తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu | ఒక వ్యక్తిని సామాజికంగా, ఆర్థికంగా దిగజార్చే అవలక్షణాలు ఇవే!

Chanakya Niti Telugu | ఒక వ్యక్తిని సామాజికంగా, ఆర్థికంగా దిగజార్చే అవలక్షణాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

19 July 2023, 7:07 IST

    • Chanakaya Niti Telugu: వ్యక్తికి కొన్ని అవలక్షణాలు ఉండకూడదు అని ఆచార్య చాణక్యుడు చెప్పారు, అలాంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తులు క్రమంగా తమ సంపదను కోల్ఫోతారు, సమాజంలో తమకు ఉన్న గుర్తింపును కోల్పోతారు
Chanakaya Niti tips
Chanakaya Niti tips (Unsplash)

Chanakaya Niti tips

Chanakaya Niti Telugu: ఆచార్య చాణక్యుడు తన విలువైన ఆలోచనలను చాణక్య నీతి ద్వారా భావితరాలకు అందించారు. అనేది ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం జీవితానికి సంబంధించిన అనేక విషయాలపై బోధించడంతో పాటు సరైన మార్గదర్శకత్వం కూడా ఇస్తుంది. ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు ప్రజలకు వ్యక్తిగతంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది. ఈ నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన సూత్రాలు, విధానాలు ఉన్నాయి, ఇవి వ్యక్తులలోని సద్గుణాలను, దుర్గుణాలను ఎత్తిచూపుతాయి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొని, విజయం వైపు పయనించేలా దిశానిర్దేశం చేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎవరైనా ఒక వ్యక్తిని సమాజంలో దిగజార్చేలా చేసే కొన్ని దుర్గుణాలను చర్చించారు. వ్యక్తికి కొన్ని అవలక్షణాలు ఉండకూడదు అని చెప్పారు, అలాంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తులు క్రమంగా తమ సంపదను కోల్ఫోతారు, పేదవారిగా మారతారు, సమాజంలో తమకు ఉన్న మంచి గుర్తింపును కోల్పోతారు. అందుకే అలాంటి అవలక్షణాలను మార్చుకోవాలి. చాణక్యుడి ప్రకారం అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

శుభ్రత పాటించచకపోవడం

ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఎవరైతే శుభ్రత పాటించకుండా మురికిగా ఉంటారో, ఎల్లప్పుడు మురికిలో జీవించడం, శుభ్రమైన బట్టలు ధరించని వారు, వారి చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పర్చుకుంటారు. ఇది ద్రారిద్య్రాన్ని ఆహ్వానించడానికి సూచిక. అలాంటి వ్యక్తులు అనారోగ్యాల పాలవడం, ఆసుపత్రులలో ఖర్చు చేయడం ద్వారా తమ సంపదను కోల్పోతారు. పేదవారిగా మారతారు.

కర్కషంగా మాట్లాడటం

ఎల్లప్పుడూ కర్కషంగా మాట్లాడే వ్యక్తులు, అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక్తులు తమ గౌరవాన్ని, అవకాశాలను కోల్పోతారు. అలాంటి వారి వద్ద లక్ష్మీదేవి ఉండటానికి సంతోషించదు. కటువుగా మాట్లాడటం వల్ల ఒక వ్యక్తి తనకు ఉన్న బంధాలను కూడా కోల్పోతాడు. అందుకే చేదుగా మాట్లాడే అలవాటును వెంటనే వదిలేసి ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలి, ఆలోచించి సంభాషించాలి.

సూర్యాస్తమయం వేళ నిద్రపోవడం

చాణక్యుడు ప్రకారం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అనగా సంధ్యా సమయంలో నిద్రించే వారు ఎల్లప్పుడూ పేదలుగా ఉంటారు. ఈ సమయంలో నిద్రించే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుటికీ ఉండదు. అందుకే సంధ్యవేళలో నిద్రపోకూడదని పెద్దలు చెబుతుంటారు.

సోమరితనం

సోమరితనం ఒక చెడు అలవాటు అని, సోమరిపోతు ఏ పనిచేయలేడు. పనిచేయని వారి వద్ద డబ్బు ఉండదు, సమాజంలో విలువ కూడా ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా సోమరితనాన్ని వదులుకోవాలని చాణక్య నీతి చెబుతుంది.

అనవసరమైన ఖర్చులు చేయడం

అనవసరమైన ఖర్చులు చేసేవారు, దుబారా ఖర్చులు చేసే వారి వద్ద డబ్బు నిలవదు, అలాంటి వారికి డబ్బు విలువ తెలియదు. వారికి డబ్బు విలువ తెలిసేనాటికి వారి వద్ద చిల్లిగవ్వ ఉండదు. అప్పుడు కష్టాల పాలవుతారు. ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు ఉండాలి, రేపటి కోసం కొంత మొత్తంలో పొదుపు చేసుకోవాలి. సరైన ఆర్థిక ప్రణాళిక కలిగిన వారే జీవితంలో విజయం సాధిస్తారు.

తదుపరి వ్యాసం