తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dizo Watch S | నెలసరి క్రమాన్ని కూడా ఈ స్మార్ట్ వాచ్ ట్రాక్ చేస్తుంది!

Dizo Watch S | నెలసరి క్రమాన్ని కూడా ఈ స్మార్ట్ వాచ్ ట్రాక్ చేస్తుంది!

HT Telugu Desk HT Telugu

19 April 2022, 18:00 IST

    • సరికొత్తగా Dizo Watch S స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో విడుదలయింది. ఇందులో స్పందన రేటు, ఆక్సిజన్ లెవెల్స్, నిద్ర మానిటర్‌తో ఆడవారికి సంబంధించి రుతుచక్ర సరళిని కూడా ట్రాక్ చేసి నివేదికలు రికార్డ్ చేసే ఫీచర్లు ఉన్నాయి.
Dizo Watch S
Dizo Watch S

Dizo Watch S

మార్కెట్లోకి మరొక కొత్త స్మార్ట్‌వాచ్ వచ్చింది. Dizo Watch R తర్వాత ఇప్పుడు తాజాగా Dizo Watch S భారత మార్కెట్లో ప్రవేశించింది. Dizo Watch R రౌండ్ డయల్‌ను కలిగి ఉండగా, తాజాగా రిలీజైన Dizo Watch S చతురస్రాకార (స్క్వేర్) వాచ్ ఫేస్‌ను కలిగి ఉంది. మెటాలిక్ బాడీ ఫ్రేమ్‌ను కలిగి వంపులతో లుక్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ వాచ్. అంతేకాదు మీ శైలికి సరిపోయేలా 150కి మించిన కస్టమైజ్డ్ వాచ్ ఫేస్‌లకు కూడా అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Dizo Watch S అండ్రాయిడ్, iOS రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ లో ఇంకా ఎలాంటి స్మార్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. దీని ధర ఎంత మొదలగు వివరాలను పూర్తిగా ఇక్కడ అందిస్తున్నాం చెక్ చేసుకోండి..

 Dizo Watch S ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డిజో వాచ్-S స్మార్ట్‌వాచ్ టచ్ ఇన్‌పుట్‌ల సపోర్ట్ కలిగిన 1.57-అంగుళాల (200x320 పిక్సెల్‌లు) చతురస్రాకార డిస్ ప్లేను కలిగి ఉంది. దీనికి కర్డ్వ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ ఉంది. దీని స్క్రీన్ 550 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.

ఫిట్‌నెస్ కు సంబంధించి ఇందులో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఎలిప్టికల్, యోగా, క్రికెట్, ట్రెక్కింఫ్, ఫుట్‌బాల్ సహా మొత్తం 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది.

అంతేకాదు ఇందులో ఎక్కిదిగిన మెట్లు, నడిచిన దూరం ఖర్చు అయిన కేలరీలకు సంబంధించిన వారం నుంచి వార్షిక నివేదికలను రికార్డ్ చేస్తుంది. మరో ఫీచర్ ఏమిటంటే అమ్మాయిల కోసం వారి నెలసరి చక్రాలను కూడా ట్రాక్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.

అలాగే మిగతా అన్ని వాచ్ లలో ఉండేటట్లుగా హృదయ స్పందన రేటు, నిద్ర మానిటర్‌, ఆక్సిజన్ స్థాయిలు (SpO2) స్థాయి సూచికలు ఉన్నాయి.

క్లాసిక్ బ్లాక్, సిల్వర్ బ్లూ, గోల్డెన్ పింక్ వంటి కలర్ ఛాయిస్ లలో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా లభ్యమవుతుంది.

Dizo వాచ్ S ధర రూ. 2,299గా కంపెనీ నిర్ణయించింది, అయితే ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూ. 1,999కి అందిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం