తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Don't Buy These Things On Dhanteras : ధన్​తేరాస్​కి ఈ వస్తువులు అస్సలు కొనకండి.. ఎందుకంటే.

Don't Buy these things on Dhanteras : ధన్​తేరాస్​కి ఈ వస్తువులు అస్సలు కొనకండి.. ఎందుకంటే.

22 October 2022, 13:19 IST

    • Don't Buy these things on Dhanteras :ధన్​తేరాస్​ను సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో బంగారం కొనాలని చాలామంది చూస్తారు. కానీ కొనకూడని వస్తువులు కూడా చాలానే ఉన్నాయి. అయితే అవేంటో తెలుసుకుని.. వాటిని కొనకుండా చూసుకోండి. 
ధన్​తేరాస్​కి అస్సలు కొనకూడని వస్తువులు ఇవే
ధన్​తేరాస్​కి అస్సలు కొనకూడని వస్తువులు ఇవే

ధన్​తేరాస్​కి అస్సలు కొనకూడని వస్తువులు ఇవే

Don't Buy these things on Dhanteras : పండుగరోజు ఎవరైనా అదృష్టాన్ని తెచ్చుకోవాలి అనుకుంటారు. అయితే కొన్ని వస్తువులు అదృష్టాన్ని తెస్తాయని నమ్మి వాటిని కొంటారు. ధన్​తేరాస్ సమయంలో అందుకే బంగారం కొంటారు. అయితే కొన్ని వస్తువులు కొనకూడదని.. ఎందుకంటే అవి చెడు శకునాలను తెస్తాయని నమ్ముతారు. మరి ధన్​తేరాస్​ రోజు కొనకుండా ఉండాల్సిన వస్తువులేమిటో ఇప్పుడు చుద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

ఇనుముతో చేసిన వస్తువులు

ధన్​తేరాస్ పండుగ రోజు మీరు ఇనుముతో చేసిన వస్తువులను కొనకూడదంటున్నారు. జ్యోతిష్యులు, భారతీయ పురాణాల ప్రకారం.. సంపదకు దేవుడు అయిన కుబేరుడు.. ఐరన్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వారిపై తన ఆశీర్వాదాలను కురిపించడని చెప్తున్నాయి. అదనంగా మీరు ఉక్కుతో చేసిన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఈ లోహం కూడా ఇనుముకి మరో రూపమే.

పదునైన వస్తువులు

మీరు కత్తులు, కత్తెరలు, కట్టర్లు, బ్లేడ్‌లు, గొడ్డళ్లు, కత్తులు, కత్తిపీటలు లేదా రేజర్‌లు వంటి కొన్ని పదునైన వస్తువులను కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు వాటిని వేరే రోజుకి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అటువంటి వస్తువులు రాహువు లేదా అరిష్ట సంకేతాలతో సంబంధం కలిగి ఉన్నాయని, ధన్​తేరాస్ సమయంలో వీటిని నివారించడమే మంచిదని నమ్ముతారు. అవసరమైతే మీరు వాటిని ముందుగానే కొనుగోలు చేయవచ్చు కానీ పండుగ రోజున కొనొద్దు అంటున్నారు.

బ్లాక్​కు దూరంగా ఉండండి..

నలుపు అనేది చాలా మందికి నచ్చే రంగు. కానీ నలుపు రంగు ఉన్న ప్రతిదానికీ మనం ధన్‌తేరాస్‌లో దూరంగా ఉండాలి. జ్యోతిష్యులు ఈ రంగు చీకటిని సూచిస్తున్నందున దురదృష్టంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. మీరు నలుపు రంగులో దేనినీ కొనుగోలు చేయకపోయినా.. దుస్తులు, ఉపకరణాలు, పాదరక్షలు, అలంకరణ వస్తువులు మొదలైన వాటి రూపాల్లో మీరు దానిని ఉపయోగించకుండా చూసుకోండి.

గాజుతో చేసిన ఉత్పత్తులు

గ్లాస్‌కు చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ధన్‌తేరాస్‌లో గాజుసామాను కొనుగోలు చేయడం వల్ల అది మరింత అశుభకరంగా భావిస్తారు. గాజును రాహువుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. పండుగ సమయంలో దానిని కొనుగోలు చేయకుండా ఉంటేనే మంచిదంటున్నారు. ఈరోజు మీరు గాజు పాత్రలకు దూరంగా ఉంటే కూడా మంచిదే.

టాపిక్

తదుపరి వ్యాసం