తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menopause In Men: ఆడవారికే కాదు మగవారికి కూడా మెనోపాజ్ వస్తుంది, దాని లక్షణాలు ఇలా ఉంటాయి

Menopause in Men: ఆడవారికే కాదు మగవారికి కూడా మెనోపాజ్ వస్తుంది, దాని లక్షణాలు ఇలా ఉంటాయి

Haritha Chappa HT Telugu

31 January 2024, 9:58 IST

    • Menopause in Men: మెనోపాజ్ అనగానే ఆడవారికి మాత్రమే వస్తుందని అనుకుంటారు. నిజానికి పురుషుల్లో కూడా మెనోపాజ్ వస్తుంది. ఆ దశలో వాళ్ళలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.
మగవారిలో మెనోపాజ్ వస్తుందా?
మగవారిలో మెనోపాజ్ వస్తుందా? (pixabay)

మగవారిలో మెనోపాజ్ వస్తుందా?

Menopause in Men: స్త్రీలలో మెనోపాజ్ అనగానే నెలసరి ఆగిపోవడం. అయితే పురుషులకు ఇలాంటి సమస్య ఉండదు కాబట్టి వారికి మెనోపాజ్ రాదు అనుకుంటారు. నిజానికి మగవారికి కూడా వస్తుంది. దీన్ని ఆండ్రోపాజ్ అని పిలుస్తారు. వారి వయసు పెరుగుతున్న కొద్దీ ఇది ఏదో ఒక సమయంలో సంభవిస్తుంది. మగవారిలో మెనోపాజ్ వస్తే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. అంగస్తంభన సమస్య పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. బరువు పెరుగుతారు. డిప్రెషన్ బారిన పడతారు. ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇవన్నీ వారు మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నారని చెప్పే లక్షణాలు. మగవారిలో మెనోపాజ్ 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వస్తుంది. ఎక్కువగా 45 ఏళ్ల వయసులో వారికి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

ఆండ్రోపాజ్ లక్షణాలు

ఆడవారిలో మెనోపాజ్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మగవారిలో ఆండ్రోపాజ్ వచ్చినా కూడా అలానే ఉంటాయి. ఆండ్రోపాజ్ దశలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు చాలా త్వరగా తగ్గిపోతాయి. 70 ఏళ్ల వయసు వచ్చేసరికి టెస్టోస్టెరాన్ స్థాయిల్లో దాదాపు 50 శాతం పడిపోతాయి. అందుకే ఆ వయసులో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. శారీరకంగా బలహీనంగా ఉంటారు. మెదడు సవ్యంగా పనిచేయదు. టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడం వల్ల వారిలో లైంగిక శక్తి తగ్గిపోతుంది. లైంగిక ప్రక్రియకు టెస్టోస్టెరాన్ చాలా ముఖ్యమైనది. దాని స్థాయిలో తగ్గుదల ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీకు ఆ వైపుగా ఆలోచనలు రావు. అలాగే మగవారిలో ఆండ్రోపాజ్ దగ్గర పడుతున్నప్పుడు అంగస్తంభనకు దారితీస్తుంది. దీనివల్ల వారు లైంగిక ప్రక్రియను నిర్వహించలేరు.

పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం ఆండ్రోపాజ్ దశలో ముఖ్యమైన భాగమే. ఇది ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే శక్తి స్థాయిలు చాలా మేరకు తగ్గిపోతాయి. త్వరగా అలసిపోతారు. నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. నిద్రలేమి వంటి సమస్యల బారిన పెడతారు. ఏ విషయాన్ని ఏకాగ్రతగా వినలేరు. చికాకు, కోపం త్వరగా వస్తాయి. మానసికంగా చాలా కల్లోలంగా ఉంటారు. ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తింటూ ఉంటే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రతిరోజూ నడక, ఇతర చిన్న వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపట్టే వాతావరణాన్ని ఇంట్లో కల్పించుకోవాలి. ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. అప్పుడే ఆండ్రోపాజ్ దశను మీరు విజయవంతంగా దాటగలుగుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం