తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurveda For Diabetes। మధుమేహం సమస్యకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Ayurveda for Diabetes। మధుమేహం సమస్యకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

22 July 2023, 11:52 IST

    • Diabetes Ayurvedic Remedies: మధుమేహం, ఇతర సమస్యలను నివారించడానికి ఆయుర్వేదంలో అనేక నివారణ మార్గాలు ఉన్నాయి, కొన్ని ఇక్కడ తెలుసుకోండి.
Diabetes Ayurvedic Remedies
Diabetes Ayurvedic Remedies (istock)

Diabetes Ayurvedic Remedies

Diabetes Ayurvedic Remedies: మధుమేహంను 'సైలెంట్ కిల్లర్' గా అభివర్ణిస్తారు, ఎందుకంటే ఈ వ్యాధి శరీరాన్ని లోపల నుండి తినేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించకపోతే, మధుమేహ రోగులలో గుండె జబ్బులు, కంటి సమస్యలు, నరాల సమస్యలతో పాటు తీవ్రమైన కిడ్నీ-కాలేయం వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మధుమేహం ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స ఇప్పటివరకు లేదు. ఒకసారి మధుమేహం వచ్చిందంటే అది ఎప్పటికీ ఉంటుంది. సరైన జీవనశైలితో లక్షణాలను నియంత్రించటణ్ ఒకటే మార్గం. ఇప్పటికే మధుమేహం సమస్య ఉన్నవారు ప్రతిరోజూ దానిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు మధుమేహం రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

డయాబెటిస్‌ అనేది ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు, పిల్లల్లో కూడా టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం వేగంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, మధుమేహం ఇతర సమస్యలను నివారించడానికి, ఆయుర్వేదంలో అనేక నివారణ మార్గాలు ఉన్నాయి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో కూడా ఇవి ప్రభావవంతంగా ఉన్నాయని నిపుణులు గుర్తించారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

తిప్పతీగ

అనేక సంవత్సరాలుగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్న మూలికలలో తిప్పతీగ కూడా ఒకటి. దీనినే గిలోయ్ అని కూడా పిలుస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఈ తిప్పతీగ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తిప్పతీగ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేదం శాస్త్రం చెబుతుంది. టైప్-2 మధుమేహం ఉన్నవారికి తిప్పతీగ ఆకుల చూర్ణం లేదా పొడి చాలా ప్రభావవంతమైన ప్రభావాలను కలిగి ఉన్నట్లు రుజువైంది.

ఉసిరికాయ

ఉసిరి ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ ఉసిరికాయ తినడం ప్రయోజనకరం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడంలో, ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహంలో కనిపించే ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో ఉసిరి ప్రభావవంతమైనదని అధ్యయనాలు కనుగొన్నాయి.

కాకరకాయ

డయాబెటిస్‌ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి కూరగాయలు తీసుకోవాలని ఆందోళన చెందుతుంటే, కాకరకాయ మీకు అత్యంత ప్రయోజనకరమైన ఎంపిక. కాకరకాయను యాంటీ డయాబెటిక్ గుణాల కోసం ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాకరకాయలోని చేదు గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంలో, ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది. కాకరకాయను వండుకోవడం, కాకరకాయ రసం తాగడం లేదా దాని గింజల పొడిని తీసుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

నేరేడుపండు, గింజలు

మధుమేహం సమస్యను అదుపుచేయడానికి నేరేడుపండు ఒక రుచికరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. నేరేడుపండు మాత్రమే కాదు దీని గింజల నుంచి తయారుచేసే పొడి (Jamun seed powder) కూడా మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉన్నట్లు ఆయుర్వేదం పేర్కొంది. నేరేడుపండు హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మధుమేహంకు సంబంధించి ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ప్రయోజనకరమైన ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ , పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు నేరేడులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం