తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drink For Women: మహిళలు నిద్రపోయే ముందు కచ్చితంగా ఈ పొడిని పాలలో వేసుకొని తాగాల్సిందే

Drink for Women: మహిళలు నిద్రపోయే ముందు కచ్చితంగా ఈ పొడిని పాలలో వేసుకొని తాగాల్సిందే

Haritha Chappa HT Telugu

17 February 2024, 9:00 IST

    • Drink for Women: నిద్రపోయే ముందు స్త్రీలు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా నిద్ర పట్టేందుకు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు పాలల్లో వారు ఈ జాజికాయ పొడిని వేసుకుంటే మంచిది.
జాజికాయ పొడి
జాజికాయ పొడి (pixabay)

జాజికాయ పొడి

Drink for Women: మహిళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు నిద్రపోయే ముందు పాలల్లో జాజికాయ పొడిని చిటికెడు వేసుకుని తాగితే ఎంతో మంచిది. ఇలా తాగడం వల్ల వారిలో ఉన్న ఎన్నో సమస్యలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. జాజికాయ అనేది ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. దీన్ని మసాలాగా మాత్రమే చూడకండి. మహిళలకు ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుత ఔషధంగా దీన్ని చూడాలి. రాత్రిపూట ఈ జాజికాయ పొడిని పాలల్లో వేసుకొని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జాజికాయలో మిరిస్టిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మహిళల్లో ఉన్న నిద్రా సమస్యలను దూరం చేస్తుంది.

జాజికాయ పొడితో...

ప్రాచీన కాలం నుంచి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం జాజికాయ పొడి ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యను రాకుండా చూస్తుంది. మెదడుకు పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. దీన్ని పాలల్లో కలపడం వల్ల... ఆ పాలల్లో ఉన్న ట్రిప్టోఫాన్ కూడా నిద్రను పెంచుతుంది.

ఇలా పాలలో జాజికాయ పొడిని వేసుకుని తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. అజీర్తి, జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలు తొలగిపోతాయి. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. ఇది శరీరంలో ఎన్నో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం జాజికాయలో ఉండే సమ్మేళనాలు మూడు స్వింగ్స్ రాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మంచిగా నిద్ర పడుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది.

ఆరోగ్యాన్ని కాపాడడానికి జాజికాయలోని సమ్మేళనాలు అవసరం. జాజికాయలో మెగ్నీషియం ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జాజికాయలు రోజూ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

జాజికాయ పొడి వేయడం వల్ల రుచి బాగుంటుంది. మహిళలతో పాటు పిల్లలు కూడా ఇలా జాజికాయ పొడి కలిపిన పాలను తాగడం వల్ల మేలే జరుగుతుంది. అయితే మహిళలు మాత్రం కచ్చితంగా పాలల్లో ప్రతిరోజూ జాజికాయ పొడిని వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. కేవలం రెండు వారాల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

జాజికాయలను దంచి పొడిలా చేసుకుని ఒక సీసాలో వేసుకుని దాచుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. తమలపాకుల్లో చిటికెడు జాజికాయ పొడి వేసి నమిలితే నోటి దుర్వాసన సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాదు దంతాలు తెల్లగా మారుతాయి. పాలల్లో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే గుండెల్లో మంట, నొప్పి, దడ వంటివి రాకుండా ఉంటాయి.

జాజికాయ పొడిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గ్యాస్ రావడం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.దీనిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ లక్షణాలు అధికం. జాజికాయ తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికం. కాలేయ వ్యాధుల నుంచి ఇది కాపాడుతుంది.

కాలేయం, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలను ఇవి తొలగిస్తాయి. జాజికాయ, జాపత్రి రెండింటినీ ఒకే చెట్టు నుంచి సేకరిస్తారు. ఈ జాజికాయ చుట్టూ జాపత్రి అల్లుకుని ఉంటుంది. రెండింటినీ వేరు చేసి అమ్ముతారు. ఈ రెండూ కూడా ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాలే.

టాపిక్

తదుపరి వ్యాసం