తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer Prevent Foods: క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పవర్ ఫుల్ ఆహారాలు ఇవే

Cancer prevent Foods: క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పవర్ ఫుల్ ఆహారాలు ఇవే

Haritha Chappa HT Telugu

23 January 2024, 15:00 IST

    • Cancer prevent Foods: క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆహారాలు
క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆహారాలు (pixabay)

క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆహారాలు

Cancer prevent Foods: క్యాన్సర్ అన్న పదమే ఎవరినైనా భయపెట్టేస్తుంది. ఇది ప్రాణాలు తీసే ప్రమాదకరమైన వ్యాధి. వచ్చిందంటే చికిత్స తీసుకోవడం కూడా అతి కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆధునిక వైద్యం వల్ల పూర్వంతో పోలిస్తే మరణాల సంఖ్య తగ్గుతూనే ఉంది, కానీ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు నిలుపుకోవడం సులువు. క్యాన్సర్ ముందస్తు లక్షణాలు ఏవో కూడా చాలామందికి తెలియదు. దీనివల్ల ఈ వ్యాధిని పట్టించుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది. చేయి దాటాకే క్యాన్సర్ ఉందన్న సంగతి బయటపడుతోంది. ముందుగానే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

బెర్రీ పండ్లు

స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్పెబర్రీ... ఇలా బెర్రీ జాతికి చెందిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మూత్రాశయం, ఊపిరితిత్తులు, రొమ్ము, అన్నవాహిక, చర్మ క్యాన్సర్ రాకుండా ఇవి కాపాడతాయి. కాబట్టి ప్రతిరోజు బెర్రీ జాతి పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి.

ద్రాక్ష పండ్లు

ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. తరచూ ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఈ రెస్వరాట్రాల్ క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటుంది. ద్రాక్ష పండ్లు అధికంగా తినేవారిలో కాలేయం, పొట్ట, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది.

బ్రోకలీ

శక్తివంతమైన ఆకుకూరల్లో బ్రొకోలీ ఒకటి. కాలీఫ్లవర్, బ్రొకోలీ, బ్రసెల్.. ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. వీటిని క్రూసిఫెరాస్ కూరగాయల కుటుంబంగా పిలుస్తారు. బ్రకోలీని తినేవారి సంఖ్య మన దగ్గర తక్కువే. నిజానికి బ్రకోలని తరచూ తినడం వల్ల పొట్ట క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్వర పేటిక క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలు ఇందులో ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

టమాటోలు

టమోటాలు అందరికీ అందుబాటు ధరలోనే లభిస్తాయి ప్రతిరోజు టమోటోలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఈ లైకోపీని వల్లే టమాటోలకు ఆ ఎరుపు రంగు వస్తుంది. లైక్ ఓపెన్ తినడం వల్ల మగవారు ప్రెసిడెంట్ క్యాన్సర్ దారిన పడే అవకాశాలు తగ్గుతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి

తృణధాన్యాలు

ధాన్యం ఉత్పత్తులను తృణధాన్యాలు అంటారు. క్వినోవా, బ్రౌన్ రైస్, సజ్జలు, జొన్నలు... ఇవన్నీ కూడా తృధాన్యాల కిందకే వస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, మొక్కలతో నిండిన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెరను, కొలెస్ట్రాల్‌ను పెరగకుండా అడ్డుకుంటాయి.

తదుపరి వ్యాసం