తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Pickle: చికెన్ పికిల్ ఇలా చేశారంటే, ఆరునెలలు తాజాగా ఉంటుంది

Chicken Pickle: చికెన్ పికిల్ ఇలా చేశారంటే, ఆరునెలలు తాజాగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

04 April 2024, 15:30 IST

    • Chicken Pickle: వేడివేడి అన్నంలో కాస్త చికెన్ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి వేరు. చికెన్ పికిల్ చాలా సులువుగా చేయొచ్చు. ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలలు తాజాగా ఉంటుంది.
చికెన్ పికెల్ రెసిపీ
చికెన్ పికెల్ రెసిపీ (Youtube)

చికెన్ పికెల్ రెసిపీ

Chicken Pickle: స్పైసీ చట్నీలు ఇష్టపడే వారికి చికెన్ పికిల్ కచ్చితంగా నచ్చుతుంది. చికెన్ కర్రీతో పోలిస్తే చికెన్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. నచ్చినప్పుడు చికెన్ పికిల్ వేసుకొని తినవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. చికెన్ పికిల్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

చికెన్ పికిల్ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ - కిలో

నీరు - తగినంత

ఆవాలు - రెండు స్పూన్లు

ఆవాల పొడి - రెండు స్పూన్లు

పసుపు - రెండు స్పూన్లు

నిమ్మరసం - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

కారం - ఒక కప్పు

మెంతి పొడి - ఒక స్పూను

వెనిగర్ - రెండు స్పూన్లు

చికెన్ పికిల్ రెసిపీ

1. చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు చికెన్ ముక్కలు, వెనిగర్ వేసి ఉడికించాలి.

3. ఒక పావు గంట సేపు ఉడికాక చికెన్ ముక్కలను వడకట్టి ఒక ప్లేట్లో వేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

5. ఆ నూనెలో చికెన్ ముక్కలను వేసి ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి.

6. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవాల పొడి, మెంతిపొడి, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి.

7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలను చిటపటలాడించాలి.

8. ఆ నూనెలో చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి.

9. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న మెంతి పొడి, ఆవాల పొడి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా పచ్చడి లాగా వస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి.

11. ఈ మిశ్రమం బాగా చల్లారాక నిమ్మరసం వేసి కలపాలి. అంతే టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయినట్టే.

12. దీన్ని వేడి వేడి అన్నంలో చేసుకొని చూడండి. రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా స్పైసి ఫుడ్ ని ఇష్టపడే వారికి చికెన్ పికిల్ నచ్చడం ఖాయం.

చికెన్ పికిల్‌ను ఒక్కసారి చేసుకున్నారంటే 6 నెలల పాటు తినవచ్చు. దీన్ని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు, కాబట్టి నెల రోజులకు ఒకసారి చేసుకుంటే ఇంకా తాజాగా ఉంటుంది. ఇదే పద్ధతిలో రొయ్యల పికిల్, మటన్ పికిల్ కూడా చేసుకోవచ్చు. కారంగా తినేవారు ఎక్కువ కారంపొడిని వేసుకుంటే సరిపోతుంది. కారం తక్కువగా తినేవారు కాస్త కారాన్ని తగ్గించుకోవాలి. నిమ్మరసం వేసేటప్పుడు చికెన్ ముక్కలు బాగా చల్లారాకే వేయాలని గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే దానిలోని సుగుణాలు తగ్గిపోతాయి. చికెన్ పచ్చడి చేయడానికి ఒక గంట సమయం పడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం