనం సాధారణంగా కలగంటుంటాం. ఆర్ఈఎం స్లీప్ ఫేజ్‌లో మన శరీరం, కండరాలను మెదడు స్తంభింపజేస్తుంది. అందువల్ల మనం కలలను అమలుపరచం. దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఏర్పడటానికి ఆర్ఈఎం నిద్ర చాలా ముఖ్యమైనది. అయితే కొందరిలో మెదడు కండరాలను స్తంభింపజేయకపోవడంతో వారి కలలకు అనుగుణంగా కదులుతుంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం. కలలు వచ్చినప్పుడు వారు అరుస్తుంటారు. వారి భాగస్వాములను తడుతుంటారు. ఒక్కోసారి కలలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ వారిని వారు గాయపరుచుకుంటారు..’ అని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా హెచ్‌టీ డిజిటల్‌కు వివరించారు.

మెదడు సంబంధిత వ్యాధులకు ఈ ప్రవర్తనకు లింకేంటి?

ఆర్ఈఎం స్లీప్ డిజార్డర్‌లో తరచుగా ఇలా జరిగినప్పుడు అవి న్యూరోడీజనరేటివ్ సంబంధిత వ్యాధులైన పార్కిన్సన్ డిజార్డర్ వంటి వాటిని సూచిస్తాయని డాక్టర్ వివరించారు. కొన్ని కేసుల్లో పదిపదిహేనేళ్ల ముందుగానే ఈ సంకేతాలను విశ్లేషించవచ్చని వివరించారు. కలల ద్వారా మెదడు సంబంధిత వ్యాధి లక్షణాలను ఇలా వివరించారు.

Signs of brain diseases in your dreams: మెదడు సంబంధిత వ్యాధులకు సంకేతాలు ఇవే

1. Parkinson's disease: పార్కిన్సన్ వ్యాధి

పార్కిన్సన్ వ్యాధి అంటే పేషెంట్ తమ కదలికలపై నియంత్రణ కోల్పోతాడు. శరీరం కంపనలకు గురవుతుంది. ఇది క్రమంగా నాడీ వ్యవస్థను, నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండే శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది.

2. Diffuse lewy body disease: డిఫ్యూజ్ లూయీ బాడీ డిసీజ్

డిమెన్షియాకు రెండో అతి సాధారణ కారణం ఈ డిఫ్యూజ్ లూయీ బాడీ డిసీజ్. ఇది న్యూరోడీజనరేటివ్ రుగ్మత. మానసిక స్థితి, భ్రాంతిలో హెచ్చుతగ్గులు కలిగి ఉంటారు. ఈ పరిస్థితిలో పేషెంట్ జ్ఞాపకశక్తి కోల్పోతుంటాడు. అలాగే గ్రహణ శక్తి తగ్గుతుంది. అసాధారణ కదలికలు ఉంటాయి. నిద్రలో ఇబ్బందులు ఉంటాయి. కదలికల్లో లోపాలు ఉంటాయి. కుదురుగా నడవలేరు. ప్రకంపనలకు గురవుతారు. డిఫ్యూజ్ లూయీ బాడీ డిసీజ్‌లో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కోరోజు వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు.

3. Multiple system atrophy (MSA): బహుళ వ్యవస్థ క్షీణత

మూడో రుగ్మత పేరు బహుళ వ్యవస్థ క్షీణత (Multiple system atrophy). వయస్సు పెరిగిన కొద్దీ శారీరక కదలికలను మెదడు నియంత్రించలేకపోతుంది. అటానమిక్ సిస్టమ్ క్రమంగా పాడైపోయి శరీరంలోని అనేక విధులు.. గుండె రేటు, బ్లడ్ ప్రెజర్, శ్వాస, జీర్ణక్రియ, మూత్రాశయ విధులు అన్నీ స్తంభించిపోతాయి.

అందువల్ల ఒక వ్యక్తి ఆర్ఈఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్‌ ఎదుర్కొంటున్నట్టయితే అది నాడీ సంబంధిత వ్యాధిని సూచిస్తుంది.

తదుపరి వ్యాసం