తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Kebab: ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసేయండి.. ఎవరికైనా నచ్చేస్తుంది

Chicken kebab: ఇంట్లోనే చికెన్ కబాబ్స్ ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసేయండి.. ఎవరికైనా నచ్చేస్తుంది

Haritha Chappa HT Telugu

22 March 2024, 11:27 IST

    • chicken kebab: చికెన్ కబాబ్స్ పేరు వింటేనే ఎక్కువ మందికి నోరూరిపోతుంది. దీన్ని కొనుక్కొని తినేవాళ్లే ఎక్కువ. వీటిని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. చికెన్ కబాబ్స్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చికెన్ కబాబ్ రెసిపీ
చికెన్ కబాబ్ రెసిపీ (youtube)

చికెన్ కబాబ్ రెసిపీ

chicken kebab: చికెన్‌తో కర్రీలు, వేపుళ్ళు, బిర్యానీలు మాత్రమే కాదు చికెన్ కబాబ్ వంటివి కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. కానీ ఎక్కువమంది వీటిని బయటకొనేందుకు ఇష్టపడతారు. ఒకసారి మేము చెప్పినట్టుగా చికెన్ కబాబ్ ప్రయత్నించి చూడండి. దీన్ని సులువుగా చేసేయచ్చు.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

చికెన్ కబాబ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

శనగపప్పు - ఒక కప్పు

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూన్

లవంగాలు - ఏడు

నల్ల మిరియాలు - 7

దాల్చిన చెక్క- రెండు ముక్కలు

ధనియాలు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

బోన్‌లెస్ చికెన్ - అరకిలో

ఉప్పు - ఒక స్పూను

నీరు - తగినంత

అల్లం- చిన్న ముక్క

పచ్చిమిర్చి - రెండు

వెల్లుల్లి - నాలుగు రెబ్బలు

కొత్తిమీర తరుగు - అరకప్పు

పుదీనా తరుగు - అరకప్పు

గుడ్లు - రెండు

చికెన్ కబాబ్ రెసిపీ

1. శనగపప్పును నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

2. తర్వాత కుక్కర్లో నూనె వేసి వేడి చేయాలి.

3. నూనె వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, కొత్తిమీర, కారం, అజ్వైన్, నల్ల మిరియాలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

4. ఇప్పుడు అందులో నానబెట్టిన శనగపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

5. ఆ పప్పులోనే బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి మీరు వేయాలి.

6. కుక్కర్ మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికే వరకు ఐదు లేక ఆరు విజిల్స్ వదిలేయాలి.

7. తర్వాత స్టవ్ కట్టేయాలి. ఆవిరి పోయాక కుక్కర్లోని పదార్థాలు అన్నీ తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

8. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలో వేయాలి.

9. ఆ గిన్నెలో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి.

10. ఇప్పుడు రెండు కోడిగుడ్లను కొట్టి ఈ మిశ్రమంలో కలిపి బాగా కలపాలి.

11. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. చికెన్ ముద్దను చేత్తో తీసి కబాబ్‌లా ఒత్తుకొని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి.

12. చిన్న మంట మీద ఈ కబాబులను వేయిస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.

13. ఒకసారి వీటిని చేసుకుని తినండి. మీకు అందరికీ నచ్చడం ఖాయం. ఇక కబాబ్‌లను పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.

చికెన్ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే దీనిలో శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం, మసాలా దినుసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చికెన్ కబాబ్ లను ఒకసారి చేసుకుని తిని చూడండి. ఇది మంచి టేస్టీ రెసిపీ. పిల్లలకు, పెద్దలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.

తదుపరి వ్యాసం