తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hydratespark | ఆపిల్ స్మార్ట్ వాటర్ బాటిల్‌.. ఏముంది ఇందులో ప్రత్యేకత?

HydrateSpark | ఆపిల్ స్మార్ట్ వాటర్ బాటిల్‌.. ఏముంది ఇందులో ప్రత్యేకత?

HT Telugu Desk HT Telugu

28 April 2022, 17:38 IST

    • ఫోన్లు తయారుచేసే ఆపిల్ సంస్థ తాజాగా హైడ్రేట్‌స్పార్క్ పేరుతో స్మార్ట్ వాటర్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లో వదిలింది. ఈ వాటర్ బాటిళ్లలో నీరు తాగటం వలన వ్యక్తుల జీవితానికి సాధికారత లభిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రకటించుకుంది.
HydrateSpark
HydrateSpark

HydrateSpark

ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తాజాగా హైడ్రేట్‌స్పార్క్ పేరుతో స్మార్ట్ వాటర్ బాటిల్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. పేరుకు తగ్గట్టే ఇది చాలా స్మార్ట్ వాటర్ బాటిల్. ఎందుకంటే మామూలు వాటర్ బాటిళ్లలాగా కాకుండా ఇది ఒక చిన్న ఫ్రిజ్ లాగా పనిచేస్తుంది. ఈ బాటిల్‌లో స్టెయిన్‌లెస్-స్టీల్ వాక్యూమ్-ఇన్సులేటెడ్ చగ్ ఉంది. ఇది పానీయాలను 24 గంటల వరకు చల్లగా ఉంచుతుంది. అలాగే బాటిల్‌లోని సేఫ్టీ స్పౌట్ కవర్ మీకు సురక్షితమైన ఫిల్టర్ నీటిని అందిస్తుంది. అంటే ఈ వాటర్ బాటిల్‌ ఒక చిన్న వాటర్ ఫిల్టర్ కూడా.

అంతేనా? ఈ హైడ్రేట్‌స్పార్క్ బాటిల్‌లో కొన్ని స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అవేంటంటే.. బాటిల్ దిగువన LED స్మార్ట్ సెన్సార్‌ ఉంది. ఇది మీరు రోజువారీగా తీసుకునే నీటిని మానిటర్ చేయగలదు. మీకు ఒకరోజులో ఎంత మొత్తంలో నీరు అవసరం అవుతుంది. ఇప్పటివరకు ఎంతనీరు వినియోగించారు? మొదలగు సమాచారం ఇస్తుంది. రోజులో తాగాల్సిన నీటి కంటే తక్కువ మొత్తంలో తీసుకుంటే ఈ బాటిల్ అలర్ట్స్ జారీ చేస్తుంది. మీ రోజూవారీ నీటి అవసరాలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఇది పొందుపరుస్తుంది. 

మీరు ఈ వాటర్ బాటిల్‌ను బ్లూటూత్ కనెక్షన్ ద్వారా Apple హెల్త్‌ Appకు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఆపిల్ స్మార్ట్‌ఫోన్, Apple వాచ్‌, ఇతర ఐఓఎస్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. నీటి వినియోగాన్ని మీ వయసు, బరువుకు తగినట్లుగా సవరించుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. హైడ్రేట్‌స్పార్క్ 3 స్మార్ట్ వాటర్ బాటిల్, హైడ్రేట్‌స్పార్క్ PRO స్మార్ట్ వాటర్ బాటిల్ , హైడ్రేట్‌స్పార్క్ STEEL Chug + Bonus Straw Lid, ఇంకా హైడ్రేట్‌స్పార్క్ PRO స్టీల్ స్మార్ట్ వాటర్ బాటిల్.

వేరియంట్‌లను బట్టి ధరలు ఉన్నాయి. మన భారతీయ కరెన్సీ ప్రకారం ధరలు రూ. 4,600/- నుంచి ప్రారంభమై రూ. 6,125 వరకు ఉన్నాయి. చాలా చౌక! నీరు తాగటానికి ఈ మాత్రం వాటర్ బాటిల్ ఒకటి అవసరమే కాబట్టి మీకు ఆసక్తి ఉంటే  ఆపిల్ అధికారిక సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం